శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

గుర్తుకొస్తున్నాయి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు: ‘ఈ నెల్లూరు నేలలో ఏదో శక్తి ఉంది, నేను తిరిగిన నేల, పెరిగిన ఊరు, ఇక్కడ నాకు తారసపడిన ఎందరో వ్యక్తులు జీవితంలో నా వ్యక్తిత్వాన్ని ఎంతో ప్రభావితం చేశారు. రాజకీయ, ఆధ్యాత్మిక, దేశభక్తి భావాలకు పునాది ఇక్కడే పడింది. కనకమహల్‌లో 1966లో ఓ విద్యార్థిపై థియేటర్ యాజమాన్యం దౌర్జన్యం చేయడాన్ని నిరసిస్తూ ఇక్కడి విఆర్ కళాశాల మైదానంలో జిల్లాలోని విద్యార్థులందరిని కూడగట్టుకొని ఉద్యమించాను. ఎక్కడ విద్యార్థిగా ఉద్యమించడం ద్వారా నాయకుడిగా మారానో, అక్కడే ఉప రాష్టప్రతిగా సన్మానం పొందుతున్నా.’.. అంటూ తన రాజకీయ పునాదికి బీజం వేసిన నెల్లూరు జ్ఞాపకాలను ఉప రాష్టప్రతిగా ఎన్నికైన ముప్పవరపు వెంకయ్యనాయుడు ఓసారి నెమరేసుకున్నారు. జిల్లాకు చెందిన పలువురు రాజకీయ నేతలను పేర్లను తన ప్రసంగంలో చేర్చారు. పుచ్చలపల్లి సుందరయ్య, బెజవాడ గోపాల్‌రెడ్డి మొదలు నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి వరకు వివిధ పార్టీలకు చెందిన వారితో తనకు రాజకీయ వైరుధ్యం ఉన్నప్పటికి వారు తనను ఎంతలా అభిమానించేవారో తెలిపారు. చిన్ననాడే తల్లిని కోల్పోయిన తాను చదువుకునేందుకు ఎవరెవరు సహాయం చేశారు, ఎలా చేశారు? అనే విషయాలను ఉటంకిస్తూ తన ఉన్నతికి కారణమైన వారందరికి పేరుపేరునా వెంకయ్యనాయుడు కృతజ్ఞతలు తెలిపే సమయంలో మైదానం చప్పట్లతో మార్మోగింది. ఇంకా ఆయన మాట్లాడుతూ ఉదయగిరి నియోజకవర్గం తనకు రాజకీయ ఊపిరినిచ్చిందని, ఎప్పటికీ ఉదయగిరిని మరువనని అన్నారు. రాజకీయాల్లో ప్రత్యర్ధులు మాత్రమే ఉంటారని, శత్రువులు ఉండరని తాను విశ్వసిస్తానని, అందరూ అలానే ఉండాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా వెంకయ్యనాయుడు గొంతు విప్పి మాట్లాడుతుంటే అవతలి వారు వినాల్సిందేనన్నారు. రాష్ట్ర విభజన సమయంలో రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ వాణి వినిపించింది కేవలం వెంకయ్యనాయుడు మాత్రమేనని గుర్తుచేశారు. మరో మంత్రి పి.నారాయణ మాట్లాడుతూ నెల్లూరు జిల్లాకు వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు, పలు విద్యాసంస్థలు, కేంద్ర రంగ సంస్థలను తీసుకువచ్చిన ఘనత వెంకయ్యనాయుడు సొంతమన్నారు. ఆయన స్ఫూర్తితో పలు పట్టణాభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని తెలిపారు. నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఉప రాష్టప్రతిగా వాసికెక్కిన సర్వేపల్లి రాధాకృష్ణన్‌లా వెంకయ్యనాయుడు కూడా పదవికి వనె్నతెస్తారనే ఆకాంక్షను వెలిబుచ్చారు. ఆయన్ను రాష్టప్రతిగా చూస్తామనే ఆశను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి వ్యక్తం చేశారు.
ఘన స్వాగతం.. సత్కారం
అంతక్రితం నెల్లూరుకు విచ్చేసిన వెంకయ్యనాయుడికి స్థానిక నేతలు, సన్మాన కమిటీ సభ్యులు నెల్లూరు పోలీస్ కవాతు మైదానంలో ఘనంగా స్వాగతం పలికారు. అక్కడ్నుంచి స్కూటర్, కార్ల ర్యాలీగా బయల్దేరారు. దారి వెంట 1500 మీటర్ల పొడవునా జాతీయ జెండా చేతబూనిన విద్యార్థులు వెంకయ్యనాయుడికి ఆహ్వానం పలుకుతుండగా ఆయన నెల్లూరీయులకు అభివాదం చేస్తూ కదిలారు. ఆర్టీసీ, మద్రాస్ బస్టాండ్‌ల మీదుగా ర్యాలీ సభాస్థలికి చేరుకుంది. సభ ప్రారంభానికి ముందు ప్రజల గ్యాలరీలోకి వచ్చిన వెంకయ్యనాయుడు అక్కడ కూర్చున్న నెల్లూరీయులను పలుకరించారు. ఈ సమయంలో కొందరు ఆప్తులను ఆయన పేరుపెట్టి పలకరించడం విశేషం. సభ పూర్తయ్యే ముందు సన్మాన కమిటీ సభ్యులు నెల్లూరీయులందరి తరపున వెంకయ్యనాయుడును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వెంకయ్యనాయుడిపై ఆలపించిన గేయం ఆహుతుల్ని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, కురుగొండ్ల రామకృష్ణ, బొల్లినేని రామారావు, తిరుపతి ఎంపి వరప్రసాదరావు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, నెల్లూరు మేయర్ అబ్దుల్ అజీజ్, ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, గ్లోబల్ ట్రస్ట్ ఆసుపత్రి ఎండి కంచర్ల రవీంద్రచౌదరి, వెంకయ్యనాయుడు కుమారుడు హర్షవర్ధన్, కుమార్తె దీపావెంకట్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి, బీద మస్తాన్‌రావు, ముంగమూరు శ్రీ్ధరకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చంద్రగ్రహణంతో ఆలయాల మూసివేత
నెల్లూరు కల్చరల్: చంద్రగ్రహణం సందర్భంగా జిల్లాలోని అన్ని ఆలయాలను సోమవారం సాయంత్రం మూసివేశారు. ఆలయాలలో ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించి సాయంత్రం మూసివేశారు. గ్రహణం సందర్భంగా పెంచలకోనలోని నరసింహస్వామి, జొన్నవాడ కామాక్షితాయి, గొలగమూడి వెంకయ్యస్వామి, సూళ్లూరుపేట చెంగాలమ్మ అమ్మవారి ఆలయం, నెల్లూరు నగరంలోని శ్రీరాజరాజేశ్వరీదేవి తదితర ఆలయాల్లో అర్చకులు పూజలను నిలిపివేసి ఆలయాల తలుపులు మూసివేశారు. గ్రహణం విడిచిన అనంతరం మంగళవారం తెల్లవారుజామున ఆలయాల తలుపులు తెరిచి సంప్రోక్షణ చేసిన తర్వాత భక్తులను దర్శనానికి అనుమతినిస్తారు. పలువురు భక్తులు గ్రహణం సందర్భంగా వివిధ ఆలయాల్లో శాంతి పూజలు నిర్వహించారు.
రాపూరులో..
రాపూరు: జిల్లాలో ప్రముఖ దేవాలయమైన పెంచలకోనలోని మూడు దేవస్థానాలను చంద్రగ్రహణం సందర్భంగా మూసివేశారు. సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు ఆలయ అర్చకులు ఆలయాలకు తాళాలు వేసి మూసివేశారు. చంద్రగ్రహణం అనంతరం మంగళవారం ఉదయం 8 గంటలకు స్వామి, అమ్మవార్లు, ఆంజనేయస్వామి దేవస్థానాలను సంప్రోక్షణ చేసిన అనంతరం భక్తులకు దర్శనం ఏర్పాటు చేయనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు రామయ్యస్వామి తెలిపారు.

అన్నాచెల్లెల అనురాగం.. ఎన్నో జన్మల పుణ్యఫలం!
నెల్లూరు కల్చరల్: జిల్లా వ్యాప్తంగా సోమవారం రాఖీ పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. శ్రావణ పూర్ణిమ సందర్భంగా ప్రతిఒక్కరూ తమ ఇళ్లల్లోని అన్నా, తమ్ముడు, అక్కా, చెళ్లెల్లు ఉత్సాహంతో రక్షాబంధం కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ అన్నాతమ్ముళ్లకు అక్కాచెల్లెళ్లు రాఖీలను కట్టి ఆత్మీయత బంధాన్ని చాటారు. ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు. అన్నాతమ్ముళ్లు అక్కాచెల్లెళ్లకు బహుమతులు ఇచ్చి ఆనందంగా గడిపారు. చంద్రగ్రహణం ప్రభావంతో ఉదయం 11 గంటలలోపు రాఖీ పూర్ణిమను చేసుకోవాలని మహిళలు తెల్లవారుజామున నుంచే సన్నద్ధమయ్యారు. రాఖీ పండుగపై చంద్రగ్రహణం ప్రభావం కాస్త చూపించిందని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అన్ని స్కూళ్లలో రాఖీ పండుగ సందర్భంగా పలువురు విద్యార్థినీ విద్యార్థులు రాఖీలు కట్టుకొని రాఖీ పండుగ ప్రాముఖ్యతను చాటారు. అనంతరం మిఠాయిలు పంచుకొని ఒకరికొకరు శుభాకాంక్షలను తెలియజేసుకున్నారు.

వెంకయ్యకు నీరా‘జనం’
నెల్లూరు : ఉప రాష్ట్ర పతిగా ఎన్నికై తొలిసారి సొంత జిల్లా నెల్లూరుకు వచ్చిన తెలుగుతేజం ఎం వెంకయ్యనాయుడుకి ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. సోమవారం తిరుపతి నుంచి హెలికాప్టర్‌లో నెల్లూరులోని పోలీస్ కవాతు మైదానానికి చేరుకొన్న ఆయనకు రాష్ట్ర మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పొంగూరు నారాయణ, కామినేని శ్రీనివాస్, నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు, జిల్లాలోని ప్రజాప్రతినిధులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేశారు. పోలీస్ కవాతు మైదానం నుండి ఆయన స్థానిక విఆర్‌సి మైదానానికి భారీ ర్యాలీగా తరలివచ్చారు. అడుగడుగునా వెంకయ్యపై పూలవర్షం కురిపిస్తూ అట్టహాసంగా స్వాగతం పలికారు. రోడ్డుకు ఇరువైపులా త్రివర్ణ రంగుల బెలూన్‌లు చేపట్టి విద్యార్థులు, పూలు చల్లుతూ ఆహ్వానించారు. 1500 మీటర్ల జాతీయ జెండాతో విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీ కెవిఆర్ పెట్రోలు బంక్, ఆర్టీసీ, మద్రాసు బస్టాండ్‌ల మీదుగా విఆర్‌సి మైదానానికి చేరుకుంది. వెంకయ్య ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి భారీఎత్తున జనం తరలిరావడంతో విఆర్‌సి మైదానం కళకళలాడింది.

‘ఆక్వా రంగంలో విస్తృతంగా ఉద్యోగావకాశాలు’
వెంకటాచలం: ఆక్వా రంగంలో విస్తృతంగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, విద్యార్ధులు అక్వా రంగం వైపు మొగ్గు చూపాలని ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అభివృద్ధి కమిటీ సభ్యులు, బిఎంఆర్ గ్రూప్ సంస్థల ఛైర్మన్ బీద మస్తాన్‌రావు సూచించారు. మండలంలోని కాకుటూరు వద్ద ఉన్న విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో సోమవారం జీవశాస్త్రంలో వచ్చిన నూతన ఆవిష్కరణలపై అయిదు రోజులపాటు నిర్వహించనున్న ప్రత్యేక సదస్సును బీద మస్తాన్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర విభజన తరువాత టిడిపి ప్రభుత్వం ఆక్వా రంగాన్ని ప్రాథమిక రంగంగా గుర్తించిందన్నారు. ఎగుమతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు పెంచుతూ ప్రస్తుత ఏటా అక్వా రంగానికి 330 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. దీంతోపాటు ప్రత్యేక రాయితీలు ఇవ్వడం జరుగుతుందని, దీనిని ఆక్వా రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఇప్పటివరకు గణనీయంగా ఎగుమతులు పెరిగాయన్నారు. ప్రస్తుతం 19.2 మెట్రిక్ టన్నుల ఎగుమతులు చేస్తుండగా 2020 నాటికి ఈ ఎగుమతులు 40వేల లక్షల మెట్రిక్ టన్నులకు పెంచాలన్నాది ప్రభుత్వ లక్ష్యమన్నారు. వెనామీ రొయ్యలు దేశం నుంచి ప్రతి ఏటా 6లక్షల మెట్రిక్ టన్నులు ఎగుమతి అవుతుంటే మన రాష్ట్రం నుంచి 70 శాతం వరకు ఎగుమతి అవుతున్నాయని ఆయన వెల్లడించారు. అక్వా ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పెరిగిందన్నారు. ఆక్వా రంగంలో శిక్షణ పొందిన వారికి మంచి అవకాశాలుంటాయన్నారు. ఆక్వా రంగానికి సంబంధించిన కోర్సులు విశ్వవిద్యాలయంలో పెడితే ఆ కోర్సులకు అవసరమైన గది, సౌకర్యాలు, ప్రయోగశాల తదితర వాటి నిర్మాణాలతోపాటు ప్రయోగాలకు అవసరమైన పొలాలను సొంతంగా సమకూర్చుతానని ఆయన హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో పాల్గొన్న విశ్వవిద్యాలయ ఉపకులపతి వీరయ్య మాట్లాడుతూ సైన్సుతో అనేక సమస్యలు పరిష్కరించవచ్చన్నారు. నూతన అహార ఉత్పత్తులు, ఆహారపదార్థాలు నిల్వ చేసే విధానాలు, కొత్తపద్ధతులు తెలుసుకోవచ్చన్నారు. విద్యార్ధులు పరిశోధనల్లో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. విద్యార్ధి దశ నుంచే పరిశోధనలు చేయాలని ఆయన సూచించారు. ఈకార్యక్రమంలో రిజిస్ట్రార్ చంద్రయ్య, విఎస్‌యూ ప్రిన్సిపాల్ అందె ప్రసాద్, ముత్తుకూరు మత్స్య కళాశాల ఆధ్యాపకులు హరిబాబు, కన్వీనర్ దయాకర్, ఉప రిజిస్ట్రార్ సుజయ్‌కుమార్, పిఆర్‌వో వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

‘అంగన్‌వాడీ కార్యకర్తలపై కక్ష సాధింపు మానుకోవాలి’
ఉదయగిరి: ప్రభుత్వ అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలపై కక్షసాధింపు చర్యలు మానుకోవాలని అంగన్‌వాడీ వర్కర్ల, హెల్పర్ల యూనియన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కె సుబ్బరావమ్మ పేర్కొన్నారు. సోమవారం స్థానిక సిపిఎం కార్యాలయంలో ఉదయగిరి అంగన్‌వాడీ ప్రాజెక్ట్ పరిధిలో పలువురు కార్యకర్తలకు సమావేశం నిర్వహించారు. నెల్లూరుజిల్లా అంగన్‌వాడీ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉదయగిరి ప్రాజెక్ట్ పరిధిలోని 96 మందికి ఒకేమారు షోకాజ్ నోటీసులు జారీ చేసి భయభ్రాంతులకు గురిచేయడం మంచి పద్ధతి కాదన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించకుండా వారిని జాబ్‌చార్జుల్లో లేని అదనపు పనులు అప్పగించడం దారుణమన్నారు. గత మూడేళ్లగా యూనిఫారమ్‌లు ఇవ్వకుండానే వాటిని ధరించి రావడం లేదని తప్పుబట్టడం దారుణమన్నారు. కార్యకర్తల పనితీరును నిందించడం ఏమిటని ప్రశ్నించారు. నోటీసులు వెనక్కు తీసుకోకుంటే తమ ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తల జిల్లా కార్యదర్శి సుజాతమ్మ, సిఐటియూ జిల్లా అధ్యక్షులు మోహనరావు, డివిజన్ అధ్యక్షులు లక్ష్మీనరసయ్య, రైతు సంఘ నాయకులు వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.

25 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
మర్రిపాడు: మండలంలోని కదిరినాయుడుపల్లి అటవీ ప్రాంతంలో సోమవారం 25 ఎర్రచందనం దుంగలు, తొమ్మిది మంది కూలీలను పట్టుకున్నట్లు ఆత్మకూరు డిఎస్పీ కెఎస్‌ఎస్‌వి సుబ్బారెడ్డి వెల్లడించారు. సోమవారం సాయంత్రం మర్రిపాడు పోలీసుస్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన పత్రికా విలేఖర్ల సమావేశంలో డిఎస్పీ మాట్లాడుతూ మర్రిపాడు మండలం పడమటినాయుడుపల్లిలో ఎర్రచందనం దుంగలు డంపింగ్ చేస్తున్నారన్న సమాచారం తెలిసిందన్నారు. సిఐ ఆధ్వర్యంలో మర్రిపాడు ఎస్సై అబ్ధుల్ రజాక్ తన సిబ్బందితోపాటు అటవీ అధికార్లయిన డిఆర్‌ఓ ప్రసాద్, ఎఫ్‌బిఓ తిరుపాల్, వీరందరూ కలసి అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. వీరిని చూసి డంపింగ్ చేస్తున్న ఎర్రచందనం కూలీలు వీరిపై రాళ్లదాడికి పాల్పడ్డారు. అనంతరం పోలీసులు ఛాకచక్యంగా తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. 25 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటిని రవాణా చేసేందుకు సిద్ధంగా ఉంచిన ఓ ఆటో, మూడు మోటార్‌సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో సిఐ ఖాజావలి, ఎస్సై అబ్దుల్ రజాక్, ఎఎస్సై లక్ష్మయ్య, సిబ్బంది పాల్గొన్నారు.

లక్కీ బ్రదర్‌ని!
ఆత్మకూరు: శ్రావణ పౌర్ణమి రక్షాబంధన్ వేడుకల్లో భాగంగా పలువురు బాలికలు ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డికి రాఖీలు కట్టారు. సోమవారం ఉదయం ఆత్మకూరు పట్టణం జెఆర్ పేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం, నివాస భవనానికి స్థానిక ప్రియదర్శిని కళాశాల విద్యార్థినులు తరలివచ్చి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. దీంతో ఎమ్మెల్యే స్పందిస్తూ ఇంతమంది చిట్టి చెల్లెళ్లచే రాఖీలు కట్టించుకున్న తాను ‘లక్కీ బ్రదర్’ని అంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ విద్యార్థినులు కళాశాల నిర్వాహకులైన నోటి వినయకుమార్‌రెడ్డి నేతృత్వంలో రాఖీలు కట్టేందుకు ఎమ్మెల్యే వద్దకు తరలివచ్చారు.

చేనేత వస్త్రాలను ఆదరిద్దాం
నెల్లూరు రూరల్: జాతీయ సంపద అయిన చేనేత వస్త్రాలను ఆదరిద్దామని జౌళి శాఖ ఎడి భీమయ్య అన్నారు. సోమవారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నెల్లూరు మండల పరిధిలోని నారాయణరెడ్డిపేట ప్రాంతంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎడి సభను ఉద్దేశించి మాట్లాడుతూ, భారతీయ సంస్కృతికి చేనేత దుస్తులు నిదర్శనమని, అవి తయారుచేసే కార్మికులు గొప్పవారని కొనియాడారు. విదేశీ వస్త్రాలకు స్వస్తిపలికి మన కార్మికులు తయారుచేస్తున్న చేనేత వస్త్రాలను అందరూ ధరించాలని, అలా చేయడం వల్ల చేనేత వృత్తిని నమ్ముకున్న అనేక కుటుంబాలు సంతోషంగా జీవించడానికి సహాయపడిన వారమవుతామని అన్నారు. చేనేత దుస్తులు ధరిస్తే హుందాతనం, సౌకర్యంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇతర దేశాలలో చేనేత వస్త్రాలకు డిమాండ్ పెరుగుతోందని, మన దేశంలో మాత్రం ప్రజలు ఆసక్తి చూపడం లేదని ఆయన తెలిపారు. చేనేత శాఖ అభివృద్ధి కోసం ప్రభుత్వం అన్నివిధాల చర్యలు తీసుకుంటుందని చేనేత కార్మికుల సమస్యల పట్ల కూడా ప్రభుత్వం వారికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జౌళి శాఖకు సంబంధించిన అధికారులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

‘బెల్టుషాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు’
మనుబోలు: ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా గ్రామాలలో బెల్ట్‌షాపులు నిర్వహిస్తే కఠినచర్యలు చేపడతామని ఎక్సైజ్ ఎస్‌ఐ సుబ్బరాజు హెచ్చరించారు. సోమవారం మండల పరిధిలోని పిడూరు గ్రామంలో బెల్ట్‌షాపులపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో బెల్ట్‌షాపుల నిర్మూలనకు ప్రతిఒక్కరు సహకరించాలన్నారు. బెల్ట్‌షాపులు నిర్వహిస్తుండే వారి సమాచారం అందిస్తే వెంటనే చర్యలు చేపడతామన్నారు. సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు. మండలకేంద్రంలో హైస్కూల్, జూనియర్ కాలేజికి సమీపంలో ఏర్పాటు చేసిన మద్యం దుకాణంపై పలు ఫిర్యాదులు అందాయని, దానిని త్వరలో మరోచోట ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ హెడ్‌కానిస్టేబుల్ సుబ్బరాయులు, తులసిదాస్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.