తెలంగాణ

రాబోయే రోజులే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 13: ‘రాబోయే రోజులే మనకు చాలా కీలకం, ఇక మీదట ప్రతి రోజూ, ప్రతి గంట, ప్రతి నిమిషం కష్టపడి పని చేయాలి..’ అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన రామచంద్ర కుంతియా అన్నారు. టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం గాంధీ భవన్‌లో టి.పిసిసి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌సి కుంతియా, ఇన్‌చార్జి కార్యదర్శి సతీష్ జార్కోలితో పాటు సిఎల్‌పి నాయకుడు కె. జానారెడ్డి, టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క, శాసనమండలిలో ప్రతిపక్ష నేత మహ్మద్ షబ్బీర్ అలీ, పిసిసి మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఎంపి రేణుకా చౌదరి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, పార్టీ అనుబంధ విభాగాల చైర్మన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుంతియా మాట్లాడుతూ గడప, గడపకూ కాంగ్రెస్‌ను తీసుకెళ్లాలని అన్నారు. కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ, తెలంగాణలో టిఆర్‌ఎస్ చేస్తున్న ప్రజాకంటక పాలన, నిఠ్బంధం, అవినీతి అంశాలపై అధికార ప్రతినిధులు ఎప్పటికప్పుడు స్పందించాలని సూచించారు. ప్రతి అంశంపై లోతుగా అధ్యయనం చేయాలని, విమర్శలు సూటిగా, గట్టిగా ఉండేలా చూసుకోవాలని అన్నారు. జిల్లాల్లోనూ ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించాలని, స్థానికంగా ప్రజా ఉద్యమాలు చేయాలని ఆయన కోరారు. సమావేశంలో పాల్గొన్న నాయకులు స్పందిస్తూ రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తున్నదని, సభలు, సమావేశాలకు పోలీసులు అనుమతి ఇవ్వడం లేదని విమర్శించారు. దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలపై జరుగుతున్న దాడుల గురించి వారు ప్రస్తావించారు. ఆర్‌సి కుంతియా ప్రతిస్పందిస్తూ ఇటువంటి అంశాలపైనే ప్రజా పోరాటాలు చేయాలని, అవినీతిని ప్రజల్లో ఎండగట్టాలని సూచించారు.
వచ్చే నెలలోగా కమిటీలు
ఇలాఉండగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రసంగిస్తూ సెప్టెంబర్ 30వ తేదీలోగా పోలింగ్ బూత్ నుంచి డివిజన్ కమిటీలు పూర్తి చేయాలని జిల్లా అధ్యక్షులకు సూచించారు. జిల్లా, డివిజన్, మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకూ కో-ఆర్డినేటర్లను నియమించాలని ఆయన తెలిపారు. అలాగే రీసెర్చ్, అనాలిసిస్ వింగ్‌ను ఏర్పాటు చేయాలని, సాంస్కృతిక విభాగాన్ని కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. రాహుల్ గాంధీ సందేశ్ యాత్ర కార్యక్రమాలను అన్ని నియోజకవర్గ, మండల, డివిజన్ కేంద్రాల్లో నిర్వహించాలని, రాహుల్ ప్రసంగ పాఠాలను తెలుగులో అనువదించి ప్రజలకు పంచి పెట్టాలని, తెలంగాణ ప్రభుత్వంపై తీసిన ఛార్జిషీట్‌ను ప్రజలకు పంచి పెట్టాలని ఆయన సూచించారు. సామాజిక మాధ్యమాన్ని మరింత విస్తృతంగా ఉపయోగించుకోవాలని ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు.
పొద్దుపోయేంత వరకూ..
ఇలాఉండగా ఆర్‌సి కుంతియా పార్టీ ముఖ్య నాయకులతో విడివిడిగా సమావేశమై అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఒక్కొక్కరితో సమావేశం కావడం వల్ల రాత్రి బాగా పొద్దు పోయేంత వరకూ అభిప్రాయ సేకరణ జరిగింది. పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలని, పార్టీ కార్యవర్గాన్ని మార్చాలా?, ప్రస్తుత అధ్యక్షునిపై మీ అభిప్రాయం ఏమిటీ?, పార్టీలో గ్రూపు తగాదాలు ఉన్నాయా?, పార్టీ మారిన వారిని వెనక్కి తీసుకోవాలా? వద్దా? తదితర అంశాలపై అడిగి తెలుసుకున్నారు. కాగా ఎక్కువ మంది ఉత్తమ్‌కుమార్ రెడ్డినే ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకూ కొనసాగించాలని సూచించినట్లు సమాచారం. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా, మాజీ విప్ తూర్పు జయప్రకాశ్ రెడ్డి తదితరులు కుంతియాతో భేటీ అయ్యారు.

చిత్రం.. గాంధీభవన్‌లో ఆదివారం జరిగిన టి.పిసిసి కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి రామచంద్ర కుంతియా