తెలంగాణ

వర్గీకరణకు చర్యలు చేపట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 1: ఎస్సీ వర్గీకరణ చేయకుంటే తెలంగాణలో బిజెపి నాయకులను తిరగనివ్వమని తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. ఎస్సీ వర్గీకరణ కోరుతూ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి నేతృత్వంలో మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో వౌన దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పిడమర్తి రవి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణను అడ్డుపెట్టుకొని వెంకయ్య నాయుడు ఉప రాష్టప్రతి బరిలో నిలిచారని వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ మాదిగలను ఓటు బ్యాంకుగా చూస్తున్నారని ఆయన విమర్శించారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తామని ఎన్నికల వాగ్ధానం చేసిన బిజెపి, ఇప్పటికే 10 సార్లు పార్లమెంట్ సమావేశాలు జరిగినా పట్టించుకోలేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలి అసెంబ్లీ సమావేశంలోనే ఎస్సీ వర్గీకరణపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అసెంబ్లీలో తీర్మానం చేశారని, అయినా కేంద్రం ఎస్సీ వర్గీకరణ చేయకుండా జాప్యం చేస్తున్నదని మండిపడ్డారు.