తెలంగాణ

పొన్నం దీక్ష భగ్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, ఆగస్టు 8: సిఎం కెసిఆర్ ఇచ్చి న హామీ మేరకు జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేస్తూ పిసిసి ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ గత మూడు రోజులుగా చేపడుతున్న ఆమరణ దీక్షను మంగళవారం వేకువజామున పోలీసులు భగ్నం చేశారు. పదుల సంఖ్యలో దీక్షాస్థలికి చేరుకున్న పోలీసులు బలవంతంగా ప్రభాకర్‌ను అరెస్టు చేసి వాహనంలో జిల్లా ప్రభుత్వ ప్రధానాసుపత్రికి చేర్చి, వైద్య చికిత్సలందించేందుకు యత్నించారు. అయితే, పొన్నం ససేమిరా అనడంతో పోలీసులు మిన్నకుండగా, ఆస్పత్రిలోనే దీక్ష కొనసాగిస్తానని ప్రకటించారు. పోలీసు అధికారులు, పలువురు అగ్రశ్రేణి కాంగ్రెస్ నేతల సూచనలతో సాయంత్రం నుంచి ప్రభాకర్‌కు సెలైన్ (గ్లూకోజ్) అందిస్తున్నారు. ఎలాంటి ఆహార పదార్థాలను స్వీకరించడం లేదు. సోమవారం ప్రభాకర్‌కు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందని, దీక్ష విరమించకుంటే మూత్రపిండాలు, గుండెపై ప్రభా వం చూపే అవకాశం ఉందని తొపడంతో పోలీసులు రంగంలోకి దిగి పొన్నం ఆమరణ దీక్ష ను భగ్నం చేశారు. మంగళవారం వేకువజామున పోలీసులు దీక్షా స్థలికి చేరుకోగానే నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఒక్కసారిగా పోలీసులపై తిరగబడ్డారు. దీంతో కొద్దిసేపు ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టి, ప్రభాకర్‌ను సివిల్ ఆస్పత్రికి తరలించారు. పొన్నం అరెస్టు వార్త నగరంలో దావానంలా వ్యాపించగా, వందలాదిమంది కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు శిబిరం వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. అక్కడి నుం చి సివిల్ ఆస్పత్రికి వెళ్ళి ప్రభుత్వ తీరు, పోలీసుల వైఖరిని ఖండిస్తూ నినాదాలు చేశారు. ఉద యం నుంచే పలుచోట్ల కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనల కు దిగారు. దీనికితోడు ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మృత్యుంజయం నిరసనలు చేపట్టాలని పిలుపునివ్వడంతో నగరంతోపాటు ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ దిష్టిబొమ్మలను దగ్ధం చేసి, తమ నిరసనను తెలిపారు. కొన్ని చోట్ల సిఎం దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఎన్‌ఎస్‌యుఐ ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్ కు పిలుపునివ్వగా, పలు విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి.
నగరంలో విద్యా సంస్థలు స్వచ్ఛందంగా మూసివేశారు. దీక్ష భగ్నం వార్త తెలుసుకున్న ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్ శ్రేణులు నగరానికి తరలిరావటం, ఇతర పార్టీలు కూడా పొన్నం అరెస్టును ఖండిస్తూ, పలు నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆం దోళనకు దిగిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి, సాయంత్రం వదిలేశారు. పొన్నం ఇంటి వద్ద, పలు కూడళ్ళతోపాటు సివిల్ ఆస్పత్రి ఎదుట భారీ గా పోలీసులను మోహరించారు. ఆస్పత్రిలో దీక్ష కొనసాగిస్తున్న పొన్నంను సాయంత్రం టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్, అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ తదితరులు పరామర్శించారు. కాగా, మెడికల్ కళాశాల ఏర్పాటు ప్రకటన వచ్చేవరకు దీక్ష విరమించేదిలేదని, ఆసుపత్రి నుం చే దీక్ష కొనసాగిస్తానని ప్రభాకర్ స్పష్టం చేశారు.

చిత్రం.. అరెస్ట్‌ను నిరసిస్తూ రాస్తారోకో చేస్తున్న కాంగ్రెస్ నేతలు, (ఇన్‌సెట్‌లో) పొన్నంను అరెస్టు చేస్తున్న పోలీసులు