కృష్ణ

గ్రామ, మండల ప్రత్యేకాధికారులకు పల్లె నిద్ర తప్పనిసరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ప్రత్యేకాధికారులందరూ తప్పనిసరిగా పల్లె నిద్ర చేయాలని కలెక్టర్ బి లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ తన క్యాంపు కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్లు, మండల స్థాయి అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రతి అధికారి తప్పనిసరిగా పల్లెనిద్ర చేయాలన్నారు. ముఖ్యంగా గ్రామాల్లో అమలు జరుగుతున్న ప్రజాపంపిణీ, పింఛన్లు, గృహ నిర్మాణం, మరుగుదొడ్లు, ఉపాధి హామీ పనులు, పారిశుద్ధ్యం, విద్యుత్, ఇసుక రీచ్ల నిర్వహణ, ఆటస్థలాలు, స్మశానవాటికలు, మొక్కలునాటే కార్యక్రమం తదితర ఫిర్యాదులను చర్చించాలన్నారు. జిల్లాలో సాగునీటిని చివరి ఆయకట్టు భూములకు వెళ్లే విధంగా రెవెన్యూ, ఇరిగేషన్, పోలీసు, వ్యవసాయశాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. నిర్దేశించిన లక్ష్యాలను 20నాటికి పూర్తి చేయాలని వ్యవసాయశాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో కౌలు రైతులకు రూ. 400 కోట్లు రుణాలు మంజూరు చేయవలసి ఉండగా ఇప్పటికీ కేవలం రూ. 80 కోట్లు మాత్రమే మంజూరు చేయడం జరిగిందన్నారు. ఆధార్ అధారిత ఎరువుల విధానంలో పంపిణీ చేయని డీలర్లను తక్షణం రద్దు చేయాలని ఆయన వ్యవసాయాధికారులకు ఆదేశించారు. ఇసుక రీచ్‌ల నుండి ఇసుక రవాణాలో ప్రభుత్వపరంగా చేస్తున్న విధానాన్ని ప్రజల్లో విస్తృత ప్రచారం జరిగే విధంగా అధికారులు చొరవ చూపాలన్నారు. ఇసుక ట్రాక్టర్ ద్వారా విజయవాడ పరిసర ప్రాంతాల్లో రూ.1000లు మాత్రమే ఉండాలని, బందరు లాంటి ప్రాంతాల్లో రూ.15 వందల అంతకంటే మించి ఉండరాదన్నారు. అదే విధంగా జిల్లాలో బెల్ట్ షాపులు పూర్తిగా నిషేధించడం జరిగిందన్నారు. ఉపాధి హామీ పథకం కింద 93 వేల కూలీలతో జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉందన్నారు. అదే విధంగా పంట సంజీవని, ఇన్టిస్ట్యూషన్, హోమ్ స్టీడ్, అవెన్యూ, బ్లాక్, బ్లండ్ ప్లానిటేషన్‌లో జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉందన్నారు. ఉపాధి హామీ కూలీలకు చెల్లించే కనీస వేతనం రూ. 150 ఉండాలని నిర్దేశించిన సమయానికి వేతనం చెల్లించాలన్నారు. నీరు - ప్రగతిలో భాగంగా పూడికతీతలు, గొలుసుకట్టు చెరువులు, చెక్ డ్యాం నిర్మాణంలో జిల్లా ప్రగతిపథంలో ఉందన్నారు. చంద్రన్న బీమా కింద జిల్లాలో 210 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని వీటిని సంబంధిత ఎంపిడిఓలు తక్షణణ పరిష్కరించాలన్నారు. జిల్లాలో తట్టు, రూబెల్లా వ్యాక్సి ప్రక్రియ నిరాశజనకంగా ఉందని దీనిని వేగవంతంగా చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి 25 ఎకరాలు చిన్న పరిశ్రమలు స్థాపనకు భూసేకరణ చేయాలని తహశీల్దార్లకు, ఆర్డీవోలకు ఆదేశించారు. జిల్లాలో ఇప్పటికే 755 గ్రామాలు ఓడిఎఫ్‌గా ప్రకటించడం జరిగిదని వీటిలో 6 మండలాలు పూర్తిగా ఓడిఎఫ్ మండలాలుగా ప్రకటించడం జరిగిందని ఆగస్టు 30 నాటికి ప్రకటించనున్నామన్నారు. ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలో న్యూట్రిగార్డెన్స్ ప్రారంభించాలన్నారు. జిల్లాలో ఉల్లి ధరలను నిరంతరం పర్యవేక్షించి, కల్తీ ఆహారం, తూనికలు కొలతలు, పెట్రోలు బంకులు, చొకధరల దుకాణాలు, సినిమాహాల్స్‌పై ఆర్డివోలు నిరంతరం పర్యవేక్షిస్తుండాలని కలెక్టర్ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు.