తెలంగాణ

లీజుకు ఆర్టీసీ భూములు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 10: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్రంలోని 14ప్రదేశాల్లో ఖాళీ స్థలాలను లీజుకు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ స్థలాలను వాణిజ్య సంస్థలకు ఇచ్చి ఆదాయాన్ని పెంచుకోవాలని ఆర్టీసి యోచిస్తోంది. ప్రైవేట్ ఏజన్సీలు, వాణిజ్య సంస్థల సహాయంతో బిల్డ్, ఆపరేట్, ట్రాన్సఫర్ (బివోటి) మోడ్ పద్ధతిలో వీటిని లీజుకిస్తారు. రాజధానిలో ముషీరాబాద్‌లోని బస్ భవన్ వద్ద ఉన్న తొమ్మిది ఎకరాల స్థలాన్ని కూడా లీజుకు ఇవ్వనున్నారు. హైదరాబాద్ ముషీరాబాద్‌లో 9.14 ఎకరాలు, నిర్మల్ బస్ డిపో వద్ద 0.481ఎకరాలు, రంగారెడ్డి జిల్లా ఇబ్రహింపట్నం బస్‌స్టేషన్ వద్ద 0.583ఎకరాలు, భద్రాద్రి జిల్లాలో సత్తుపల్లి బస్‌స్టేషన్ వద్ద రెండు ఎకరాలు, కరీంనగర్ జిల్లాలో పాత డిస్పెన్సరీ సైట్ 0.613 ఎకరాలు, అదే జిల్లాలో జోనల్ వర్క్‌షాపు వద్ద 3.91 ఎకరాలు, జగిత్యాల బస్‌స్టేషన్ వద్ద 0.397 ఎకరాలు, సిద్దిపేట జిల్లాలో ప్రజ్ఞాపూర్ వద్ద 1.766ఎకరాలు, సంగారెడ్డిలో కొత్త బస్‌స్టేషన్ వద్ద 1.2 ఎకరాలు, సదాశివపేట బస్ స్టేషన్ వద్ద 0.315 ఎకకరం, సూర్యాపేట కొత్త బస్‌స్టేషన్ వద్ద 2.2 ఎకరాలు, వికారాబాద్ జిల్లాలో పరిగి బస్‌స్టేషన్ వద్ద 0.996ఎకరాలు, హన్మకొండ స్ట్ఫా క్వార్టర్స్ వద్ద 0.879 ఎకరాలను లీజుకు ఇచ్చేందుకు త్వరలో లీజుకు ఇవ్వనున్నారు. ఈ మేరకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఖాళీ స్థలాలను లీజుకు ఇవ్వడం వల్ల ఆర్టీసికి ఆదాయంతో పాటు ఆక్రమణలకు గురికాకుండా ఉంటాయని ఆర్టీసి వర్గాలు తెలిపాయి. ఎంపికైన సంస్థలకు 33 సంవత్సరాల పాటు లీజుకు ఇస్తారు. ఇక్కడ మల్టిప్లెక్స్, వాణిజ్య సంస్థలను నిర్మించవచ్చు. కాగా లీజుదారులు వార్షిక లీజు ఫీజును తగ్గించాలని కోరుతున్నారు.