తెలంగాణ

కిటకిటలాడుతున్న 65వ నెంబర్ రహదారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌటుప్పల్, ఆగస్టు 13: హైదరాబాద్-విజయవాడ 65వ నెంబర్ జాతీయ రహదారిపై ఆదివారం ట్రాఫిక్ రద్దీ కొనసాగింది. తెల్లవారుజాము నుంచి ఉదయం 10.00 గంటల వరకు పంతంగి టోల్‌ప్లాజా వద్ద ట్రాఫిక్ జామైంది. కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. వరుసగా నాలుగు రోజులు ప్రభుత్వ సెలవులు రావడంతో శుక్రవారం నుంచి హైవేపై రద్దీ పెరిగింది. ప్రధానంగా ఆదివారం గ్రామాలలో బోనాల పండుగలు నిర్వహిస్తుండడంతో విజయవాడ వైపుకు వెళ్లే వాహనాల సంఖ్య పెరిగింది. దీంతో పంతంగి టోల్‌ప్లాజా వద్ద అదనపు టోల్‌గేట్లు ఏర్పాటు చేసినప్పటికీ ఉదయం తాకిడి పెరిగి ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. కిలోమీటర్ వరకు వాహనాలు బారులుతీరి కన్పించాయి. సుమారు గంట సేపు ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. టోల్‌గేట్ల వద్ద వేగం పెంచి, జిఎంఆర్ అధికారులు, సిబ్బంది ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. తిరుగు పయనంలో కూడా టోల్‌ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రయాణికలు విజ్ఞప్తి చేశారు.