ఆంధ్రప్రదేశ్‌

చుక్కల భూముల వివరాల నమోదుకు శ్రీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 2: రాష్టవ్య్రాప్తంగా చుక్కల భూముల రైతుల వివరాల నమోదుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే చుక్కల భూముల చట్టం తీసుకుని వచ్చిన ప్రభుత్వం, ఆ మేరకు రికార్డుల్లో ఆయా భూ యజమానుల వివరాలను నమోదు చేసే ప్రక్రియను ప్రారంభించింది. దీనిని బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ లాంఛనంగా ప్రారంభించారు. 1803లో అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం తొలిసారిగా భూముల సర్వే చేస్తున్న సమయంలో కొన్ని భూములకు సంబంధించి రీ-సెటిల్‌మెంట్ రిజిస్టరులో వివరాలు నమోదు చేయకుండా చుక్కలు పెట్టింది. దీంతో అవి రెవెన్యూ రికార్డుల్లో చుక్కల భూములుగానే ఉండిపోయాయి. రాష్ట్రంలో అనంతపురం, కర్నూల్, కడప, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కృష్ణా, చిత్తూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో 24.17 లక్షల ఎకరాల మేర చుక్కల భూములుగా రెవెన్యూ రికార్డుల్లో ఉన్నాయి. ఇందులో 17.7 లక్షల ఎకరాలను కొంతమందికి అసైన్ చేశారు. 1.8 లక్షల ఎకరాలు కొందరి హక్కు భుక్తాల్లో ఉండగా, 3.4 లక్షల ఎకరాలు ఆక్రమణల్లో ఉన్నాయి. 2.26 లక్షల ఎకరాలు ఎటువంటి ఆక్రమణలు లేకుండా ఉన్నట్లు రెవెన్యూ రికార్డులు తెలియచేస్తున్నాయి. లక్షలాది ఎకరాలు చుక్కల భూములుగా ఉండటంతో ఈ భూముల క్రయవిక్రయాల్లో ఆయా భూములు సాగు చేస్తున్న రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోర్టు వివాదాలు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ డాటెడ్ ల్యాండ్ (పునర్ నిర్ధారణ రిజిస్టర్ సవరణ) చట్టాన్ని ప్రభుత్వం తీసుకువచ్చింది. దీంతో రిజిస్టర్‌లో ఆయా భూముల యజమానుల వివరాలను నమోదు చేసే ప్రక్రియ ప్రారంభమైంది. చుక్కల భూములను సాగు చేస్తున్న రైతులు తగిన ఆధారాలతో మీ-సేవ కేంద్రం ద్వారా ఫారం-3లో జిల్లా కమిటీకి వివరాలను అందచేయాల్సి ఉంటుంది. జిల్లా కమిటీ ఆ వివరాలను విచారణ నివేదిక, ఇతర రికార్డులను పరిశీలించి తగిన ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఆ ఉత్తర్వులకు అనుగుణంగా రీ-సెటిల్‌మెంట్ రిజిస్టరు, ఇతర రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేస్తారు.