తెలంగాణ

విద్యామండలి చైర్మన్ పదవికి పోటా పోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 1: తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ పదవి ఆగస్టు 4వ తేదీన ఖాళీ అవుతుండటంతో 20 మంది విద్యానిపుణులు తమ దరఖాస్తులను ప్రభుత్వానికి పంపించారు. వైస్ ఛాన్సలర్ హోదాలో పనిచేసిన వారు లేదా సీనియర్ ప్రొఫెసర్‌కు మాత్రమే ఉన్నత విద్యామండలి చైర్మన్ పదవిలో నియమించే సంప్రదాయాన్ని గతంలో తెలంగాణ ప్రభుత్వం సడలించి ప్రొఫెసర్ టి పాపిరెడ్డిని చైర్మన్‌గా నియమించింది. ఆయన పదవీకాలం ఆగస్టు 4వ తేదీతో ముగుస్తోంది. తెలంగాణ- ఆంధ్రా ఉన్నత విద్యా మండళ్ల మధ్య వివాదాలు, ఆన్ లైన్‌లో పరీక్షల నిర్వహణ, సర్దుబాటు వ్యవహారాలతో మూడేళ్లు గడచిపోయాయి.
ఉన్నత విద్యాప్రమాణాలను కాపాడేందుకు, ఇంజనీరింగ్ కాలేజీల ఫీజుల వ్యవహారం, కొత్త డిగ్రీ, పిజి కాలేజీల ఏర్పాటు, నూతన వృత్తివిద్యా కళాశాలల ఏర్పాటు, ఆన్‌లైన్‌లో డిగ్రీ అడ్మిషన్లు వంటి సంచలన నిర్ణయాలనే తీసుకున్నా గందరగోళం మధ్య అన్నీ మరుగునపడిపోయాయి. మండలిని గాడిలో పెట్టి, రాష్ట్రంలో ఉన్నత విద్యకు ఒక రూపాన్ని ఇవ్వాలంటే మరో మూడేళ్ల పాటు పదవీకాలాన్ని పొడిగించాలని ప్రొఫెసర్ పాపిరెడ్డి కోరుతుండగా, ఇప్పటికే మూడేళ్లపాటు ఉపాధ్యక్షుడిగా అనుభవం గడించిన ప్రొఫెసర్ వెంకటాచలం తనకు చైర్మన్‌గా అవకాశం కల్పించాలని కోరుతున్నారు. కాగా ఉస్మానియా యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్‌గా పనిచేసిన ప్రొఫెసర్ టి తిరుపతిరావును చైర్మన్‌గా నియమించే అవకాశం ఉందని ఇప్పటికే వార్తలు షికారు చేస్తున్నాయి.