కృష్ణ

అబ్బురపరిచిన అక్టోపస్ విన్యాసాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం): మంగళగిరిలో ఏపి పోలీసు ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆక్టోపస్ దళాలు ప్రదర్శించిన విన్యాసాలు, సాహసోపేతమైన కార్యక్రమాలు, ఆయుధ ప్రదర్శన అబ్బురపరిచాయి. ముఖ్యమంత్రి సైతం ఆశ్చర్యం వెలిబుచ్చి ఆక్టోపస్ దళాలకు కితాబిచ్చారు. మంగళగిరి ఆరో బెటాలియన్ వద్ద నిర్మించిన డిజిపి కార్యాలయాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆక్టోపస్ అధినేత, గ్రేహౌండ్స్ అదనపు డిజి ఎన్‌వి సురేంద్రబాబు నేతృత్వంలో ఇక్కడ ఏర్పాటు చేసిన ఆయుధ ప్రదర్శనను ముఖ్యమంత్రి, డిజిపి సాంబశివరావు, ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు తిలకించారు. యుఎస్‌ఏ నుంచి దిగుమతి చేసుకున్న కోల్ట్, ఆస్ట్రియాకు చెందిన గ్లోక్, ఇజ్రాయేల్‌కు చెందిన సిఎస్‌ఎం, డోగో, జర్మనీకి చెందిన ఏంపి-5 ఎస్‌డి, నార్వేకు చెందిన బ్లాక్ హార్‌నెట్ బల్గేరియాకు చెందిన ఏకే-47, ఇటలీకి చెందిన స్పాస్ వంటి ఆయుధాలను ఇక్కడ ప్రదర్శించగా వీటి గూర్చి సురేంద్రబాబు ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం అక్టోపస్ బృందం వివిధ విన్యాసాలను అత్యంత ధైర్య సాహసాలతో కూడిన నిర్వహించారు. భవనంపై నుంచి సిబ్బంది కిందకు దూకడం, గోడల మీదుగా జారడ వంటి ప్రయోగాలు ఆశ్చర్యాన్నిగొలిపాయి. శత్రువులను, ఉగ్రవాదులను దీటుగా ఎదుర్కొనేందుకు పోలీసులు ప్రదర్శించిన విన్యాసాలు అబ్బురపరచడంతోపాటు ఎంతో కఠినతరంగా ఉన్నాయని సీఎం అభివర్ణించారు. అక్టోపస్ విన్యాసాల్లో భాగంగా అబ్‌సెల్లింగ్, వాల్‌డ్రాప్, స్పైడర్ టెక్నిక్, పవర్ క్విక్ అసెండర్స్, స్పీడ్ ర్యాప్‌లింగ్, బ్లాక్‌హార్‌నెట్, బంగీజంప్, డోగో వంటి విన్యాసాలు ఆకట్టుకున్నాయి. అత్యాధునిక పరిజ్ఞానంతో కూడిన తేలికైన పరికరంతో 1.6 కిలోమీటర్ల పరిథిలో జరిగే సంఘటనలను చిత్రీకరించే డ్రోన్ పరికరం అందుబాటులోకి తీసుకురావడం పట్ల ముఖ్యమంత్రి ఉన్నతాధికారులను అభినందించారు. వీరందరికీ ప్రత్యేకంగా ఆయన సర్ట్ఫికెట్‌లు ప్రదానం చేశారు.