తెలంగాణ

డ్రామాలాడుతున్న టిఆర్‌ఎస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 7: జీఎస్టీ విషయంలో సిఎం కెసిఆర్ పూటకో మాట మాట్లాడుతున్నారని తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. జీఎస్టీ అమలువల్ల రాష్ట్రానికి జరిగే నష్టంపై ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఒక ప్రకటన చేస్తే, ముఖ్యమంత్రి కెసిఆర్ మరో ప్రకటన చేసి ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని అన్నారు. ఇటీవల జరిగిన రాష్టప్రతి, ఉపరాష్టప్రతి ఎన్నికల్లో బిజెపికి మద్దతు ఇచ్చిన టిఆర్‌ఎస్, ఇప్పుడు జీఎస్టీ విషయంలో కొత్తడ్రామా మొదలుపెట్టారని దుయ్యబట్టారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలతోపాటు, తెలంగాణ రాష్ట్ర హక్కుల విషయంలో టిఆర్‌ఎస్ పార్టీ పార్లమెంట్‌లో ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. ఎన్డీయేతో ముఖ్యమంత్రి కెసిఆర్ చీకటి ఒప్పందం చేసుకున్నారా లేక ఈడీ కేసులకు భయపడి కేంద్రంపై పోరాటం చేయడం మానుకున్నారా అని ప్రశ్నించారు. ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ ఏ హోదాలో ఆర్థిక మంత్రి ఈటల స్థానంలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొంటారని అన్నారు. జీఎస్టీ విషయంలో తెలంగాణకు జరుగుతున్న నష్టంపై టిఆర్‌ఎస్ ప్రధాని నరేంద్ర మోదీ ఇంటిముందు ధర్నా చెయ్యాలని, ఈ విషయంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. టిఆర్‌ఎస్ ఎంపీలు కేంద్రంనుంచి ఇప్పటివరకు ఏ అంశాన్నీ సాధించలేకపోయారని, వ్యక్తిగత ప్రాపకం, వ్యాపారాలకోసమే ఢిల్లీలో ఎంపీలుగా కొనసాగుతున్నారని విమర్శించారు.