తెలంగాణ

శాశ్వత కరవు నివారణకు ప్రాజెక్టుల పునరాకృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, ఆగస్టు 8: తెలంగాణ రాష్ట్రంలో కరవు పరిస్థితులను శాశ్వతంగా పారదోలాలన్న సంకల్పంతోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుల రీడిజైనింగ్ చేపడుతోందని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ గత సమైక్య పాలకుల అసంబద్ధ నిర్ణయాలతో అనేక విధాలుగా నష్టపోయిందని, ప్రస్తుతం స్వరాష్ట్ర పాలనలో పరిస్థితిని చక్కదిద్దుతూ తెలంగాణ పునర్‌నిర్మాణమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కెసిఆర్ అహరహం శ్రమిస్తున్నారని అన్నారు. మంగళవారం స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులకు లోబడి గోదావరి, కృష్ణా జలాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుని తెలంగాణను సుభిక్షంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఇందులో భాగంగానే ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం చేపడుతున్నామని వివరించారు.
ఉత్తర తెలంగాణ జిల్లాలకు ప్రధాన ఆధారంగా ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువన గోదావరిపై మహారాష్ట్ర 400 వరకు ప్రాజెక్టులు, బ్యారేజీలు, చెక్‌డ్యాంలను నిర్మించడంతో ఎస్సారెస్పీలోకి వరద నీటి ప్రవాహం ఆశించిన స్థాయిలో వచ్చి చేరడం లేదన్నారు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఎస్సారెస్పీకి జలకళ తేవాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం 1070 కోట్ల రూపాయలతో పునరుజ్జీవ పథకాన్ని చేపడుతోందన్నారు. ప్రాణహిత, ఇంద్రావతి, శబరి నదులు కలిసే మేడిగడ్డ వద్ద నీటి లభ్యత గణనీయంగా ఉంటుందని, ప్రతిఏటా సుమారు 1611 టిఎంసిల జలాలు వృథాగా సముద్రంలో కలిసిపోతున్నాయని అన్నారు. ఈ ఏడాది ఎగువ నుండి ఎస్సారెస్పీలోకి 1 టిఎంసి వరద నీరు కూడా రాలేదని, అదే సమయంలో మేడిగడ్డ మీదుగా ఇప్పటికే 320 టిఎంసిల నీరు సముద్రం పాలైందన్నారు. ఈ నీటిని ఒడిసిపడుతూ, కాళేశ్వరం లిఫ్టు ద్వారా రివర్స్ పంపింగ్ విధానంలో ఎస్సారెస్పీలోకి నీటిని మళ్లిస్తున్నామన్నారు.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నుండి నీరు ఎల్లంపల్లి, మిడ్ మానేరు డ్యాంకు చేరుకుంటాయని, అక్కడి నుండి 33మీటర్ల ఎత్తుతో మూడు లిఫ్టులను నిర్మించి 11,500 క్యూసెక్కుల ప్రవాహంతో రోజుకు ఒక టిఎంసి చొప్పున నీటిని ఎస్సారెస్పీలోకి మళ్లిస్తామని వివరించారు. ఈ పనులు పూర్తయితే నిజామాబాద్‌తో పాటు కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లాలలో చివరి ఆయకట్టు వరకు ఖరీఫ్, రబీ సీజన్‌లలో లక్షలాది ఎకరాలకు సమృద్ధిగా సాగు జలాలు అందించవచ్చని అన్నారు. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, ఏడాదిలోగా పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం గడువు విధించిందన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం పనులతో పాటు కాల్వల ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేసేందుకు ఈ నెల 10వ తేదీన ముఖ్యమంత్రి కెసిఆర్ పోచంపాడ్‌కు హాజరవుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు దిగువన భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, ఎస్సారెస్పీ ద్వారా లబ్ధి పొందే ఐదు జిల్లాల నుండి సుమారు 5 లక్షల మంది రైతులు, ప్రజలు తరలివస్తారని అంచనా వేస్తున్నామన్నారు. ఈ మేరకు మంత్రి ఈటల నేతృత్వంలో సిఎం సభ విజయవంతానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి పోచా రం పేర్కొన్నారు. విలేఖరుల సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు, ఎమ్మెల్యేలు బిగాల గణేష్‌గుప్తా, జీవన్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ విజి.గౌడ్, నగర మేయర్ ఆకుల సుజాత, బంగారు నవనీత తదితరులు పాల్గొన్నారు.