తెలంగాణ

సిఎం పర్యటనకు పోచంపాడ్ ముస్తాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, ఆగస్టు 9: రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పర్యటనకు పోచంపాడ్ అన్ని హంగులను సంతరించుకుని అందంగా ముస్తాబైంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవ పథకానికి గురువారం ఆయన శంకుస్థాపన చేయనున్నారు. బుధవారం సాయంత్రమే రోడ్డు మార్గం గుండా ఇక్కడికి చేరుకున్న ముఖ్యమంత్రి, పోచంపాడ్‌లోని ఎస్సారెస్పీ గెస్ట్‌హౌస్‌లో బస చేశారు. గురువారం ఉదయం 11 గంటలకు ఎస్సారెస్పీ వరద కాల్వ వద్ద ఏర్పాటు చేసిన శంకుస్థాపన పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు. తిరిగి గెస్ట్‌హౌస్‌కు చేరుకుని భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 1.10 గంటలకు ప్రాజెక్టు దిగువ భాగాన ఏర్పాటు చేసిన బహిరంగ సభాస్థలికి చేరుకుని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ప్రాజెక్టుల నిర్మాణాలపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు పోచంపాడ్ సభను వేదికగా మలుచుకోవాలని సిఎం కెసిఆర్ భావిస్తుండడంతో ఏర్పాట్లపై మరింత ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారు.
ఎస్సారెస్పీ ద్వారా లబ్ధి పొందుతున్న నిజామాబాద్ సహా ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాల నుండి భారీగా జన సమీకరణ జరిపేందుకు కసరత్తు చేస్తున్నారు. సుమారు ఐదు లక్షల మందిని సమీకరించేందుకు ఎక్కడికక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేశారు. మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపి కల్వకుంట్ల కవిత, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డితో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా గత వారం రోజుల నుండి సిఎం పర్యటన ఏర్పాట్లను చక్కబెట్టడంలోనే నిమగ్నమయ్యారు.
లక్షలాదిగా తరలివచ్చే జనానికి సరిపోయే రీతిలో ప్రాజెక్టు దిగువన ఖాళీ ప్రదేశాన్ని చదును చేయించి సభా వేదికను ఇప్పటికే సిద్ధం చేశారు. నిజామాబాద్ జిల్లా సరిహద్దు ప్రారంభమయ్యే ఇందల్వాయి నుండి మొదలుకుని పోచంపాడ్ వరకు ఎక్కడికక్కడ గులాబీ జెండాలు, స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. కలెక్టర్ యోగితారాణా, రేంజ్ డిఐజి శివశంకర్‌రెడ్డి, కమిషనర్ కార్తికేయ, జె.సి రవీందర్‌రెడ్డి తదితరులు పలు పర్యాయాలు పోచంపాడ్‌ను సందర్శించి సిఎం సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు. పోచంపాడ్ ఎక్స్‌రోడ్డు నుండి ఎస్సారెస్పీ ప్రాజెక్టు వరకు రోడ్డును ఆధునీకరించి ఇరువైపులా మొక్కలు నాటించారు. గత రెండు రోజుల నుండి కురిసిన వర్షాలు బుధవారం మధ్యాహ్నం నుండి ఎడతెరిపినివ్వడంతో తెరాస శ్రేణులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.