ఆంధ్రప్రదేశ్‌

రాష్టవ్య్రాప్తంగా చౌక డిపోల్లో సర్వర్ల మొరాయంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 2: అత్యాధునిక టెక్నాలజీతో రేషన్‌కార్డులకు నిత్యావసర సరుకులు అందజేస్తామని పదేపదే చెబుతున్న ప్రభుత్వం ఆమేర పూర్తి స్థాయిలో మెకానిజాన్ని వృద్ధి చేసుకోలేకపోవటం నిరుపేద తెల్లరేషన్ కార్డుదారుల పాటిట శాపంలా మారుతున్నది. వాస్తవానికి ప్రతి నెల ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు సరుకులు తీసుకొనే అవకాశం ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఐదో తేదీ లోపులోనే కార్డుదారులందరికీ సరుకులు పంపిణీ చేయాలంటూ రాష్ట్రంలోని చౌక దుకాణదారులపై అధికారులు ఒత్తిడి తెస్తున్న కారణంగా గత కొద్ది మాసాలుగా ఒకటి రెండు తేదీల్లోనే రద్దీ పెరుగుతున్నది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలల ప్రకారం గత జూన్ నుంచి చక్కెర, కిరోసిన్ పంపిణీ నిలిచిపోయింది. ప్రస్తుతం బియ్యం ఒక్కటే పంపిణీ జరుగుతుంటే మంగళ, బుధవారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 30వేల చౌకడిపోల్లో ఇ-పోస్ సర్వర్లు సక్రమంగా పని చేయక మధ్య మధ్యలో మొరాయిస్తూ వస్తున్నాయి. ఫలితంగా జూలై 1, 2 తేదీల్లో 30 నుంచి 40 లక్షల కార్డుదారులకు బియ్యం పంపిణీ జరుగ్గా ఆగస్టు 1, 2 తేదీల్లో ఏడు లక్షల కార్డుదారులకు మించి పంపిణీ జరగలేదు. సగటున ఒక్కో షాపులో 25 కార్డుదారులకు మాత్రమే అందించగలిగారు. ఈ లెక్కన రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది గంటల తరబడి క్యూలో నిలబడి వెనుదిరగాల్సి వస్తున్నది. వాస్తవానికి కూలీకి వెళితే ఒక్కొక్కరు కనీసం రూ. 300పైగా సంపాదించుకుంటుంటే ఐదు పది కిలోల కోసం రెండు రోజులు పాటు కూలీ పని మానుకోవాల్సి వస్తున్నదని పలువులు ఆందోళన చెందుతున్నారు. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా రాష్ట్రంలో సర్వర్‌ల సంఖ్యను పెంచలేకపోవడంతో ఈ సమస్యలు ఎదురవుతున్నాయని చౌకడిపోదారుల సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు దివి లీలా మాధవరావు ఆంధ్రభూమి ప్రతినిధితో అన్నారు. తరచు వస్తున్న ఈ సాంకేతిక సమస్యను ప్రభుత్వం తక్షణం పరిష్కరించని పక్షంలో చౌకడిపోలను మూసివేస్తామని హెచ్చరించారు.