కృష్ణ

ఆక్వా రంగంలో వృద్ధి సాధించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: పర్యావరణం, వ్యవసాయ రంగానికి హాని లేకుండా ఆక్వా రంగంలో స్థిరమైన వృద్ధిని సాధించేలా మత్స్యశాఖ అన్ని చర్యలు చేపట్టాలని కలెక్టర్ బి లక్ష్మీకాంతం అన్నారు. నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆక్వాజోన్స్, నిషేధిత మందుల వాడకం, పెండింగ్ అనుమతులపై ప్రత్యేక జిల్లా స్థాయి కమిటీ సమావేశం కలెక్టర్ లక్ష్మీకాంతం అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆక్వారంగం ఉత్పత్తుల్లో మన జిల్లా రాష్ట్రంలోనే గణనీయ ప్రగతి సాధిస్తుందన్నారు. రెండేళ్లుగా జిల్లా నుండి రూ. 11 వేల కోట్ల ఉత్పత్తులను ఎగుమతి చేసి స్థూల జాతీయోత్పత్తిలో 18 శాతం పైగా వృద్ధిని సాధిస్తున్నామన్నారు. నిషేధిత మందుల వాడకాన్ని తగ్గించి పర్యావరణానికి, ఆరోగ్యానికి అనుకూల ఉత్పత్తి సాధించేలా రైతుల్లో అవగాహన కల్పించాలన్నారు. ప్రతి సంవత్సరం ఆక్వా రంగంలో 20 శాతం స్థిరమైన వృద్ధిని సాధించేలా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. జిల్లాలో నీటి లభ్యత, భూముల సారాన్ని ఆధారంగా పరిగణలోనికి తీసుకుని వ్యవసాయానికి పనికిరాని భూములు, పల్లపు భూములు, చౌడు భూములు, ఉప్పునీటి భూములను జోన్ల వారీగా గుర్తించి నివేదిక రూపొందించాలని, అనుకూలమైన మంచినీటి చెరువుల్లో చేపల పెంపకంతోపాటు పంటలు పండే వ్యవసాయ భూముల వివరాలతో కూడిన నివేదిక రూపొందించాలని జిల్లాస్థాయి కమిటీ సమావేశంలో కలెక్టర్ అధ్యక్షతన నిర్ణయం తీసుకోవడం జరిగింది. నివేదిక ఆధారంగా గుర్తించిన జోన్లలో ఆక్వా రంగానికి సంబంధించిన అనుమతులను తక్షణమే మంజూరుతో పాటు, ఆయా ప్రాంతాల్లో విద్యుత్, రహదార్లు వంటి అన్ని వౌలిక వసతులు ప్రభుత్వం కల్పిస్తుందని కలెక్టర్ వివరించారు. ప్రమాణాలకు మించి యాంటీబయోటిక్స్ ఎక్కువగా ఉపయోగించడంతో అంతర్జాతీయంగా ఎగుమతులలో ఉత్పత్తులను నిరాకరించే ప్రమాదం ఉన్నందున రైతులకు నిషేధిత మందుల వాడకంపై అవగాహన కల్పించాలన్నారు. తగిన మోతాదుల్లో యాంటిబయోటిక్స్ వాడే విధంగా తెలియపర్చాలన్నారు. ఆక్వా ఉత్పత్తుల నాణ్యతను నిర్ధారించే ప్రయోగశాలలు మరిన్ని పెంచవలసిన అవసరం ఉందని సూక్ష్మస్థాయిలో నాణ్యత ప్రమాణాలను నిర్థారించే పరికరాలను అందుబాటులో ఉంచాలని కలెక్టర్ అన్నారు. వ్యవసాయ భూములు, పర్యావరణానికి హానిలేకుండా స్థిరమైన వృద్ధి ఆక్వారంగంలో కొనసాగిస్తూ ఉత్పత్తులను పెంచడంతోపాటు స్థూల జాతీయోత్పత్తికి దోహదపడే విధంగా మత్స్యశాఖ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ ఆక్వారంగంలో మన జిల్లా గణనీయమైన ప్రగతి సాధిస్తున్నామన్నారు. అంతర్జాతీయ మార్కెట్, పర్యావరణంను దృష్టిలో ఉంచుకుని నిషేధిక మందుల వాడకంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. దీనిపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని జాయింట్ కలెక్టర్ అన్నారు. సమావేశంలో డిఆర్‌వో ఎం వేణుగోపాలరెడ్డి, మత్స్యశాఖ జెడి యాకూబ్ బాషా, డిప్యూటీ డైరెక్టర్ శ్రీహరి, అసిస్టెంట్ డైరెక్టర్ పి సురేష్, స్టేట్ ఫిషరీస్ ఎడ్వైజరీ ఎం సీతారామరాజు, ఆక్వా రైతు సత్యనారాయణ, పర్యావరణ వేత్త పద్మశ్రీ జి నరసింహరావుతదితరులు పాల్గొన్నారు.