తెలంగాణ

పత్తి సాగు విశ్వరూపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 13: పత్తి పంట బంపర్ దిగుబడి వస్తే రైతులు ఊరికే ఉంటారా? మద్దతు ధర లేకపోతే వీధి పోరాటాలకు దిగితే ఏమి చేయాలి? పత్తి కొనుగోలు కేంద్రాలు తగినన్ని లేకపోతే మిర్చి, పసుపు రైతుల మాదిరిగా పత్తి రైతు ఆందోళన దిగితే ఎలా? పత్తి పంటంటే తెలంగాణ రైతుకు ఎందుకింత విపరీతమైన మోజు? ఈ ప్రశ్నలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కుదిపేస్తున్నాయి. అందుకే ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొంది. వర్షాభావ పరిస్ధితుల్లో కూడా పత్తి పంట బతుకుతుంది. చీడపురుగుల బారినపడకుండా ఉంటే మంచి దిగుబడి ఇస్తుంది. రైతుల ఇంట్లో కనకవర్షం కురుస్తుంది. పత్తి పంటకు తగిన మద్దతుధర లేకపోయినా, కొనుగోలు కేంద్రాలు తెరవడంలో ప్రభుత్వం అలసత్వం వహించినా రైతు ఆగ్రహానికి ప్రభుత్వం లక్ష్యమవుతుంది. గతంలో తెలంగాణ రైతుల చేసిన పోరాటాలు, పత్తి రైతుల ఆత్మహత్యలు దేశాన్ని కుదిపేశాయి. ఈ ఏడాది తెలంగాణలో అన్ని జిల్లాల్లో పత్తి పంటను రైతులు పోటాపోటీగా వేశారు. ఇంతవరకు 34.42 లక్షల హెక్టార్లలో వివిధ పంటలను వేస్తే, ఇందులో 17.84 లక్షల హెక్టార్లలో పత్తిపంటనే రైతులు వేసినట్లు తెలంగాణ వ్యవసాయ శాఖ అధికారికంగా ప్రకటించింది.
ప్రత్యామ్నాయ పంటలకు సరైన గిట్టుబాటు ధరలు లభించకపోవడం, ఆశించిన స్ధాయిలో వర్షాలు లేకపోవడంతో రైతులు పత్తిపంటకు మొగ్గుచూపారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది పత్తి పంట సాగు విస్తీర్ణం 26.5 శాతం పెరిగింది. నిరుడు కందిపప్పు, మిరప, పసుపు ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కోసం తెలంగాణ రైతు రోడ్డెక్కిన విషయం విదితే. గత ఏడాది తృణ ధాన్యాలు, మొక్కజొన్న, సోయాబీన్‌కు పెద్దగా ఆశించిన ధర లభించలేదు. గత ఏడాది పత్తికి మంచి ధర లభించింది. దీంతో రైతులు పత్తిపంటకు ఆకర్షితులయ్యారు. మేలిరకం పత్తి క్వింటాల్ రూ.4320 ధరను కేంద్రం నిర్ణయించింది. ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో తీవ్రమైన కరవు వల్ల ఆశించిన స్ధాయిలో పత్తిపంటకు రైతులు వెళ్లలేదు. గత ఏడాది రాష్ట్రప్రభుత్వం అంతకు ముందు సంవత్సరాల్లో పత్తిరైతుల బాధలు, సంక్షోభాలను దృష్టిలో పెట్టుకుని 14.10 లక్షల హెక్టార్లకే పంటను పరిమితం చేసింది. గతంలో రాష్ట్రప్రభుత్వం పత్తిపంటపై దృష్టిని తగ్గించి ప్రత్యామ్నాయ పంటకు వెళ్లాలని ప్రచారం చేసింది. దీనివల్ల గత రెండేళ్లుగా పత్తి పంట సాగు తగ్గింది. మిర్చికి క్వింటాల్‌కు రూ.13వేల వరకు ధరకు పెరగడంతో రైతులు ఆ పంట వైపు విశేషంగా మొగ్గి ఆ తర్వాత దాని ధర ఫట్ మనడంతో మళ్లీ పత్తివైపుకు వచ్చారని రైతు సంఘాలంటున్నాయి. ఖమ్మం, వరంగల్ మార్కెట్లలో మిర్చి క్వింటాల్ రూ.2000కు దిగువకు పడిపోవడంతో జరిగిన పరిణామాలు అందరికీ తెలిసిందే. అందుకే ఈసారి ఫలానా పంట వేయాలని, వేయవద్దని ప్రభుత్వం చెప్పడం మానుకుంది.
పత్తి పంట దిగుబడి అక్టోబర్ నుంచి మార్కెట్‌లోకి వస్తుంది. రైతులకు సరిపడా ముందస్తు చర్యగా పత్తి కొనుగోలు కేంద్రాలను 150 వరకు ఏర్పాటు చేయాలని ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఆగస్టు నెలాఖరుకే పత్తి పంట కొనుగోలుకు సంబంధించి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. గత ఏడాది కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్రంలో 84 పత్తి సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసింది. 90 వరకు కేంద్రాలను ఏర్పాటుచేయాలని ముందుగా అనుకున్నారు. ఈ ఏడాది అదనంగా 66 వరకు కొత్తవి ఏర్పాటు చేయాలని రాష్ట్రం సిసిఐపై వత్తిడి తెచ్చింది. కాగా పత్తిపంట విస్తీర్ణం పెరగడంతో పప్పు ధాన్యల పంట విస్తీర్ణం 2.19 లక్షల హెక్టార్లు, సోయాబీన్, మొక్కజొన్న పంట విస్తీర్ణం 2.31 లక్షల హెక్టార్ల మేర తగ్గింది.
జిల్లాల వారీగా విశే్లషిస్తే ఆసిఫాబాద్ జిల్లాలో 61,539 వేల హెక్టార్లు, నిర్మల్‌లో 63380 వేల హెక్టార్లు, మంచిర్యాలలో 36,134 వేల హెక్టార్లు, ఆదిలాబాద్‌లో 1,40,069 హెక్టార్లు, సిరిసిల్లలో 47739 హెక్టార్లు, పెద్దపల్లిలో 39172, జగిత్యాలలో 39172 హెక్టార్లు, కరీంనగర్‌లో 54655 హెక్టార్లు, కొత్తగూడెంలో 58059 హెక్టార్లు, ఖమ్మంలో 1,08789 హెక్టార్లు, మహబూబాబాద్‌లో 47249 హెక్టార్లు, జనగాంలో 63032 హెక్టార్లు, జయశంకర్ జిల్లాలో 68378, వరంగల్ అర్బన్‌లో 38482, రూరల్‌లో 80807 హెక్టార్లు, యాదాదిలో 57527, సూర్యాపేటలో 50511, నల్లగొండలో 225955, గద్వాలలో 28688, వనపర్తిలో 4460, నాగర్‌కర్నూల్‌లో 113559 హెక్టార్లు, మహబూబ్‌నగర్‌లో 83472 హెక్టార్లు, సిద్ధిపేటలో 66875 హెక్టార్లు, సంగారెడ్డిలో 79391 హెక్టార్లు, మెదక్‌లో 9546 హెక్టార్లు, కామారెడ్డిలో 19912 హెక్టార్లు, నిజామాబాద్‌లో 956 హెక్టార్లు, వికారాబాద్‌లో 43521 హెక్టార్లు, రంగారెడ్డిలో 72275 హెక్టార్లలో పత్తిపంటను సాగు చేస్తున్నారు.