తెలంగాణ

పోస్టల్ శాఖకే కుచ్చుటోపీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 5: తపాలశాఖలో పనిచేస్తూ, ఓ జెవెల్లర్స్ కంపెనీ యాజమాన్యంతో కుమ్మక్కై ప్రభుత్వ ఖజానాకు కోట్లాది రూపాయలు నష్టం చేకూర్చిన అధికారుల అవినీతి వెలుగులోకి వచ్చింది. హుమాయున్‌నగర్ పోస్టల్ ఉద్యోగులు తపాల శాఖకు రూ. 7.6 కోట్లు నష్టం తెచ్చిపెట్టారని, ప్రీషా పెరల్స్ కంపెనీతో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడ్డారని ఇటీవల హైదరాబాద్ సిటీ డివిజన్ సీనియర్ సూపరింటెండెంట్ హెచ్‌ఆర్ చంద్రశేఖర్ అదార్ సీబీఐకి ఫిర్యాదు చేశారు. కాగా ప్రాథమిక దర్యాప్తు పూర్తిచేసిన హైదరాబాద్ రేంజ్ సీబీఐ అధికారులు ముగ్గురు పోస్టల్ ఉద్యోగులు, ప్రీషా పెరల్స్ కంపెనీకి చెందిన ఇద్దరు ప్రతినిధులపై కేసు నమోదు చేసినట్టు సమాచారం.
అసలు ఏం జరిగిందంటే..హైదరాబాద్ ఆబిడ్స్‌కు చెందిన ప్రీషా పెరల్స్ యాజమాన్యం వ్యాపారం నిమిత్తం పలు రాష్ట్రాలకు జెవెల్లర్స్‌ను పోస్టల్ శాఖ ద్వారా పంపిస్తోంది. ఈ పార్శిళ్ళను హుమాయున్‌నగర్ పోస్ట్ఫాసు నుంచి వినియోగదారులకు పంపడం, ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి తెప్పించుకోవడం జరుగుతోంది. అయితే కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ నీలేష్‌కుమార్ అగర్వాల్, డైరెక్టర్ శైలేష్ అగర్వాల్ హుమాయున్‌నగర్ సబ్-పోస్ట్ఫాసులో పనిచేస్తున్న సబ్-పోస్ట్‌మాస్టర్ కామేశ్వరరావు, డిప్యూటీ సబ్ పోస్టుమాస్టర్ పద్మావతి, ఎస్ వెంకటస్వామితో కలసి పోస్టల్ శాఖకు భారీ నష్టం చేకూర్చేలా కుట్ర పన్నినట్టు సమాచారం. ఇందులో భాగంగానే సంబంధిత పెరల్స్ కంపెనీ పంపించే పార్శిళ్ల బరువును తక్కువ వెయిట్ చేయడం, అన్ని పార్శిళ్లకు ఒకే నెంబర్‌తో ఫోర్జరీ డాక్యుమెంట్ సృష్టించినట్టు సీబీఐ గుర్తించింది. కాగా ఒకే పార్శిల్‌కు సంబంధించిన వివరాలున్న ఒరిజినల్ కాపీతో పలు కలర్ జిరాక్స్ కాపీలు తీసి అన్నింటికీ ఒకే చార్జి కింద జమ చేసి అక్రమాలకు పాల్పడ్డట్టు సీబీఐ దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఇలా 2015 ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు 32.91 పార్శిళ్లు పంపిస్తే, వాటిని లెక్కలో చూపించకుండా 14.66 వేల పార్శిళఉల మాత్రమే చూపించి, వాటికి డబ్బులు వసూలు చేశారని, మిగతా 18.25వేల పార్శిళ్లను లెక్కల్లోకి తీసుకోకుండా పోస్టల్ శాఖకు నష్టం చేకూర్చినట్టు సీబీఐ ఆధారాలు సేకరించింది. ఇలా పెరల్స్ కంపెనీతో కలసి పోస్టల్ ఉద్యోగులు రూ. 7.66 కోట్లు నష్టాన్ని తెచ్చిపెట్టారని సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో స్పష్టం చేసింది. ఈ మేరకు పీసీయాక్ట్ 1988 కింద రెడ్‌విత్ 13(2), 13(1)(డి), ఐపీసీ రెడ్‌విత్ 120-బి, 468, 471, 420 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు హైదరాబాద్ రేంజ్ డిఐజి ఎఫ్‌ఐఆర్‌లో స్పష్టం చేశారు.