తెలంగాణ

‘ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 13: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరిని కోరింది. విద్యాసంస్థల్లో సౌకర్యాల విషయంలో విద్యార్థి, విద్యార్థినులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.నాగేశ్వరరావు మంత్రికి సమర్పించిన లేఖలో పేర్కొన్నారు. కొన్ని చోట్ల హాస్టళ్ల భవనాలు కూలిపోయే దశలో ఉండగా, ప్రహారీ గోడలు లేక మరికొన్ని చోట్ల హాస్టళ్లలో భద్రత కరువైందని తెలిపారు. సరైన ఆహారం లేక, ఆవిరి యంత్రాలతో వండటం మూలంగా అన్నం జిగురుగా తయారవుతోందని మంత్రి దృష్టికి తెచ్చారు.
అంగన్‌వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడంతో పాటు స్వచ్ఛంధ సంస్థలకు అప్పగించ వద్దని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.