తెలంగాణ

జనాన్ని మభ్యపెడుతున్నారు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరకాల, అగస్టు 13: ఎస్‌ఆర్‌ఎస్‌పి పునరుజ్జీవన పథకం ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఉపయోగపడదని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందరెడ్డి అన్నారు. ఆదివారం వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్‌ఆర్‌ఎస్‌పి పునరుజ్జీవన పథకం కేవలం కరీంనగర్ జిల్లాకే ఉపయోగపడుతుందని అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు సోయి లేదని వ్యాఖ్యానించారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ప్రజలను, రైతులను మభ్యపెట్టడానికి, ప్రజల్లో, రైతుల్లో కోల్పోతున్న నమ్మకాన్ని సొమ్ము చేసుకోవడానికి ఎస్‌ఆర్‌ఎస్‌పి పునరుజ్జీనం అంటూ పేర్కొనడం శోచనీయమన్నారు. మేడిగడ్డ నుండి కాళేశ్వరం నుండి మీడ్ మానేరు మీద మూడు చోట్ల ఆయకట్టు కట్టి రివర్స్‌లో తీసుకువస్తే, ఉమ్మడి వరంగల్ జిల్లాకు నీళ్లు రావని అన్నారు. ముందుగా లోయర్ మానేర్‌కు నీళ్లు రావాలని, కొత్తగా రిజర్వాయర్ చేపట్టితేనే వరంగల్ జిల్లాకు నీళ్లు వస్తాయని తెలిపారు.
కేంద్రం తెలంగాణకు ఎలాంటి సహకారం ఇస్తాలేదని చెబుతున్నారని, ఖాజీపేటలో వ్యాగన్ వర్క్ షాపు మంజూరు చేసి 160 ఎకరాల భూమి కేటాయించాలని కేంద్రం ప్రభుత్వం కోరితే కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 54 ఎకరాల భూమి ఇచ్చిందని, అది కూడా దేవాదాయ శాఖకు సంబంధించిందని తెలిపారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే 160 ఎకరాల భూమి కేంద్రానికి అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం సానుకూలంగా ఉండి సహకారం అందించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొద్దునిద్ర పోతోందని చెప్పారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నియోజకవర్గంలో 148 కిలోమీటర్ల వరకు రైల్‌లైన్ కేంద్రం మంజూరు చేస్తే ఇప్పటి వరకు కేవలం 28 కిలోమీటర్ల వరకు భూ సేకరణ చేశారని కేంద్రం నిధులు ఇస్తామని చెప్పారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరం 44 లక్షల ఎకరాలలో పత్తి సాగు చేస్తున్నారని చెప్పారు. అయితే పత్తి సాగు విస్తీర్ణం పెరిగిందని వార్తలు రావడంతో తాము మొదటగా స్పందించి బిజెపి రాష్ట్ర నాయకత్వం కేంద్ర జౌళి శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లామని, స్పందించిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మరో 54 సిసిఐ కేంద్రాలను మంజూరు చేసిందని చెప్పారు.
వరంగల్ రూరల్ జిల్లాలో ఏర్పాటు చేస్తున్న టెక్స్‌టైల్ పార్కు నిర్మాణ పనులను వాయిదాల మీద వాయిదాలు ఎందుకు వేస్తున్నారని ప్రశ్నించారు. టెక్స్‌టైల్ పార్క్‌కు కేంద్ర ప్రభుత్వం రూ. 1200 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. మరో 100 కోట్లు రాయితీ ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే జౌళి శాఖ మంత్రిని పిలవవలసిన బాధ్యత ప్రభుత్వంపైన ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఇస్తున్న కేసిఆర్ కిట్‌లో కేంద్ర ప్రభుత్వం వాటా ఉందని, అందులో కేంద్రం ఫొటో గాని, ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఫొటో గాని ఏర్పాటు చేయక పోవడం శోచనీయమన్నారు. ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ సంతోష్‌కుమార్, గుజ్జు సత్యనారాయణ, మేకల రాజవీరు, పాపయ్య, ఆర్‌పి జయంత్‌లాల్, దేవునూరి మేఘనాధ్, కానుగుల గోపి, యాట నరేష్, పల్లెబోయిన సురేష్, చీర్ల కిరణ్‌రెడ్డి, రత్నా శైలేందర్, చందుపట్ల రాజిరెడ్డి పాల్గొన్నారు.