తెలంగాణ

రూ.16,105 కోట్ల రుణ మాఫీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 1: రైతులను అప్పుల బాధ నుంచి విముక్తి చేసేందుకు 16,105 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు వ్యవసాయ ఉత్పత్తి కమిషనర్, కార్యదర్శి పార్థసారథి తెలిపారు. దీంతో 35 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరిందని ఆయన చెప్పారు. శిక్షణ పొందుతున్న ఐఎఎస్‌లు డాక్టర్ సచిన్, యోగిందర్ సింగ్, అషికా జైన్ మంగళవారం సచివాలయంలో పార్థసారథిని కలిసారు. ఈ సందర్భంగా పార్థసారథి వారికి తెలంగాణ పంటలు, సూక్ష్మ సేద్యం, పంటల సరళి, మార్కెటింగ్‌లో గిడ్డంగుల నిర్మాణం వంటి అనేకానేక అంశాలతో పాటు రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాల గురించి వివరించారు. వ్యవసాయానికి 9 గంటలు ఉచిత విద్యుత్తు సరఫరా చేస్తున్నదని, భవిష్యత్తుల్లో 24 గంటలూ ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నదని ఆయన తెలిపారు.
వ్యవసాయం విస్తరణ రంగం బలోపేతం చేసే దిశలో 1526 విస్తరణాధికారులను నియమించిందని ఆయన తెలిపారు. 300 కోట్ల రూపాయలు కేటాయింపులతో వ్యవసాయ యాంత్రీకరణ పథకం తెలంగాణలో అమలు అవుతున్నదని ఆయన చెప్పారు. వాతావరణం, భూసార ఆధారిత పంటల సరళినే కాకుండా ఆయా ప్రదేశాల అవసరాలు, మార్కెటింగ్ సదుపాయాలు దృష్టిలో పెట్టుకుని తెలంగాణను పంటల మాండలికాలు (క్రాప్ కాలోనీస్)గా అభివృద్ధి చేస్తున్నామని ఆయన తెలిపారు.
తెలంగాణ విత్తనోత్పత్తికి అనువైన రాష్ట్రం అని విత్తన భాండాగారంగా తీర్చి దిద్దడానికి చేస్తున్న ప్రయత్నాలను ఆయన వారికి వివరించారు. ఉద్యాన శాఖ ద్వారా ఇప్పటి వరకు 363 కోట్లతో 1150 ఎకరాలలో పాలి హౌజ్‌ల నిర్మాణం చేపట్టామని, అలాగే 1092 కోట్ల నాబార్డు రుణంతో 4 లక్షల ఎకరాలలో సూక్ష్మ సేద్యం చేపడుతున్నామని చెప్పారు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో 30.82 కోట్లతో స్పైస్ పార్కు స్థాపిస్తున్నామని, జీడిమెట్లలో కూరగాయలు, పూల సాగు నిమిత్తం సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్‌ని స్థాపించామని పార్థసారథి వివరించారు.