దక్షిన తెలంగాణ

స్నేహ మధురిమలు (పుస్తక సమీక్ష)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్నేహం కొమ్మల్లో కోయిలమ్మ కూత

వంటిదని..ప్రకృతిలో పచ్చదనం..అమ్మ

వొడిలోని కమ్మదనం స్నేహమని..స్నేహంలోని

మాధుర్యాన్ని తెలుపుతూ ‘స్నేహమధురిమ’

గ్రంథాన్ని వెలువరించి కవి లంకా వెంకట

సుబ్రహ్మణ్యం గారు తమ సృజనను

చాటుకున్నారు. కటిక చీకటిలో దివిటి లాంటిది

స్నేహమని..అది అజ్ఞానానికి అడ్డుకట్ట

వేస్తుందని కవి తమ కవితల్లో అందంగా

స్నేహాన్ని ఆవిష్కరించారు. స్నేహం

అరమరికలు లేని అభిమానానికి భవంతి

వంటిదనీ..అభిమానాన్ని అనురాగాన్ని

అరటాకులో పెట్టి అందించేది స్నేహమని

విడమరిచి చెప్పారు. ఈ గ్రంథంలోని ప్రతి పదం..

స్నేహం యొక్క గొప్పదనాన్ని తెలిపేలా కవి

తీసుకున్న శ్రద్ధ ప్రశంసనీయం! స్నేహాన్ని

అసహనం ఎరుగని అల్లికగా పరధ్యానం ఎరుగని

ప్రమోదాల మాలికగా అభివర్ణించారు. అంతటితో

ఆగకుండా కవి సుబ్రహ్మణ్యంగారు.. స్నేహాన్ని..

విజయగీతికగా.. మువ్వనె్నల పతాకగా..

శ్రీకృష్ణుని చేతిలోని వేణుగాన గీతికగా తన

కవితల్లో చక్కగా చిత్రించారు.
కృత్రిమత్వం లేని కమనీయ మానవత్వంగా,

చిరునవ్వుకు చిరునామాగా తమ కవిత్వంలో

కవి స్నేహాన్ని చూపడం అభినందనీయం!

స్నేహం యొక్క మంచితనాన్ని, సహనాన్ని,

ప్రాశస్త్యాన్ని, కవి తమ కవితల్లో చక్కగా

ప్రస్తావించారు. ఇలా స్నేహాన్ని విభిన్న కోణాల్లో

ఆవిష్కరించిన కవి సుబ్రహ్మణ్యం గారికి

శుభాకాంక్షలు తెలుపుదాం..
కార్తీక పున్నమిని మించిన చల్లదనాన్ని

పంచిన ఈ గ్రంథంలోని స్నేహ మధురిమలకు

ఆహ్వానం పలుకుదాం.. ఆణిముత్యం లాంటి

ఆప్యాయతను పంచడంలో అగ్రస్థానంలో వుండే

స్నేహాన్ని అక్కున చేర్చుకుందాం.. పత్రహరితం

లాంటి ప్రతిభకు ప్రత్యేక సంతకంలా భాసిల్లే

స్నేహాన్ని అందరం పాటిద్దాం.. అందరికీ

చేరువవుదాం.. అందరి మన్ననలు

పొందుదాం.. స్నేహానికన్న లోకాన ఏది లేదని

తెలుసుకుని ఆనందమయ జీవనం

గడుపుదాం.
పేజీలు: 60
వెల : అమూల్యం
ప్రతులకు:
లంకా వెంకట సుబ్రహ్మణ్యం
సెల్.నం.9440448650

- సాన్వి, సెల్.నం.9440525544