తెలంగాణ

ఎస్‌పిపై చర్యలు తీసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 11: నేరెళ్ళ ఘటనలో సిరిసిల్ల జిల్లా పోలీసు సూపరింటెండెంట్ విశ్వనాథ్‌పై చర్యలు తీసుకోవాలని, ఎస్‌సిలను అనాగరికంగా హింసించిన పోలీసులపై ఎస్‌సి, ఎస్‌టి వేధింపుల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలని అఖిలపక్ష బృందం రాష్ట్ర డిజిపిని విజ్ఞప్తి చేసింది. శుక్రవారం కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క, టి.టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే ఎ. రేవంత్ రెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి తదితరులు డిజిపిని కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. అనంతరం భట్టివిక్రమార్క మీడియాతో మాట్లాడుతూ సంబంధిత పోలీసులపై అట్రాసిటీ కేసులు ఎందుకు నమోదు చేయలేదని డిజిపిని ప్రశ్నించామని చెప్పారు. పోలీసులే దాడులు చేశారని, అత్యుత్సాహం ప్రదర్శించారని ప్రభుత్వమే అంగీకరించిందని ఆయన గుర్తు చేశారు. కాబట్టి వెంటనే పోలీసు అధికారులపై కేసులు నమోదు చేయాలని కోరామని అన్నారు. ఎస్‌పి విశ్వజిత్‌పై చర్యలు తీసుకోవాలని కోరినట్లు ఆయన చెప్పారు.రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సిరిసిల్ల జిల్లా ఎస్‌పి విశ్వజిత్‌పై బాధితులు ఫిర్యాదు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. నేరెళ్ళ ఘటనలో ఒక్క ఎస్‌ఐనే బాధ్యున్ని చేసి మిగతా వారిని ఎందుకు వదిలి వేసిందని ఆయన ప్రశ్నించారు. ఇసుక లారీ యాజమాన్యంపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. రాజకీయ వత్తిళ్ళు వచ్చినా, పట్టించుకోకుండా దోషులపై చర్యలు తీసుకుని, బాధితులకు న్యాయం చేయాలని కోరామని ఆయన తెలిపారు. పోలీసులతో సంబంధం లేకుండా మంత్రి కెటిఆరే స్వయంగా ఎస్‌ఐని సస్పెండ్ చేసినట్లు ఎలా చెబుతారని కూడా డిజిపిని ప్రశ్నించామని ఆయన చెప్పారు. దీనిని బట్టి పోలీసులు మంత్రి కెటిఆర్‌ను సంతృప్తి పరిచేందుకు పని చేస్తున్నారని అర్థమవుతున్నదని అన్నారు. పోలీసులు ప్రజల కోసం పని చేయాలని రేవంత్ రెడ్డి కోరారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ నేరెళ్ళ ఘటన జరిగి 40 రోజులవుతున్నా పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. కెటిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో దళితుల ప్రాణాలకు రక్షణ లేదని ఆయన విమర్శించారు. మంత్రి కెటిఆర్‌కు ప్రజలను కలిసే తీరికా లేదని విమర్శించారు. దళితులను దారుణంగా కొట్టించిన ఎస్‌పిపై వెంటనే చర్యలు తీసుకుని వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
సిఎం ఎందుకు వెళ్ళడం లేదు
నేరెళ్ళ ఘటనలో బాధితులను పరామర్శించేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఎందుకు వెళ్ళడం లేదని టి.టిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు ప్రశ్నించారు. అమాయకులైన దళిత యువకులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి జీవితాంతం కోలుకోకుండా కొట్టేంత ధైర్యం ఎవరు ఇచ్చారని వారు ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి వచ్చిన వత్తిళ్ళ కారణంగానే ఎస్పీ రంగంలోకి దిగారన్నారు.

చిత్రం.. శుక్రవారం డిజిపిని కలిసిన అనంతరం విలేఖరులతో మాట్లాడుతున్న అఖిలపక్షం నేతలు