సంపాదకీయం

కశ్మీర్‌లో ‘ఖాయిదా’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హురియత్ ముఠాలకు చెందిన పేరుమోసిన విద్రోహులను మన ప్రభుత్వం ఇప్పటికీ ని ర్బంధించలేకపోవడం మన భద్రతా విధానంలో నిహితమై ఉన్న వైరుధ్యాలకు నిదర్శనం. గత నెల 24వ తేదీన ఏడుగురు ‘హురియత్’ ముష్కరులను జా తీయ నేర పరిశోధక సంస్థ- నేషనల్ ఇనె్వస్టిగేషన్ ఏజెన్సీ- ఎన్‌ఐఏ- అధికారులు అరెస్టు చేసినప్పటి నుంచి కశ్మీర్‌లోయ ప్రాంతంలో హింసాకాండ మరింతగా ప్రజ్వరిల్లుతోంది. ఇందుకు ప్రధాన కారణం హురియత్ ముఠాల ‘అధ్యక్షులు’గా చెలామణి అవుతున్నవారు స్వేచ్ఛగా జిహాదీ బీభత్సకాండను రెచ్చగొడుతుండడం. అఫ్ఘానిస్తాన్‌ను రెండు దశాబ్దులకుపైగా భయంకర బీభత్సకాండకు గురిచేసిన ‘అల్ ఖాయిదా’ జిహాదీ ముఠా ముష్కరులు కూడ కశ్మీర్‌లో చొరబడిపోయారన్నది సరికొత్త ప్రమాదానికి చిహ్నం. జావిద్ ముస్లా అనే జిహాదీ పెత్తనం కింద జమ్మూ కశ్మీర్‌లో ‘అల్ ఖాయిదా’ విభాగం ఏర్పడిపోయిందన్నది నిఘా విభాగాల వారు నిర్ధారించిన వైపరీత్యం. బీభత్సకారులను, పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత జిహాదీ హంతకులను అణచివేయడానికి మన సైనిక దళాలు పోరాటాన్ని తీవ్రతరం చేస్తున్నకొద్దీ ఈ ఉగ్రమూకలు మరింతగా పేట్రేగిపోతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం హురియత్ ముఠా ‘అధ్యక్షులు’గా చెలామణి అవుతున్న పాకిస్తాన్ తొత్తులు స్వేచ్ఛగా మనగలగడం. హురియత్‌లోని ‘ముదురు’ ముఠా అధ్యక్షుడిగా చెలామణి అవుతున్న సయ్యద్ అలీ షా జిలానీ బంధువులు కొందరిని ఎన్‌ఐఏ అరెస్టు చేసినప్పటికీ జిలానీ మాత్రం స్వేచ్ఛగా తిరుగుతూ రెచ్చగొట్టే ప్ర సంగాలు చేస్తూనే ఉ న్నా డు. హురియత్ ‘మెతక’ ముఠాకు అధ్యక్షుడిగా చె లామణి అవుతున్న మీ ర్వాయిజ్ ఉమర్ ఫరూక్ నిర్బంధానికి గురికాకుం డా స్వేచ్ఛగా మనగల్గుతున్నాడు. వీరిద్దరినీ ఏళ్ల క్రితమే నిర్బంధించి దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడిన అభియోగాన్ని నమోదు చేసి ఉండవలసింది, న్యాయస్థానాలలో వీరిని నిలబెట్టవలసి ఉంది. అది జరగకపోవడం కశ్మీర్‌లోయలో నిరంతరం హింసాజ్వాలలు ప్రజ్వరిల్లుతుండడానికి ప్రధాన కారణం. జిలానీ కుటుంబ సభ్యులు, బంధువులు దాదాపు వంద యాబయి కోట్ల రూపాయల మేర అక్రమ ఆస్తులను సంపాదించినట్టు ఎన్‌ఐఏ గురువారం వెల్లడించిన సమాచారం. వీరందరూ ఇంకా ఎందరో కశ్మీర్‌లోయలో బీభత్సకాండ జరుపుతున్న వారిని పెంచి పోషిస్తున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం వీరికి నిధులను సమకూర్చుతోంది.
మన భద్రతాదళాలు బీభత్స వ్యతిరేక కార్యకలాపాలను తీవ్రతరం చేస్తున్నకొద్దీ జిహాదీ ఉగ్రవాదులు మరింతగా విరుచుకొని పడుతుండడం కశ్మీర్‌లోయ ప్రాంతంలో నెలకొని ఉన్న భయంకర దృశ్యం. కశ్మీర్‌లో ‘లష్కర్ ఏ తయ్యబా’ జిహాదీ ముఠాకు చెందిన మొదటి బీభత్సకారుడు అబూ దుజానాను మన భద్రతాదళాల వారు మట్టుబెట్టిన తరువాత రెండు రోజులుగా జిహాదీ ఉగ్రవాదులు మరింతగా పేట్రేగిపోతున్నారు. ‘లష్కర్ ఏ తయ్యబా’ జిహాదీ ముఠా అధిపతి హఫీజ్ సరుూద్‌ను గృహ నిర్బంధంలో ఉంచినట్టు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రచారం చేస్తున్నప్పటికీ అతగాడు పాకిస్తాన్‌లో యథేచ్ఛగా విహరిస్తున్నాడు. ‘లష్కర్ ఏ తయ్యబా’, ‘జమాత్ ఉద్‌ద్వా’ ముఠాలకు రూపకల్పన చేసిన హఫీజ్ సరుూద్‌ను ఐక్యరాజ్యసమితి ఆధికారికంగా అంతర్జాతీయ బీభత్సకారుడని నిర్ధారించింది. సరుూద్‌ను గృహనిర్బంధంలో ఉంచినట్టు పాకిస్తాన్ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలలో వాస్తవం లేదన్నది స్పష్టమైపోయింది. హఫీజ్ సరుూద్ పాకిస్తాన్‌లో స్వేచ్ఛగా విహరిస్తున్న దృశ్యాలు, బహిరంగ సభలలో పాల్గొంటున్న దృశ్యాలు ప్రసార మాధ్యమాలలో ఆవిష్కృతవౌతూనే ఉన్నాయి. సరుూద్ జిహాదీ పేరుతో బీభత్సకాండను ప్రోత్సహిస్తున్నట్టు పాకిస్తాన్ ప్రభుత్వం మే నెలలో ఆధికారికంగా అంగీకరించింది. ‘అతగాడిని గృహనిర్బంధానికి అంతకు పూర్వమే గురిచేసింది..’ సరుూద్ పాకిస్తాన్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్న దానికి దృశ్య మాధ్యమాలలో ఆవిష్కృతమైన వాస్తవిక సాక్ష్యం. కశ్మీర్‌లో అతగాడి అనుచరుడు అబూదు జా నా హతమైన నేపథ్యంలో బయటపడ్డ వా స్తవం ఇది.
మన ప్రభుత్వం ఇప్పుడైనా పాకిస్తాన్ ప్రభుత్వాన్ని నిలదీయాలి. 2008 నవంబర్‌లో ముంబయిలో పాకిస్తాన్ జిహాదీ ముష్కరులు జరిపిన నరమేధానికి సూత్రధారి ‘్భయంకర బీభత్సకారుడైన’ హఫీజ్ స రుూద్. 2008 డిసెంబర్‌లో ఐక్యరాజ్యసమితి తీ ర్మానం చేసింది. జమాత్ ఉద్‌ద్వాను నిషేధించాలని, జమాత్ అధిపతి సరుూద్‌ను నిర్బంధించి విచారించాలని ఆ తీర్మానంలో కోరారు. ఆ తీర్మానాన్ని అమలు చేస్తున్నట్టు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. కానీ సరుూద్‌ను కారాగృహంలో కాక సొంత ఇంటిలోనే సుఖకరమైన నిర్బంధానికి గురిచేసింది. ఆ తరువాత లాహోర్ హైకోర్టు 2009 జూలైలో సరుూద్‌ను గృహ నిర్బంధానికి గురి చేయడం చెల్లదని తీర్పు చెప్పింది. ఎందుకంటే పాకిస్తాన్ ప్రభుత్వం ‘జమాత్ ఉద్‌ద్వా’ను నిషేధించలేదు. కానీ ‘జమాత్’ను నిషేధించినట్లు 2008 డిసెంబర్‌లోనే పాక్ ప్రభుత్వం ప్రకటించింది. ఐక్యరాజ్యసమితిని, అంతర్జాతీయ సమాజాన్ని పాకిస్తాన్ అలా అప్పుడు వంచించింది. ఇప్పుడు మళ్లీ ఈ వంచన కథ పునరావృ త్తం అవుతోంది. సరుూ ద్ గృహనిర్బంధంలో ఉన్నట్టు ప్రచారం జరిగినప్పటికీ, అతగాడు బహిరంగ సభలలో పాల్గొంటునే ఉన్నాడు. మన దేశానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తూనే ఉన్నాడు. ఈ విషయమై మన ప్రభుత్వం పాకిస్తాన్‌ను నిలదీయవలసి ఉంది. సరుూద్ నాయకత్వంలోని ‘లష్కన్ ఏ తొయ్యబా’కు చెందిన అబూ దుజానా కశ్మీర్‌లోయలో హతమైన తరువాత రెండు రోజులుగా బీభత్సకారులు మరింతగా చెలరేగుతున్నారు. కమలేశ్ పాండే అన్న ఉన్నత సైనికాధికారిని, మరో సైనికుడ్ని జిహాదీలు గురువారం పొట్టన పెట్టుకోవడం సరికొత్త విషాదం..
ఈ నేపథ్యంలో జిలానీ వంటి వారిని మన ప్ర భుత్వం ఇంకా నిర్బంధించకపోవడం అంతుపట్టని వ్యవహారం. పాకిస్తాన్‌తో సకలవిధ సంబంధాలను రద్దు చేసుకోవలసిన సమయంలో ‘సీమాంతర వాణిజ్యాన్ని’ పునరుద్ధరించడానికై మన అధికారులు పాకిస్తాన్ అధికారులతో చర్చలు జరిపారట! ఊరి, ముజఫర్‌నగర్‌ల మధ్య సీమాంతర వాణిజ్యాన్ని మళ్లీ ప్రారంభిస్తారట! ఈ సీమాంతర వాణిజ్యం సీమాంత ర బీభత్సకాండకు ‘ముసుగు’గా మారి ఉండడం ఏళ్ల తరబడి సాగుతున్న కథ. ఇప్పుడు ‘అల్ ఖాయిదా’ జిహాదీ హంతకులు సైతం కశ్మీర్‌లోకి చొరబడిపోవడానికి కారణం ఈ సీమాంతర వాణిజ్యం. సీమాంతర వాణిజ్యవేత్తల ముసుగులో ‘లష్కర్’, ‘జమాత్’ ముష్కరులు మాత్రమే కాక ‘అల్ ఖాయిదా’ మూకలు సైతం కశ్మీర్‌లోకి చొరబడిపోయాయన్నది ధ్రువపడిన వాస్తవం. సీమాంతర వాణిజ్యం ఇక వద్దని మన ‘నిఘా’ అధికారులు ప్రభుత్వానికి సలహా ఇచ్చారట. ప్రభుత్వం ఈ సలహాను పాటిస్తుందా?