తెలంగాణ

రికార్డు స్థాయిలో విద్యుత్ వినిమయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 2: తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ పనులు పుంజుకోవడం, కొన్ని ఎంపిక చేసిన జిల్లాల్లో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేయడం, వర్షాలు లేకపోవడంతో పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతో విద్యుత్ వినిమయం ఒక్కసారిగా పెరిగింది. తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే రికార్డు స్థాయిలో ఇంత పెద్ద పరిణామంలో విద్యుత్ వినిమయం జరగడం ఇదే తొలిసారి. రెండేళ్ల క్రితం తీవ్రమైన విద్యుత్ కొరతను ఎదుర్కొన్న తెలంగాణ రాష్ట్రం ఈ రోజు 194 ఎంయు విద్యుత్ డిమాండ్‌ను తట్టుకుని నిలబడింది. రాష్ట్రంలో కరీంనగర్, నల్లగొండ, సంగారెడ్డి తదితర జిల్లాల్లో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ను సరఫరా చేసే పథకాన్ని ప్రయోగాత్మకంగా ప్రభుత్వం ప్రారంభించింది. మిషన్ కాకతీయ వల్ల చెరువులు కళకళలాడుతుండడంతో, ఆయకట్టు కింద సేద్యం ఊపందుకుంది. భూగర్భ జలాలు సమృద్ధిగా ఉండడంతో ఈ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు పుంజుకున్నాయి. దీంతో విద్యుత్ వినిమయం పెరిగింది. కాగా గత 15రోజులుగా నెలకొన్న వర్షాభావ పరిస్ధితుల వల్ల పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. దీంతో పట్టణ ప్రాంతాల్లో విద్యుత్ వినిమయం పెరిగింది.
వచ్చే రోజుల్లో విద్యుత్ డిమాండ్ 200 ఎంయుకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ డిమాండ్‌ను తట్టుకుని విద్యుత్‌ను సరఫరా చేసే శక్తిని తెలంగాణ విద్యుత్ సంస్ధలు సమకూర్చుకున్నాయి. రాష్ట్రంలో జల విద్యుత్ పూర్తిగా నిలిచిపోయినా, థర్మల్, సంప్రదాయేతర ఇంధన విద్యుత్ సమృద్ధిగా లభిస్తోంది. రికార్డుస్థాయిలో విద్యుత్ డిమాండ్ 194.680 ఎంయుకు చేరుకున్న రోజు విద్యుత్ ఈ కింద కేటగిరీల ద్వారా లభించింది. జెన్క్థోర్మల్ 38.911 ఎంయు, సింగరేణి థర్మల్ ప్రాజెక్టుల ద ఆవరా 22.604 ఎంయు, కేంద్ర విద్యుత్ సంస్థలు ఎన్టీపిసి, విద్యుత్ కొనుగోళ్ల ద్వారా 77.969 ఎంయు, సంప్రదాయేతర విద్యుత్ ద్వారా 53.459 ఎంయు, ఏపిఐఎస్‌టిఎస్‌లో తెలంగాణ వాటా 1.737 ఎంయు విద్యుత్ లభిస్తోంది. సౌర విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో అదనంగా 8.83 ఎంయు విద్యుత్ లభిస్తోంది. చత్తీస్‌గడ్ నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్ ప్రత్యేకంగా నిర్మించిన కారిడార్ ద్వారా వస్తోంది.