తెలంగాణ

వర్షాభావంతో పంటలకు నష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 2: తెలంగాణ రాష్ట్రంలో గత ఐదారు రోజుల నుండి వర్షాలు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులు పంటలు వేసే సాధారణ విస్తీర్ణం 110 లక్షల ఎకరాలు కాగా ఇప్పటి వరకు 80 లక్షల ఎకరాల్లో విత్తనాలు వేశారు. ఇప్పటి వరకు విత్తనాలు వేసిన రైతుల పొలాల్లో ప్రస్తుతం పంటలు పచ్చగా కళకళలాడుతూ ఉన్నాయి. జూన్ రెండోవారంలో నైరుతీ రుతుపవనాలు తెలంగాణలో ప్రవేశించిన తర్వాత అడపాదడపా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పత్తి పూర్తిస్థాయిలో అంటే 45 లక్షల ఎకరాల్లో వేశారు. జొన్న లక్ష ఎకరాల్లో, మొక్కజొన్న 11 లక్షల ఎకరాల్లో, కందులు ఆరులక్షల ఎకరాల్లో, సోయాబీన్ ఏడున్నర లక్షల ఎకరాల్లో వేశారు. మొత్తం ఆహార పంటలు 30 లక్షల ఎకరాల్లో వేశారు. 25 లక్షల ఎకరాల్లో వరివేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 9 లక్షల ఎకరాల్లో నాట్లువేశారు. జూన్ నెలలో సాధారణ వర్షపాతం నమోదు కాగా, జూలైలో కొంత తక్కువగా నమోదైంది. గత రెండు నెలల్లో 380 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావలసి ఉండగా, 342 మిల్లీమీటర్లు (పదిశాతం తక్కువ) మాత్రమే నమోదైంది. వర్షాభావ పరిస్థితి పూర్తిగా లేకపోయినా, ఆదిలాబాద్,కుమరంబీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్పల్లి, మెదక్, జయశంకర్ జిల్లాల్లో తక్కు వర్షాలు కురిశాయి. మేడ్చల్, రంగారెడ్డి, జోగులాంబ, హైదరాబాద్ జిల్లాల్లో అధిక వర్షాలు నమోదుకాగా, మిగతా జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. గత వారం రోజుల నుండి చాలా జిల్లాల్లో వర్షాలు లేకపోవడం వల్ల పరిస్థితి ఆందోళన కరంగా ఉంది.