తెలంగాణ

రామానాయుడు స్టూడియోలో డ్రగ్స్ కలకలం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 2: డ్రగ్స్ కేసు నేపథ్యంలో రామానాయుడు సినీ స్టూడియోలో డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపింది. విదేశాల నుంచి రామానాయుడు స్టూడియోకు వచ్చే పార్శిల్స్‌పై తెలంగాణ ఎక్సైజ్ శాఖ నిఘా వేసింది. స్టూడియోకు విదేశాల నుంచి వచ్చిన ఒక పార్శిల్‌ను ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్‌పెక్టర్ కనకదుర్గ స్వయంగా వెళ్లి పరిశీలించారు. కాగా ఈ ఘటనపై రానా తండ్రి సురేష్ బాబు స్పందిస్తూ, వెన్నునొప్పికి వాడే పరికరాలను రానా తెప్పించుకున్నారని చెప్పినట్టు సిఐ తెలిపారు. అయితే ఈ ఆకస్మిక తనిఖీలపై టాలీవుడ్ విస్మయం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. డ్రగ్స్ కేసులో టాలీవుడ్ ప్రముఖుల సిట్ విచారణ పూర్తయిన మరుసటి రోజే రామానాయుడు స్టూడియోకు వచ్చిన పార్శిల్స్‌పై ఎక్సైజ్ శాఖ నిఘా పెట్టడం సంచలనమైంది. ఈ పరిణామాలతో ఇండస్ట్రీలోని కొందరు పెద్దలు కూడా కలవరానికి గురైట్టు సమాచారం. ఇప్పటికే టాలీవుడ్ పెద్దల వారసులు డ్రగ్స్ తీసుకుంటున్నారనే అనుమానాన్ని సిట్ అధికారులు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. డ్రగ్స్ వాడకంపై నోటీసులు అందుకున్న సినీ ప్రముఖులను విచారించటంతోనే అల్లాడిపోయిన సినీపరిశ్రమ ఇప్పుడు తాజా ఘటనతో పాటు సిట్ అధికారులు రెండో జాబితాలోని సినీ ప్రముఖులకు నోటీసులు అందజేయనున్నారనే ప్రకటన టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది.