తెలంగాణ

మళ్లీ డ్రగ్స్ కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 14: హైదరాబాద్‌లో మరో డ్రగ్స్ ముఠా పట్టుబడింది. గుట్టు చప్పుడు కాకుండా మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న ముఠాను టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. అరెస్టయిన వారిలో ఒక నైజీరియన్‌తోపాటు మరో ముగ్గురు ఉన్నారు. వారి వద్ద నుంచి భారీ ఎత్తున డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం రాచకొండ కమిషనర్ మహేశ్ ఎం భగవత్ నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. నిందితుల నుంచి రూ.10 లక్షలు విలువ చేసే మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్టు కమిషనర్ మహేశ్ ఎం భగవత్ వెల్లడించారు.
ఐదు గ్రాముల కొకైన్, 450 యాంపిటమైన్ పిల్స్, ఎండిఎంఎ 45 గ్రాములు, ఎల్‌ఎస్‌డీ 60 ప్యాకెట్లు, చంగా 35 గ్రాములు, హషాస్ 65 గ్రాములు, గంజాయి 60 గ్రాములు, ఒక పాస్‌పోర్ట్, ల్యాప్‌ట్యాప్, ఆరు మొబైల్స్‌తోపాటు రూ. 40 వేలు నగదు స్వాధీనం చేసుకున్నట్టు కమిషనర్ వెల్లడించారు. గతంలో ఎక్సైజ్ అధికారులు అరెస్టు చేసిన కెల్విన్, రాచకొండ పోలీసులు అరెస్టు చేసిన నైజీరియన్ ముఠాకు సంబంధమున్నట్టు ఆయన తెలిపారు.
ఆరుగురు కస్టమర్లకు డ్రగ్స్ సరఫరా చేస్తుండగా, నిందితులను అరెస్టు చేసినట్టు కమిషనర్ వెల్లడించారు. ఈ ముఠాకు కెల్విన్‌తోపాటు, విజయవాడకు చెందిన డ్రగ్స్ డాన్ సంగీత ముఠాతోనూ సంబధాలున్నట్టు గుర్తించామని తెలిపారు. నైజీరియన్‌కు చెందిన గాబ్రియెల్ 2014లో స్టూడెంట్ వీసాపై భారత్‌కు వచ్చాడని, నవ్యంత్, అంకిత్ పాండే, గణత్‌కుమార్‌లతో కలసి డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడని కమిషనర్ తెలిపారు. కాగా వీరి వద్ద నుంచి 50 మంది మహిళలు డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు, పలువురు సినీ సెలబ్రటీలకు కూడా డ్రగ్స్ అందించినట్టు తేలిందని కమిషనర్ మహేశ్ ఎం భగవత్ తెలిపారు. బంజారాహిల్స్, గచ్చిబౌలిలోని పలు పబ్‌లకు డ్రగ్స్ ముంబై, గోవా నుంచి రప్పించి సరఫరా చేస్తున్నట్టు గుర్తించినట్టు ఆయన తెలిపారు. అదేవిధంగా వీళ్లు ఆగస్టు 15న గోవాలో పెద్ద రేవ్ పార్టీకి ప్లాన్ చేసినట్టు తెలుస్తుందని, పరీక్షల నిమిత్తం వీరి రక్తం నమూనాలతోపాటు గోళ్లు, వెంట్రుకలు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్టు కమిషనర్ మహేశ్ ఎం భగవత్ తెలిపారు.
చిత్రం.. .. సోమవారం రాచకొండ కమిషనరేట్‌లో విలేఖరులకు డ్రగ్స్ సరఫరా ముఠా సభ్యుల వివరాలను వెల్లడిస్తున్న కమిషనర్ మహేశ్ ఎం భగత్. *స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలు