తెలంగాణ

ఉస్మానియాకు నేక్ గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 10: ఉస్మానియా యూనివర్శిటీకి నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ (నేక్) గుర్తింపు కోసం ఈ నెల 17న ప్రత్యేక పరిశీలన బృందం రానుంది. ఈ బృందానికి ప్రొఫెసర్ ఎస్ కె సింగ్ చైర్మన్‌గా ఉంటారు. మెంబర్ కో ఆర్డినేటర్‌గా ప్రొఫెసర్ సతీందర్ సింగ్ వ్యవహరిస్తారు. ఈ బృందంలో ప్రొఫెసర్ విజేయేందర్ కుమార్, ప్రొఫెసర్ కె జయప్రసాద్, ప్రొఫెసర్ ఎ వి సింగ్ మదనావత్, ప్రొఫెసర్ హెచ్ రాజశేఖర్, ప్రొఫెసర్ డి ఆర్ భాస్కర్, ప్రొఫెసర్ కనిక శర్మ, ప్రొఫెసర్ శైలేంద్ర షరాఫ్ ఉంటారు. ఈ బృందం మూడు రోజుల పాటు యూనివర్శిటీలో పర్యటిస్తుంది. వివిధ విభాగాలను , అక్కడ పనిచేస్తున్న బోధన సిబ్బందతో మాట్లాడతారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ ఈ బృందానికి పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ఇవ్వనున్నారు. ఇందులో యూనివర్శిటీ చరిత్ర, సాధించిన విజయాలు, సమస్యలు, అధిగమించిన తీరును చెబుతారు. ఇంకో పక్క యూనివర్శిటీ టీచర్స్ అసోసియేషన్ సభ్యులను, రిజిస్ట్రార్‌తోనూ, రెక్టార్‌తోనూ, యూనివర్శిటీ విసి ఓఎస్‌డితో కూడా ఈ బృందం సమావేశమవుతుంది. ఈ సందర్భంగా యూనివర్శిటీని పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్ధి సంఘాల నాయకులు సహకరించాలని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎస్ రామచంద్రం కోరారు.