తెలంగాణ

మళ్లీ షిఫాలీ వాంగ్మూలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 10: మాజీ మంత్రి తనయుడు విక్రమ్‌గౌడ్ ఇంట్లో కాల్పుల ఘటనపై విక్రమ్ భార్య షిఫాలి వాంగ్మూలాలను పోలీసులు మరోసారి అడిగి తెలుసుకున్నారు. విక్రమ్‌గౌడ్‌ను ఒక్కరోజు కస్టడీకి తీసుకున్న పోలీసులు విచారించారు. ఈ విచారణలో కొత్త విషయాలేవీ రాబట్టలేదని తెలిసింది. విక్రమ్ కస్టడీ బుధవారం మధ్యాహ్నానికే ముగిసింది. కాల్పుల వ్యవహారంలో దాగివున్న పలు కీలక అంశాలపై పోలీసులు వివరాలు అడిగి తెలుసుకున్నారు కాల్పుల ఘటన తరువాత విక్రమ్, అతని భార్య షిఫాలి నుంచి తీసుకున్న వాంగ్మూలాలను మరోసారి అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. అసలు కాల్పుల ఘటనలో నిందితుల్ని అరెస్టు చేసిన సమయంలోనే ఆ కేసులో సస్పెన్స్ వీడినప్పటికీ..పలు అనుమానాల నివృత్తి కోసం పోలీసులు ప్రయత్నించారు. అయితే విక్రమ్‌ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు అతడి నుంచి ఎలాంటి సమాచారం రాబట్టలేదని తెలుస్తోంది. గతంలో వెల్లడించిన వివరాలు తప్ప..మరే ఇతర వివరాలు రాబట్టలేకపోయారని తెలుస్తోంది.