ఆంధ్రప్రదేశ్‌

త్వరలో ఉద్యోగులకు ఇళ్ల నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 2: ఉద్యోగ సంఘాలతో చర్చించి తక్షణమే ఉద్యోగుల ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలని సిఎం చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐఎఎస్ అధికారులు, జ్యూడీషియల్ అధికారులతో పాటు నాలుగో తరగతి ఉద్యోగుల వరకు అందరికీ ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. సచివాలయ ఉద్యోగుల ఇళ్లకు సంబంధించి ముఖ్యమంత్రికి నివేదిక అందజేశామన్నారు. ఆయన అందులో కొన్ని మార్పులు చేర్పులు చేసి ఉద్యోగ సంఘాలతో చర్చించాలని సూచించారన్నారు. అమరావతిలో 1800, 1500, 900 అడుగుల విస్తీర్ణంలో ఇళ్ల నిర్మాణం చేపట్టాలని సిఎం చంద్రబాబు సూచించారన్నారు. వాటికి ఉద్యోగ సంఘాల అంగీకరిస్తే తక్షణమే టెండర్లు పిలిచి ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలన్నారు. ఉద్యోగులు ఏవైనా మార్పులు సూచిస్తే వచ్చే బుధవారం మరోసారి సిఎంని కలిసి వివరిస్తామన్నారు.
కాపులకు కచ్చితంగా న్యాయం చేస్తాం
కాపులకు ఎట్టి పరిస్థితుల్లోనూ న్యాయం చేసి తీరుతామని నారాయణ స్పష్టం చేశారు. కాపుల రిజర్వేషన్లపై కాంగ్రెస్ పదేళ్ల పాలనలో ఏనాడూ నోరెత్తని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ఇప్పుడు రాద్ధాంతం చేస్తున్నారన్నారు. 30 ఏళ్ళు నిరీక్షించిన ముద్రగడ మరో రెండు మూడు నెలలు వేచి చూడలేరా అని ప్రశ్నించారు. మంజునాథ కమిషన్ నివేదిక అందజేసిన వెంటనే అసెంబ్లీలో ఆమోదించి, పార్లమెంట్ ద్వారా అనుమతి పొంది కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. చట్టపరమైన ఇబ్బందులు తలెత్తకూడదన్న ఉద్దేశంతో సిఎం చంద్రబాబు ముందు చూపుతో సాగుతున్నారన్నారు.