తెలంగాణ

టిఎస్ ఆర్టీసికి నేషనల్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఎక్స్‌లెన్స్ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 11: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్‌ఆర్‌టిసి)కి ‘నేషనల్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఎక్స్‌లెన్స్ 2017’ అవార్డు లభించింది. దేశంలోనే తొలిసారిగా టిఎస్‌ఆర్‌టిసి ప్రవేశపెట్టిన ‘వజ్ర’ ప్రయాణికుల ముంగిట్లోకే బస్ సర్వీస్ విధానం జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది. శుక్రవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి లీలా నందన్ నుంచి టిఎస్‌ఆర్‌టిసి ఎండి జివి రమణారావు అవార్డును స్వీకరించారు. అవార్డు కింద ట్రోపీ, ప్రశంసాపత్రం, రూ.5 లక్షల నగదు బహుమతిని ఎండి అందుకున్నారు. ప్రస్తుతం హైదారాబాద్-వరంగల్, హైదరాబాద్-నిజామాబాద్ రూట్లో ప్రయాణీకులను సర్వే చేసిన అనంతరం నగరంలోని ముఖ్యమైన కాలనీల నుంచి ప్రయాణీకుల ఎక్కించుకుని ఆయా గమ్య స్థానాలకు చేరుస్తున్నారు. వజ్ర బస్ సర్వీస్ పేరుతో ఈ బస్‌లను గత కొన్ని రోజుల నుంచి ఆర్టీసి నడుపుతోంది. ప్రయాణీకుల ముంగిట్లోకే బస్సులను నడుపుతూ, ప్రయాణీకులకు మరింత చేరువ అయ్యేందుకు ఆర్టీసి కృషి చేస్తోంది. ఈ వజ్ర బస్సు ప్రయాణీకులు యాప్ ద్వారా టిక్కెట్ బుక్ చేసుకునే సౌకర్యం ఉంది.