రాష్ట్రీయం

పనులు చేపట్టక పోతే రద్దే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఐటి కంపెనీలను ఏర్పాటు చేసేందుకు భూములు తీసుకుని, ఏళ్లు గడుస్తున్నా, ఇంకా ప్రారంభించని వాటి భూ కేటాయింపులు రద్దు చేయాలని ఎపిఐఐసి అధికారులను రాష్ట్ర ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో ఎపిఐఐసి అధికారులతో ఆయన బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన లోకేష్ ‘ఇలాంటి సంస్థల భూములను స్వాధీనం చేసుకోవాల్సిందే’నని స్పష్టం చేశారు. తిరుపతిలో ఎలక్ట్రానిక్ మ్యానుఫాక్చరింగ్ క్లస్టర్-2 కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం లభించిందని,త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. అనంతపురంలో నిర్మిస్తున్న ఇంక్యుబేషన్ సెంటర్, తిరుపతిలో నిర్మిస్తున్న ఐటి బిజినెస్ సెంటర్, విశాఖలో నిర్మిస్తున్న మిలీనియం టవర్స్ పనులు వేగవంతం చేయాలన్నారు. కాపులుప్పాడ ఐటి టౌన్‌షిప్, మంగళగిరి ఐటి స్పేస్‌లో వౌలిక వసతులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అంతకుముందు ఎపి ఇన్నోవేటివ్ సొసైటీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆ సందర్భంగా మాట్లాడిన ఆయన స్మార్ట్ సిటీ ఇన్నోవేషన్ ల్యాబ్, ఇంక్యుబేషన్ సెంటర్, డ్రోన్ ఇంక్యుబేషన్ సెంటర్ త్వరగా కార్యరూపం దాల్చేలా చూడాలన్నారు. ఇంక్యుబేషన్ సెంటర్ల ద్వారా స్టార్ట్ అప్ కంపెనీలు గ్లోబల్ లీడర్లుగా ఎదిగేందుకు అవసరమైన ప్రోత్సాహం అందించాలన్నారు. వారికి కావాల్సిన ఆఫీస్ స్పేస్, ప్రొడక్షన్ స్పేస్, ఇతర సౌకర్యాలు కల్పించాలన్నారు. ఎపి ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీ ఏజన్సీ, ఎపి నాన్‌రెసిడెంట్ తెలుగు సొసైటీ అధికారులతో కూడా సమావేశమయ్యారు. ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకూ 7100 మందికి ఉద్యోగాలు లభించాయని, 1982 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు వచ్చాయని మంత్రికి అధికారులు వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన వివిధ సంస్థల ప్రగతిని సమీక్షించిన ఆయన, పనుల్లో పురోగతిపై ప్రతివారం నివేదిక అందచేయాలన్నారు. విశాఖలో ఏర్పాటు కానున్న ఫిన్‌టెక్ వ్యాలీని త్వరగా పూర్తి చేయాలని, గ్లోబల్ లీడర్లుగా ఉన్న కంపెనీలను పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఐటి శాఖ కార్యదర్శి విజయానంద్, ఎపిఐఐసి ఎంపి బాబు, ఎపిఎన్‌ఆర్‌టి చైర్మన్ వేమూరి రవి, తదితరులు పాల్గొన్నారు.
చిత్రం.. అధికారులతో సమీక్షిస్తున్న మంత్రి లోకేశ్