తెలంగాణ

డిజిపి కార్యాలయం ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 31: తెలంగాణ డిజిపి కార్యాలయం ఎదుట ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దొంగతో అక్రమ సంబంధం అంటగట్టారంటూ తొమ్మిది నెలలుగా న్యాయం కోసం పోరాటం చేస్తున్న సదరు మహిళ ఫినాయిలు తాగి సోమవారం సాయంత్రం డిజిపి కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పరిస్థితి విషమించడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. బాధిత మహిళ ఖమ్మం జిల్లావాసిగా గుర్తించారు. దొంగతో అక్రమ సంబంధం అంటగట్టి, తనపై నిందమోపిన ఎస్‌ఐ రామ్‌చరణ్‌పై చర్యలు తీసుకోవాలని ఆమె గతంలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని ఆశ్రయించింది. దీంతో డిఎస్పీ స్థాయి అధికారితో విచారణ జరిపించి, ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలని హోంమంత్రి ఆదేశించారు. అయినా..ఎస్‌ఐ రామ్‌చరణ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆమె న్యాయం కోసం సీఎం, డిజిపి ఆఫీసుల చుట్టూ తిరుగుతోంది. చివరకు సోమవారం సాయంత్రం డిజిపి కార్యాలయం వద్ద ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.
ఎస్‌ఐపై చర్యకు డిజిపి ఆదేశం
మహిళను దొంగతో అక్రమ సంబంధం అంటగట్టిన ఎస్‌ఐ రామ్‌చరణ్‌పై విచారణ జరపాలని డిజిపి అనురాగ్ శర్మ ఆదేశించారు. ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై ఆయన స్పందించారు. ఖమ్మం జిల్లా ఎస్పీతో మాట్లాడి, ఎస్‌ఐపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు డిజిపి అనురాగ్ శర్మ సోమవారం మీడియాకు తెలిపారు.