రాష్ట్రీయం

ఎలా గట్టెక్కాలి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలపై నెలకొన్న ప్రతిష్టంభనపై ఏం చేయాలో ప్రభు త్వం తేల్చుకోలేక సతమతమవుతోంది. ఇప్పటి వరకు ఇచ్చిన నోటిఫికేషన్లపై ఏదో కారణంతో కేసులు పడటంతో ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. నోటిఫికేషన్ ఇచ్చే ముందు దాని వల్ల న్యాయపరంగా వచ్చే చిక్కులు ఏమిటన్నది బేరీజు వేసుకోకుండా జారీ చేసేయ టం.. ఆ తరువాత కోర్టు స్టేలతో, విపక్షాల ఆందోళనలతో రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతిష్ఠ మసకబారుతోంది. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కడానికి ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన బుధవారం నాడు సచివాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశం సుదీర్ఘంగా చర్చించినప్పటికీ ఎలాంటి నిర్ణయానికి రాలేకపోయారు. ఒకటి, రెండు అంశాలపై విస్తృతంగా చర్చించిన సమావేశం న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా చూసేందుకు న్యాయశాఖ సలహా తీసుకోవాలని భావించింది. ప్రధానంగా రిక్రూట్‌మెంట్‌ను పాత జిల్లాల వారీగా నిర్వహించాలా? కొత్త జిల్లాల వారీగా నిర్వహించాలా అన్న అంశంపై ఏమీ తేలలేదు. ఏ రకంగా వెళ్తే ఎలాంటి సమస్యలు వస్తాయన్న దానిపైనా లోతుగా చర్చించినప్పటికీ, ఎలాంటి తుది నిర్ణయానికి రాలేకపోయారు. దీంతో 21న మళ్లీ సమావేశం కావాలని నిర్ణయించారు. ముఖ్యంగా ఖాళీల గుర్తింపు, రోస్టర్ విధానం, విద్యార్హతలకు సంబంధించే కోర్టుల్లో ఎక్కువగా కేసులు దాఖలు అవుతున్నాయి. ఈ మూడు అంశాలపై స్పష్టమైన వైఖరిని అలవంబిస్తే తప్ప న్యాయ వివాదాలు పరిష్కరించటం సాధ్యం కాదన్నది సమీక్షా సమావేశంలో ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు. దీంతో న్యాయపరమైన అడ్డంకులు ఏవీ రాకుండా నోటిఫికేషన్లు జారీ చేసి వెనువెంటనే నియామకాల ప్రక్రియ పూర్తయ్యేలా కార్యాచరణ రూపొందించాలని ఉపముఖ్యమంత్రి సర్వీసు కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణికి సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్పీ సింగ్, విద్యాశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణ, సాధారణ పరిపాలనా విభాగం ముఖ్యకార్యదర్శి అదర్‌సిన్హా, టిఎస్‌పిఎస్‌సి మెంబర్ సెక్రటరీ వాణి ప్రసాద్, న్యాయశాఖ కార్యదర్శి నిరంజన్ రావుపాల్గొన్నారు.
ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఉన్న లక్షకుపైగా ఖాళీలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఖాళీల భర్తీకి న్యాయపరమైన చిక్కులు పెద్ద సమస్యగా పరిణమించింది. ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగాక కానీ న్యాయపరమైన ఇబ్బందులు ఎదురుకాకుండా టిఎస్‌పిఎస్సీ ద్వారా వెంటనే నోటిఫికేషన్లు జారీ చేయడానికి మార్గదర్శకాలను రూపొందించాలని నిర్ణయించారు.
శాఖల వారీగా కార్యాచరణ: కెసిఆర్ ఆదేశం
రాష్ట్రంలో కొత్తగా 84వేలకు పైగా ఉద్యోగ నియామకాలు చేపట్టాల్సి ఉన్నందున శాఖల వారీగా కార్యాచరణ రూపొందించుకుని అమలు చేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. పబ్లిక్ సర్వీసు కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి నేతృత్వంలోని అధికారులు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కనీసం వారానికోసారి సమావేశమై ఉద్యోగ నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లోను, గురుకుల విద్యా సంస్థల్లో వేల మంది ఉపాధ్యాయుల న ఇయామకం జరపాల్సి ఉన్నందున దానికి సంబంధించి వెంటనే ప్రణాళికను రూపొందించాలన్నారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఖాళీలను భర్తీ చేయడం, కొత్త ఉద్యోగాల నియామకం ప్రక్రియను చేపట్టాలన్నారు. నోటిఫికేషన్లకు ముందే న్యాయ శాఖ అధికారులతో చర్చించాలని, ప్రభుత్వం ఏ పని చేపట్టినా వాటిని అడ్డుకునేందుకు కొన్ని శక్తులు కాచుకుని కూర్చున్నాయన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ ఘంటా చక్రపాణి ఇంతవరకు ఐదు వేల మందిని నియమించామని, మరో 12వేల ఉద్యోగాల భర్తీకి నెల రోజుల వ్యవధిలో నోటిఫికేషన్లు జారీ చేస్తామన్నారు. కమిషన్‌లో పనిభారం పెరిగినందు వల్ల అదనంగా 90 మంది ఉద్యోగులను నియమించేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారు.
టీచర్లకు ప్రగతి సూచికలు
జవదేకర్‌తో కడియం
రానున్న రోజుల్లో టీచర్ల పనితీరుకు ప్రగతి సూచికలు నిర్ధారించాలని కేంద్రం యోచిస్తోంది. ఈ అంశంపై కేంద్ర మానవ వనరుల మంత్రి ప్రకాష్ జవదేకర్ వివిధ రాష్ట్రాల విద్యామంత్రుల అభిప్రాయాలను వీడియోకాన్ఫరెన్సింగ్ ద్వారా తెలుసుకున్నారు. ప్రధానంగా లెర్నింగ్ అవుట్‌కమ్, అనర్హ ఉపాధ్యాయుల శిక్షణ, బిఇడి, ఎంఇడి కాలేజీల సమస్యలపైనా ఈ వీడియోకాన్ఫరెన్స్ జరిగింది.
చిత్రం.. బుధవారం సచివాలయంలో జరిగిన ఉన్నతస్థాయ సమీక్షలో కడియం శ్రీహరి