తెలంగాణ

వెంకయ్య విజయం..బిజెపి సంబురం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 5: ఉప రాష్టప్రతిగా ఎం. వెంకయ్య నాయుడు ఘన విజయం సాధించడంతో శనివారం సాయంత్రం బిజెపి రాష్ర నాయకులు, కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. ఉప రాష్టప్రతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించినట్లు ఢిల్లీ నుంచి ప్రకటన వెలువడడంతోనే నాంపల్లిలోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా బిజెపి శాసనసభాపక్షం నాయకుడు కిషన్‌రెడ్డి ప్రసంగిస్తూ ఉప రాష్టప్రతి పదవికి వెంకయ్య నాయుడు వనె్న తెస్తారని అన్నారు. సమయ పాలన, నిబద్ధత, అంకితభావం, కష్టపడే మనస్తత్వం క్రమశిక్షణ, పరిశోధన, ధైర్యంతో వ్యవహరించడం, ముక్కుసూటిగా స్పందించడం వెంకయ్య ప్రత్యేకత అని తెలిపారు.