తెలంగాణ

రాథోడ్, రేఖానాయక్ మధ్య రగడ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖానాపూర్, ఆగస్టు 8: నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఆర్ అండ్ బి విశ్రాంతి భవనంలో మంగళవారం మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమక్షంలో మాజీ పార్లమెంట్ సభ్యుడు రాథోడ్ రమేష్, ఎమ్మెల్యే రేఖానాయక్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కుర్చీ విషయంలో తలెత్తిన సమస్య వారిద్దరి మధ్య వివాదాన్ని సృష్టించింది. బతకడానికి వచ్చావు జాగ్రత, నీ అంతు తేలుస్తా అని రాథోడ్ రమేష్ ఎమ్మెల్యే రేఖానాయక్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడంతో ఆమె తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. మహారాష్ట్ర నుండి బతికివచ్చిన కుటుంబం నీది, మహిళలతో మాట్లాడే విధానం ముందు నేర్చుకోవాలని అందుకు ఘాటు గానే స్పందించారు. అనంతరం ఎఎంకె ఫంక్షన్‌హాల్‌లో జరిగే సమావేశానికి వారు వెళ్లారు. సమావేశం ముగిశాక భోజన విరామం అనంతరం ఎమ్మెల్యే రేఖానాయక్ తమ అనుచరులతో కలిసి పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. తనపై అనుచితంగా ప్రవర్తించిన రాథోడ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని ఆమె పోలీస్‌స్టేషన్ ముందు ధర్నా చేశారు. గతంలో కూడా ఆయన గన్‌మెన్ తనను బలవంతంగా నెట్టాడని అన్నారు. రాథోడ్‌పై రౌడీషీట్ ఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆమె రాథోడ్‌ను అరెస్ట్ చేయాలని లిఖితపూర్వకంగా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు అందజేశారు.

చిత్రం.. ఖానాపూర్ పోలీస్‌స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తున్న ఎమ్మెల్యే రేఖానాయక్