తెలంగాణ

సిరిసిల్లలో టెన్షన్..టెన్షన్..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 30: సిరిసిల్లలో దళితుల పక్షా న నిలబడి పోరాటం చేసే విషయంలో నిర్వహించాలనుకున్న బహిరంగ సభ అంశం ఇప్పుడు కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మకంగా మారింది. సిరిసిల్లలో సభ నిర్వహించి తీరాలన్న పట్టుదలతో కాంగ్రెస్ ఉండగా, ఏ విధంగానైనా భగ్నం చేయాలన్న భావనతో పోలీసు లు ఉన్నట్లు తెలుస్తోంది. సిరిసిల్లలో దళితులను పోలీసులు అరెస్టు చేసి దిగ్భందించడంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ (టి.పిసిసి) ఈ నెల 31న (సోమవారం) సభ నిర్వహించాలన్న పట్టుదల, పక్కా ప్రణాళికతో కాం గ్రెస్ సిద్ధమైంది. కాగా ఈ సభలో పాల్గొనేందుకు లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ ఆదివారం రాత్రి 7.30 గంటలకు విస్తారా సంస్ధకు చెందిన విమానంలో ఢిల్లీ నుంచి నగరానికి చేరుకున్నారు. హైదరాబాద్‌లో ఉంటే పోలీసులు దిగ్బంధించే అవకాశం ఉందని భావించిన నాయకులు ఆమెను శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా కరీంనగర్‌కు తీసుకుని వెళ్లారు. సిరిసిల్ల సభ నిర్వహణకు పోలీసులు అనుమతించ లేదు. దీంతో టి.పిసిసి నేతలు హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం ఉదయం తీర్పు తమకు అనుకూలంగా వస్తుందన్న ఆశాభావంతో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. పోలీసులకు రెండు వైపులా ఇబ్బంది ఉంది. అనుమతిస్తే ప్రభుత్వం నుం చి మాట వస్తుందన్న భయం లేకపోలేదు. మరోవైపు మీరాకుమార్ హాజరుకానున్న సభను భగ్నం చేయ డం ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి, పోలీసులకూ జాతీయ స్థాయిలో అప్రతిష్ట వస్తుందా? అనే కోణం లో ఆలోచిస్తున్నారు. కోర్టు అనుమతిస్తే, ఆ వంకతో వదిలి వేయవచ్చన్న భావన పోలీసు అధికారుల్లో కనిపిస్తున్నది. సిరిసిల్లలో ఎట్టిపరిస్థితుల్లో సభ నిర్వహించి పైచేయి కావాలన్న పట్టుదలతో టి.పిసిసి నాయకత్వం పట్టుదలతో ఉంది. దళితులను పోలీసులు దిగ్భందించడం అనే సున్నితమైన అంశాన్ని వదలకుండా ప్రభుత్వాన్ని ఎండగట్టాలని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఈ దెబ్బతో దళితులకు మరింత దగ్గర కావాలన్న ఆలోచనతో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. సిరిసిల్లలో కాంగ్రెస్ సభ నిర్వహించనున్నందున పోలీసుల మోహరింపు, వివిధ జిల్లాల నుంచి నాయకులు అక్కడికి చేరుకుని మకాం వేస్తుండడంతో అక్కడ అంతా టెన్షన్-టెన్షన్‌గా ఉంది.