తెలంగాణ

ఏర్పాట్లు వేగిరం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 11: గోల్గొండ కోటలో ఆగస్టు 15వ తేదీ మంగళవారం జరగనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి విజయవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.సింగ్ అన్నారు. శుక్రవారం నాడిక్కడ గోల్కొండలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల గురించి అధికారులతో సమీక్షించారు. ఈ వేడుకలకు పక్కా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సిఎంతో పాటు మంత్రులు, ప్రజా ప్రతినిధులు, స్వాతంత్య్ర సమరయోధులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొంటారని తెలిపారు. అతిథులు, అవార్డు గ్రహీతలు, మీడియా, విఐపిలు ఎక్కడ ఆసీనులు కావాలో ముందే స్పష్టం చేయాలని సూచించారు. రాణి మహల్ వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేసి స్టేజిని, కోట ప్రధాన గేటు వద్ద పోలీసులు నిర్వహించే పరేడ్ రిహార్సల్స్‌ను పరిశీలించి తగు సూచనలు ఇవ్వాలని అన్నారు. పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టాలని ఆయన పోలీసు శాఖను ఆదేశించారు. ఇంటిలిజెన్స్ ఐజి ఎంకె సింగ్, సిఐడి ఐజి శిఖాగోయెల్, ప్రోటోకాల్ డిఐజి అంజనీకుమార్, హైదరాబాద్ నగర సిపి మహేందర్‌రెడ్డి, జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్థన్‌రెడ్డి, సమాచార శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ పలు విభాగాలకు చెందిన కార్యదర్శులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.
ప్రతి ఇంటికి ఆరేసి పూలు పళ్ల మొక్కలు
హరిత హారంలో భాగంగా ప్రతి ఇంటికి ఆరేసి పూలు, పళ్ల మొక్కలు ఇవ్వాలని నిర్ణయించారు. హరిత హారం అమలుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మూడవ విడత హరిత హారం కోసం అటవీ శాఖతో పాటు గ్రామీణాభివృద్ధి శాఖల వద్ద 2925 నర్సరీల్లో 42కోట్ల మొక్కల పెంపకం జరిగినట్టు చెప్పారు. కాలనీ సంఘాలు, అపార్ట్‌మెంట్లు, సొసైటీలను మొక్కల పెంపకంలో భాగస్వామ్యం చేయాలని కోరారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ ఫండ్స్‌ను కూడా మొక్కల పెంపకానికి వినియోగించుకోవాలని సూచించారు. సింగరేణి సంస్థ స్వయంగా ముందుకు వచ్చి భారీ ఎత్తున మొక్కలు పెంచుతున్నట్టు చెప్పారు. ప్రజలు స్వయంగా ముందుకు వస్తే, కోరిన పూలు, పండ్ల మొక్కలు ఇవ్వాలని చెప్పారు. కాలేజీలు, పాఠశాలల్లో పిల్లలు మొక్కలు పెంచేందుకు ప్రోత్సహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాన అటవీ సంరక్షణ అధికారి పికె ఝా పాల్గొన్నారు.

చిత్రం.. గోల్కొండలో నిర్వహించనున్న పంద్రాగస్టు వేడుకల ఏర్పాట్లను
పర్యవేక్షిస్తున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్