ఆంధ్రప్రదేశ్‌

డ్రోన్లతో ఇళ్ల నిర్మాణాల పర్యవేక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఆగస్టు 2: రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ఎన్టీఆర్ నగర్- పిఎంఎవై పథకం కింద నిర్మించ తలపెట్టిన పేదల గృహ సముదాయాలను వేగవంతంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. 15 రోజులకు ఒకసారి డ్రోన్ కెమేరాలతో గృహ సముదాయాల నిర్మాణం పనుల పురోగతిని చిత్రీకరించి, తనకు వివరించాలని ఆదేశించారు. లబ్ధిదారుల తుది జాబితాను సత్వరం రూపొందించాలని, ఇప్పటికే ఎంపికైన లబ్ధిదారులకు గృహ మంజూరు పత్రాలను అందించాలని చెప్పారు. బుధవారం పురపాలక - పట్టణాభివృద్ధి శాఖపై ముఖ్యమంత్రి సచివాలయంలోని తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిగూడెంలో ఎన్టీఆర్ నగర్‌కు భూమిపూజ చేశామని, భీమవరం, పాలకొల్లులో వచ్చేవారం శంకుస్థాపనలు చేసి పనులు ప్రారంభిస్తామని అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. అలాగే మిగిలిన జిల్లాల్లో గృహ సముదాయాలు ఏయే దశల్లో వున్నాయో చెప్పారు. సిఆర్‌డిఎ పరిధిలో మొత్తం 5,024 ఇళ్ల నిర్మాణాన్ని కెఎంవి ప్రాజెక్ట్ లిమిటెడ్ సంస్థ చేపట్టిందని తెలిపారు. నంద్యాలలో ఎన్టీఆర్‌నగర్ నిర్మాణ సంస్థ అయిన షాపూర్‌జీ పల్లంజీ ప్రతినిధులు ప్రతివారం ప్రగతి నివేదిక తనకు అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రకాశం జిల్లా దొనకొండలో కన్‌స్ట్రక్షన్ సిటీని నిర్మిస్తున్నామని, ఇక్కడ నిర్మాణ రంగానికి సంబంధించి అవసరమైన సకల సామగ్రి అందుబాటులోకి తెస్తామని చెప్పారు. కన్‌స్ట్రక్షన్ సిటీ పూర్తయితే గృహ నిర్మాణ రంగానికి మరింత ఊతం లభిస్తుందని అన్నారు. ప్రభుత్వం చేపట్టే గృహ నిర్మాణాలకు సంబంధించి నాణ్యతను పరిశీలించేందుకు, పనుల పర్యవేక్షణకు నియమించిన ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ తనకు వారం వారం నివేదిక సమర్పించాలని చెప్పారు. కాగా 1,92,870 మంది చిన్నారులు చదువుతున్న అంగన్‌వాడి ప్రీస్కూళ్లలో బోధనకు సంబంధించి అత్యాధునిక వౌలిక వసతులు కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఒకటి నుంచి ఐదో తరగతి మధ్య గతేడాది 1,14,107 మంది విద్యను అభ్యసిస్తే వారి సంఖ్య ఈ విద్యా సంవత్సరంలో పదిశాతం పెరిగి 1,25,521కు చేరిందన్నారు. ఆరు నుంచి పదో తరగతి మధ్య చదివే విద్యార్థుల సంఖ్య 7.5 శాతం పెరిగి 1,44,716కు చేరిందన్నారు. ఆరు నుంచి పదో తరగతి (కెరియర్ ఫౌండేషన్ కోర్సు) చదివే విద్యార్థుల సంఖ్య మాత్రం గత ఏడాది కన్నా ఏకంగా 59 శాతం పెరిగిందన్నారు. ఈ కోర్సు విభాగంలో మొత్తం 57,124 మంది చదువుతున్నారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం చదువులను ప్రవేశపెట్టినప్పటికి తప్పనిసరి చేయొద్దని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టంగా చెప్పారు. ఇంగ్లీష్ మీడియం విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి విశేష స్పందన వస్తోందని అధికారులు చెప్పగా, సమాజం కూడా హర్షించేలా తెలుగును పదికాలాలు పదిలంగా కాపాడుకుందామని ముఖ్యమంత్రి అన్నారు. ఎవరికీ మాతృభాషను నిర్లక్ష్యం చేస్తున్నారనే భావన రాకూడదని చెప్పారు. 45 రోజుల్లో వీధికుక్కలు, పందుల నియంత్రణ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి లక్ష్యం నిర్దేశించారు. పందుల పెంపకంపై రాష్ట్రంలో ఆధారపడివున్న సుమారు 4,752 కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపాలని బాబు సూచించారు.