తెలంగాణ

కాల్పుల ఘటన.. ఓ హైడ్రామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 1: మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్ తనయుడు విక్రమ్‌గౌడ్‌పై కాల్పుల ఘటనలో పోలీసులు పురోగతి సాధించారు. విక్రమ్‌గౌడ్ కాల్పుల ఘటన మిస్టరీని ఛేదించారు. పథకం ప్రకారమే కాల్పుల డ్రామా జరిగినట్టు పోలీసుల విచారణలో స్పష్టమైంది. గత నెల 28న విక్రమ్‌గౌడ్‌పై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. పబ్‌ల నిర్వహణ, సినీ నిర్మాతగా విక్రమ్‌గౌడ్ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడు. ఫైనాన్షియర్ల బెదిరింపులు, అప్పుల బాధ నుంచి తప్పుకునేందుకు, డబ్బు కోసం తన తండ్రిని బెదిరించేందుకు విక్రమ్‌గౌడ్ సుపారి ఇచ్చి హత్యాయత్నం డ్రామా అడినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ కేసులో ఐదుగురిని పోలీసలు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విక్రమ్ చెబితేనే తాము కాల్పులు జరిపినట్టు వారు పోలీసుల విచారణలో ఒప్పుకున్నారు. కాగా విక్రమ్, అతని భార్య షిపాలి పొంతనలేని సమాధానాలతో కేసును తప్పుదోవ పట్టించాలని పోలీసులు భావిస్తున్నారు. విక్రమ్‌పై జరిపిన తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలావుండగా కాల్పుల ఘటన జరిగిన నాటి నుంచి కేసు రోజుకో మలుపు తిరిగింది. కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు పది బృందాలతో దర్యాప్తు చేపట్టారు. ప్రధానంగా విక్రమ్ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు హత్యాయత్నం డ్రామా అడినట్టు పోలీసు విచారణలో స్పష్టమైంది. దీంతో విక్రమ్, షిపాలి సహ ఐదుగురిపై ఆయుధ చట్టం కింద బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆరు నెలల క్రితమే విక్రమ్ తనపై కాల్పులు జరపాలని పక్కా పథకం రచించాడు. మూడుసార్లు రెక్కి కూడా జరిగింది. విక్రమ్ తీసిన ఓ సినిమాలో నటించిన ఇండోర్‌కు చెందిన నందు అనే షార్ప్ షూటర్‌తో మూడు రౌండ్లు కాల్పులు జరిపే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నాడు. తుపాకీ కోసం విక్రమ్ ఇండోర్‌కు వెళ్లి, షార్ప్ షూటర్‌తో విందు, వినోదాల్లో పాల్గొన్నాడు. ఐదు సార్లు రెక్కి నిర్వహించిన అనంతరం విక్రమ్‌గౌడ్ తన ఇంట్లో సిసి కెమెరాలు తొలగించాడు.
వ్యాపార రంగంలో రాణించలేకపోయిన విక్రమ్ ఆర్థికంగా బలహీన పడడమే కాకుండా, అప్పుల్లో కూరుకుపోయాడు. స్థిరాస్తులు కరిగిపోవడంతో తన తండ్రి ముఖేష్‌గౌడ్ కూడబెట్టిన ఆస్తులు తన బంధువు పేరుతో ఉండటాన్ని విక్రమ్ జీర్ణించుకోలేకపోయాడు. పైగా తనకు ఆస్తి దక్కకుండా బాబాయ్ కట్టడి చేస్తున్నాడనే భయం కూడా విక్రమ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఓ వైపు సొంత ఆస్తి దక్కకపోవడం, మరోవైపు వ్యాపారంలో నష్టాలు, ఇంకో వైపు నుంచి ఫైనాన్షియర్ల ఒత్తిడి వంటివే విక్రమ్‌ను ఆత్మహత్య డ్రామాకు పురిగొల్పినట్టు సమాచారం.
ఇదిలావుండగా విక్రమ్ తన తండ్రి ముఖేష్‌గౌడ్ మంత్రిగా ఉన్న సమయంలో పలువురిని బెదిరించిన కేసుల్లో నిందితుడు. నగరంలోని పలు సెటిల్‌మెంట్లు జరిపినట్టు ఆరోపణలున్నాయి. వీటిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అదేవిధంగా గ్యాంగ్‌స్టర్ నరుూమ్‌తో సంబంధాలు, అక్రమ వ్యాపారాలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నట్టు సమాచారం.