తెలంగాణ

అడ్డదారులు సరికాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 9: రాజకీయాల్లో అడ్డదార్లకు తావు లేదని, నీతి నిజాయితీతో పార్టీ ఇచ్చిన పనిని తాను చేస్తూ ఈ స్థాయికి ఎదిగానని నూతన ఉపరాష్టప్రతిగా ఎన్నికైన ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. తాను ఏ పదవిలో తానున్నా కుటుంబం కోసం దానిని వాడుకోలేదని, అలాగే కుటుంబ సభ్యుల వ్యాపారాల్లో తాను తలదూర్చలేదన్నారు. పత్రికల వారు తనతో చాలా సఖ్యతగానే ఉండేవారని, అలాగని వారు తనను ఎన్నడూ ఇబ్బంది పెట్టలేదని, బుధవారం నాడు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ అర్ధవంతమైన చర్చ జరిగేలా రాజ్యసభను నడిపిస్తానని, దీని కోసం సర్వేపల్లి రాధాకృష్ణన్, హిదయతుల్లా, జాకీర్ హుస్సేన్ వంటి వారు సభను నడిపిన తీరును అధ్యయనం చేస్తున్నానని చెప్పారు. ఉపరాష్టప్రతి పదవికి ప్రమాణ స్వీకారం చేసే ముందు ఇదే తన చివరి పాత్రికేయ సమావేశమని అన్నారు. ఉపరాష్టప్రతి పదవికి తన పేరును ప్రతిపాదించగానే ఉద్వేగానికి గురయ్యానని, 20 ఏళ్లు ఎంపిగా పనిచేసిన వ్యక్తి ఉప రాష్టప్రతి కావడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారని అన్నారు. ఇకపై పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలంటే బాధగా ఉందని, ఇకపై రాజకీయాలు మాట్లాడటానికి వీలుండదని పార్టీ నేతలు చెబుతున్నారని దాంతో ప్రజాజీవితంలో దేశానికి అవసరమైన విషయాలు మాత్రమే మాట్లాడాల్సి ఉంటుందన్నారు. దేశాభివృద్ధి అజెండాగా తాను పనిచేస్తానని, ఇంత వరకూ దేశంలో 623 జిల్లాలు పర్యటించానని, తెలుగు రాష్ట్రాల్లో ప్రతిజిల్లాను కనీసం 20 సార్లు చొప్పున పర్యటించానని అన్నారు. రాజకీయ నాయకులు ప్రజల్లో ఉంటేనే రాణిస్తారని పేర్కొన్నారు. విజయానికి పత్రికలు చాలా ముఖ్యమని, ప్రత్యక్షంగా ప్రజలందరినీ కలవాలంటే చాలా కష్టమని, వందకోట్ల మందిని చేరాలంటే పత్రికలే వారధిగా ఉంటాయన్నారు. వార్తల కోసం తానెన్నడూ పత్రికల వారితో స్నేహం చేయలేదని, అందరినీ గౌరవించేవాడినని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, కిషన్‌రెడ్డి, రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.
మోత్కుపల్లికి పదవి
కాగా వెంకయ్యనాయుడు నివాసంలో తెలంగాణ టిడిపి నేతలు కలిసి అభినందించిన సందర్భంగా త్వరలో మోత్కుపల్లి నర్సింహులుకు పదవి వరించనుందని వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించినట్టు తెలిసింది.