తెలంగాణ

విచారణ పూర్తయ్యాక చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేములవాడ, ఆగస్టు 9: సిరిసిల్ల రాజన్న జిల్లా నేరెళ్ల ఘటనలో పోలీసులు చేసిన అత్యుత్సాహంతో అపవాదు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పోలీస్ శాఖ ఆలస్యంగా స్పందించింది. సంఘటన జరిగిన నెలరోజుల తరువాత బాధితులను విచారించేందుకు కరీంనగర్ రేంజ్ డిఐజి రవి వర్మ బుధవారం వేములవాడకు చేరుకొని బాధితులు చికిత్స పొందుతున్న మనోహర్ ఆసుపత్రికి స్వయంగా వెళ్లి విచారించారు. సుమారు గంటకు పైగా బాధితులను సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. విచారణ ముగించుకుని తిరిగి వెళ్తున్న క్రమంలో మీడియా డిఐజిని ప్రశ్నించగా తాము పూర్తి విచారణ చేపడుతున్నామని, ఈ క్రమంలో ఎనిమిది మంది బాధితుల స్టేట్‌మెంట్‌ను సేకరించామని చెప్పారు. ఇంకా విచారణ చేయాల్సింది ఉందని, అది పూర్తయ్యాక తాము చర్యలు తీసుకుంటామని సమాధానం ఇచ్చారు.
మొక్కుబడిగా పరామర్శించారు: బాధితులు
నేరెళ్ల ఘటనలో పోలీసుల చేతిలో చిత్రహింసలకు గురైన తమకు ప్రభుత్వం నుండి ఎలాంటి బాధ్యతాయుతమైన హామీ రాలేదని, మంత్రి కెటిఆర్ మొక్కుబడిగా వచ్చి పరామర్శించి వెళ్లారని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఏమీ ఇవ్వలేదని బాధితులు మండిమడ్డారు. నేరెళ్ల బాధితులు బానయ్య, హరీశ్ బుధవారం ఆసుపత్రిలో విలేఖరులతో మాట్లాడారు. పోలీసులు కొట్టిన దెబ్బలకు నెలరోజులుగా తాము విలవిల్లాడుతుంటే మంగళవారం ఉదయం చెప్పపెట్టకుండా మంత్రి కెటిఆర్ వచ్చి తమను పరామర్శించారే తప్ప తమ డిమాండ్లపై స్పష్టత ఇవ్వకుండా దాటవేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమను కులం పేరుతో దూషించి, విచక్షణారహితంగా చావబాదిన ఎస్‌పి, సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేయాలని, వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టాలని మంత్రిని కోరామని తెలిపారు.
అయితే మంత్రి మాత్రం ఈ అంశం తన పరిధిలో లేదని చెప్పి, అది డిఐజి విచారణ జరిపిన తరువాత అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని, తమకు మెరుగైన వైద్యం అందిస్తామని, ఇసుక లారీలను ఆపుచేయిస్తానని, ఉపాధి అవకాశాలను కల్పిస్తానని, కండిషనబుల్ బెయిల్ రద్దు చేయిస్తామని చెప్పినట్లు చెప్పినట్లు బాధితులు తెలిపారు. తమపై అకారణంగా, విచక్షణారహితంగా కొట్టి, థర్డ్ డిగ్రీ ప్రయోగించిన జిల్లా ఎస్‌పి విశ్వజిత్ కంపాటి, ఎస్సై రవీందర్, 13 మంది పోలీస్ సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. తమను పరామర్శిస్తున్న నాయకులను మీరు ఎందుకు తిడుతున్నారని మంత్రిని నిలదీసినట్లు బాధితులు చెప్పారు.