తెలంగాణ

కార్మికుల సమిష్టి కృషితోనే అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 10: కార్మికుల సమిష్టి కృషితోనే దక్షిణ మధ్య రైల్వే అభివృద్ధి సాధిస్తుందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ యాదవ్ అన్నారు. దేశంలో దక్షిణ మధ్య రైల్వేకు మంచి గుర్తింపు తీసుకువచ్చిన ఘనత కార్మికులదేనని ఆయన అన్నారు. గురువారం సికిందరాబాద్‌లో జరిగిన దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ 47వ, వార్షిక సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జిఎం వినోద్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ, 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ. 4320 కోట్ల రెవెన్యూ సాధించిందన్నారు. గత ఏడాది కంటే 12శాతం వృద్ధి సాధించినట్టు ఆయన పేర్కొన్నారు. రైల్వే అభివృద్ధితోపాటు కార్మికుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. కార్మికులకు రైల్వే ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు, కార్మికుల పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్టు జిఎం వికె యాదవ్ అన్నారు. కార్మికులు, సిబ్బంది కుటుంబాలకు పాస్‌పోర్టుల కోసం పాస్‌పోర్టు మేళా, (మీకోసం) జాబ్ మేళా( మనకోసం) వంటి కార్యక్రమాలు చేపట్టి ఐదువేల మందికి పాస్‌పోర్టులు, 2300 మందికి ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. ఈ సదస్సులో ఆలిండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి శివగోపాల్ మిశ్రా, సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు కె శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. గురువారం హైదరాబాద్‌లో జరిగిన సదస్సులో ప్రసంగిస్తున్న దక్షిణ మధ్య రైల్వే జిఎం వినోద్‌కుమార్ యాదవ్‌