తెలంగాణ

‘సిస్టర్స్ ఫర్ చేంజ్’ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన స్పీకర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,ఆగస్టు 4: ‘సిస్టర్స్ ఫర్ చేంజ్’ వెబ్‌సైట్‌ను లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ పార్లమెంట్‌లోని స్పీకర్ కార్యాలయంలో శుక్రవారం ప్రారంభించారు. నిజామాబాద్ ఎంపీ కవిత నేతృత్వంలోని ఎమ్మెల్యేల బృందం శుక్రవారం రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్, స్పీకర్ సుమిత్రా మహాజన్, కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, బండారు దత్తాత్రేయలను కలిశారు. హెల్మెట్‌పై అవగాహన పెంచాలన్న ఉద్దేశంతో ఎంపీ కవిత సిస్టర్స్ ఫర్ చేంజ్ అనే ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. దానిలో భాగంగానే స్పీకర్ సుమిత్రా మహాజన్‌తో సిస్టర్స్ ఫర్ చేంజ్ వెబ్‌సైట్‌ను ఎంపీ కవిత ప్రారంభింప జేశారు. అనంతరం కవిత విలేఖరులతో మాట్లాడుతూ ప్రతి రోజు దేశవ్యాప్తంగా హెల్మెట్ ధరించని కారణంగా సుమారు 400 మంది మరణిస్తున్నారని పేర్కొన్నారు. రాఖీ పండగ సందర్భంగా ప్రతి ఆడపడుచు అన్నయ్యలకు రాఖీతో పాటు హెల్మెట్‌ను బహూకరించాలని ఆమె పిలుపునిచ్చారు. ఇటీవల రాష్టప్రతిగా ఎన్నికైన రామ్‌నాథ్ కోవింద్‌ను మర్యాదపుర్వకంగా కవిత నేతృత్వంలో బృందం కలిసింది. అలాగే కేంద్ర ఉపరితల రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశం అయిన ఈ బృందం జగిత్యాలలో పలు బైపాస్ రోడ్లను నిర్మించాలని కోరారు. అదేవిధంగా నిజామాబాద్-్ధర్మపురి జాతీయ రహదారి 63లో చల్‌గల్ నుంచి పొలాస మధ్య బైపాస్ రోడ్డు అవసరాన్ని కేంద్రమంత్రికి కవిత వివరించారు.