తెలంగాణ

విద్యార్థి ఉద్యమాలతో అట్టుడికిన రాష్ట్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 10: ప్రభుత్వ జూనియర్ కాలేజీల పనితీరు, ప్రభుత్వ సాచివేత ధోరణిని నిరసిస్తూ ఎస్‌ఎఫ్‌ఐ, ఎబివిపి ఇచ్చిన బంద్ పిలుపుతో రాష్ట్రం అట్టుడికిపోయింది. రెండు విద్యార్థి సంఘాల పిలుపుతో జూనియర్ కాలేజీలు మూతపడ్డాయి. అనేక పట్టణాల్లో వందలాది విద్యార్థులు నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహించారు. పలు పట్టణాల్లో విద్యార్థి నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. విద్యార్థి నిరుద్యోగ సమస్యలు పరిష్కారం చేయకుండా ప్రభుత్వం పోలీసులతో యాక్ట్ 30ని తీసుకువచ్చి, ఉద్యమాలను ఆపాలని చూస్తోందని, ఉద్యమాలను ఆపే శక్తి గతంలో పనిచేసిన ప్రధానులకే సాధ్యం కాలేదని ఎబివిపి నేత అయ్యప్ప పేర్కొన్నారు. శుక్రవారం నుండి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుడతామని ప్రకటించారు. రాష్ట్రంలో శ్రీచైతన్య, నారాయణ కాలేజీలకు ప్రభుత్వం అమ్ముడుపోయిందని ఆ కాలేజీల్లో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వం ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. బండ్లగూడలోని నారాయణ జూనియర్ కాలేజీలో విద్యార్థిని శ్రావ్య ఆత్మహత్యకు నిరసనగా శుక్రవారం నాడు నారాయణ జూనియర్ కాలేజీల బంద్‌కు పిలుపునిచ్చినట్టు వారు చెప్పారు.
నారాయణ జూనియర్ కాలేజీలపై ఎలాంటి చర్యలు ప్రభుత్వం తీసుకోవడం లేదని ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్ష, కార్యదర్శులు ఎం నాగేశ్వరరావు, కోట రమేష్‌లు పేర్కొన్నారు. విచ్చలవిడిగా క్యాంపస్‌లు పెడుతూ విద్యావ్యాపారం చేస్తున్నా ఇంటర్ విద్యాధికారులు కార్పొరేట్ కాలేజీలకు వత్తాసు పలుకుతూ వ్యవహరిస్తున్నారని అన్నారు. మూడేళ్లలో విద్యారంగాన్ని ప్రభుత్వం సర్వనాశనం చేసిందని ఎబివిపి నేతలు ఎద్దేవా చేశారు. పెండింగ్‌లోని 1700 కోట్ల రూపాయిలు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు విడుదల చేయకుండా ఆటలాడుతోందని అన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి కనీసం 4వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదని, టిఎస్‌పిఎస్‌సి అనేక పొరపాట్లు చేస్తోందని, రాష్ట్రప్రభుత్వం టిఎస్‌పిఎస్‌సిని రద్దు చేయాలని ఎబివిపి కార్యదర్శి కోరారు.
ఎస్‌ఎఫ్‌ఐలో చీలిక వార్తలు సరిదని, సంఘం నియమ నిబంధనలను పాటించని వారిని బహిష్కరించడం జరిగిందని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎం నాగేశ్వరరావు తెలిపారు.