తెలంగాణ

పోలీసులది అత్యుత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 9: నేరెళ్ల ఘటనలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని మంత్రి కె తారకరామారావు వ్యాఖ్యానించారు. ఈ ఘటన దళితులపై దాడి కాదన్నారు. ఎక్కడైనా మా ప్రజలను మేమే కొట్టామని ఎందుకు చెబుతామని మంత్రి ప్రశ్నించారు. ఏ ప్రభుత్వం కూడా ప్రజలపై కేసులు పెట్టమని, కొట్టమని చెప్పదన్నారు. కేసులు పెట్టిన విషయం తనకు తెలియదన్నారు. ఈ ఘటనను తన దృష్టికి తీసుకరావడంలో స్థానిక నాయకత్వం విఫలమైందన్నారు. నేరేళ్ల ఘటనతో పాటు తాజా రాజకీయ పరిస్థితులపై బుధవారం మంత్రి కెటిఆర్ మీడియాతో తన అభిప్రాయాలను పంచుకున్నారు. దళితులపై జరిగిన దాడుల లెక్కలు తీస్తే కాంగ్రెస్‌కు ఉన్నన్ని నెత్తుటి మరకలు ఇంకే పార్టీకి లేవన్నారు. నేరేళ్ల ఘటనపై డిఐజి విచారణ జరుపుతున్నారని, నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. రాజకీయాలలో ఉన్నంత కాలం తాను సిరిసిల్ల నుంచే పోటీ చేస్తానని కెటిఆర్ స్పష్టం చేశారు. ఏ మాత్రం నిర్దారణ చేసుకోకుండా ప్రతిపక్షాలు అడ్డగోలు ఆరోపణలు చేస్తుంటే, అసలు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానా అని బాధేస్తుందని కెటిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు తన కుమారుడిని కూడా వదలిపెట్టకుండా విమర్శలు చేస్తున్నారన్నారు. మంత్రి హరీశ్‌రావుకు తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని కెటిఆర్ పునరుద్ఘాటించారు. తమ ఇద్దరి మధ్య అన్ని విషయాల్లోనూ క్లారిటీ ఉందన్నారు. 2029 వరకు కెసిఆరే సిఎంగా ఉండాలని తాము కోరుకుంటున్నామన్నారు. వచ్చే ఎన్నికలలో టిఆర్‌ఎస్‌కు 50శాతం ఓట్లు వస్తాయన్నారు. తమ పార్టీయే 2019లో ఘన విజయం సాధిస్తుందని మేమే చెప్పడం కాదు, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీనే చెప్పారని మంత్రి కెటిఆర్ గుర్తు చేశారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు రాకపోగా, బిజెపికి ఉన్న సీట్లు కూడా పోతాయని కెటిఆర్ జోస్యం చెప్పారు. తెలంగాణలో టిడిపి, వామపక్షాలకు ఉనికే లేదన్నారు. ఈ ఏడాదే మెట్రోరైలు ప్రాజెక్టును ప్రారంభించాలని యోచిస్తున్నామని, ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రిని ఆహ్వానిస్తామని అన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్దీకరించవద్దని కోర్టులే చెప్పాక తామేమి చేస్తామన్నారు. పోలీసుశాఖ కొనుగోలు చేసిన వాహనాలపై ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలపై స్పందిస్తూ హిమాన్షు మోటర్స్ అనేది తమ సంస్థనే అయినప్పటికీ ఇది ట్రాక్టర్లకు సంబంధించిందని, దీనికి కార్లు, బైకుల కొనుగోలుతో సంబంధం లేదని మంత్రి చెప్పారు. అయినా 2011 నుంచే హిమాన్షు మోటర్స్ కంపెనీలో ఎలాంటి వ్యాపార లావాదేవీలు జరగడం లేదని మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు.