తెలంగాణ

నదుల్లో కనీస నీటి ప్రవాహం ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 13: దేశంలోని నదుల్లో ప్రవహించే నీటిలో కనీసం 15 నుంచి 20 శాతం నీరు నిరంతరం ప్రవహించే విధంగా చర్యలు తీసుకోవాలని, దీని వల్ల పర్యావరణ సమతుల్యతను పరిరక్షించాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అన్ని రాష్ట్రప్రభుత్వాలను ఆదేశించింది. జీవవైవిధ్యం, మనుషులు, పశుపక్షాదుల మనుగడకు పర్యావరణ పరిరక్షణలో భాగంగా నదుల్లో కనీసం 15 నుంచి 20 శాతం నీరు ప్రవహించాలని ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ స్వతంత్ర కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు అన్ని రాష్ట్రప్రభుత్వాలను చర్యలు తీసుకోవాలని కోరారు. సగటు నీటి పరిణామం నదుల్లో ప్రవహించని పక్షంలో కేంద పర్యావరణ శాఖను రాష్ట్రప్రభుత్వాలు సంప్రదించాలన్నారు. ఒక వేళ తమ భౌగోళిక పరిధిలో నిర్దేశించిన పరిణామంలో నీటి ప్రవాహం లేని పక్షంలో తప్పనిసరిగా కేంద్ర పర్యావరణ శాఖ కార్యదర్శిని రాష్ట్రప్రభుత్వాలు సంప్రదించే అధికారం ఉందన్నారు. ఈ శాఖ కార్యదర్శి కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరిపి అవసరమైన చర్యలు తీసుకుంటారని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పేర్కొంది. తాము నిర్ణయించిన పరిమితి కంటే తక్కువ పరిమితిలో కూడా పర్యావరణ సమతుల్యత పరిరక్షణ చేయవచ్చని ఏ రాష్టమ్రైనా చెబితే, ఆ ప్రతిపాదనను పరిశీలిస్తామన్నారు. ఒక కేసులో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ దేశంలో ఆరు నదీ బేసిన్లకు సంబంధించి వివరాలను ట్రిబ్యునల్‌కు అందించింది. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన సియాంగ్, తవాంగ్, బికమ్, సుబన్‌సిరి, దిబాంగ్, సియాంగ్ అనే నదులుపై ఈ శాఖ అధ్యయనం చేసింది. నదుల్లో మొత్తం నీటి ప్రవాహంలో కనీసం 18 శాతం నీటి ప్రవాహం ఉండాలని పర్యావరణ మంత్రిత్వ శాఖ సిఫార్సు చేసింది. నదుల్లో కనీస నీటి ప్రవాహం ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ పంజాబ్‌కు చెందిన పర్యావరణ కార్యకర్త పుష్పాసైని దాఖలు చేసిన పిటిషన్‌పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పై ఆదేశాలను జారీ చేసింది.