ఆంధ్రప్రదేశ్‌

ఇక సెర్ప్ ద్వారా ‘దుల్హన్’ చెల్లింపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: దుల్హన్ పథకం ద్వారా ముస్లిం మైనార్టీ యువతులకు వివాహ సందర్భంగా ప్రభుత్వం నుంచి చెల్లిస్తున్న ప్రోత్సాహక మొత్తం ఇక నుంచి ‘సెర్ప్’ ద్వారా చెల్లించడానికి నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత వెల్లడించారు. బుధవారం ఆమె స్థానిక ఎన్టీఆర్ పరిపాలనా భవన సముదాయంలోని సెర్ప్ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించి అమలులో ఉన్న పలు పథకాల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ఉండే పలు సమస్యల కారణంగా వివాహ సమయానికి ఈ ప్రోత్సాహకాలు చెల్లింపులు సక్రమంగా యువతులకు చేరడం లేదనే విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందని అన్నారు. అయితే ఇటీవల కాలంలో సెర్ప్ క్షేత్ర సిబ్బంది పలు ఇతర శాఖలకు సర్వీసులు, సర్వేలు నిర్వహిస్తున్న నేపథ్యంలో దుల్హన్ చెల్లింపులు వీరికి అప్పగించడం ద్వారా ఈ పథక లక్ష్యం విజయవంతమవుతుందని ప్రభుత్వం భావిస్తున్నదని మంత్రి అన్నారు. అందుకుగాను ప్రతి గ్రామంలోను కనీస విద్యా పరిజ్ఞానం వున్న ముస్లిం స్ర్తిలు ఒక్కరిద్దరైనా డ్వాక్రా గ్రూపుల్లో ఉండే విధంగా తొలుత ప్రయోగాత్మగా సెర్ప్ దీన్ని చేపట్టనుందని మంత్రి వివరించారు. కాగా పేద లబ్ధిదారులకు చంద్రన్న బీమా చెల్లింపులు.. మరణించిన వ్యక్తి దశకర్మ రోజున నామినీకి చెల్లించడానికి అవసరమైన విధి విధానాలు పూర్తి అయ్యాయని మంత్రి వెల్లడించారు. చనిపోయిన వెంటనే బీమా మిత్ర రూ. 5 వేలు అత్యక్రియుల నిమిత్తం చెల్లించి, కుటుంబ సభ్యుల నుంచి అవసరమైన బీమా పేపర్లు సేకరిస్తారని, వాటిని పరిశీలనకు ఇన్సూరెన్స్ కంపెనీకి పంపి, చనిపోయిన వ్యక్తి కుటుంబ సంప్రదాయ ప్రకారం ‘దినం’ రోజు ఇన్సూరెన్స్ మొత్తం చెల్లింపు ఉత్తర్వు నామినీకి అందజేస్తారు. మరుసటి రోజు ఆ మొత్తం వారి బ్యాంక్ ఖాతాకు జమ అవుతుందని మంత్రి వివరించారు. చంద్రన్న బీమా కాల్ సెంటర్‌కు చనిపోయిన వ్యక్తి ‘దిన’ సంప్రదాయ వివరాలు ముందుగా అందుతాయని, వాటిని అనుసరించి ‘సెర్ప్’ ప్రతినిధిగా పని చేస్తున్న బీమా మిత్ర స్థానిక జన్మభూమి కమిటీ సభ్యుల సమన్వయంతో ప్రభుత్వం తరపున ఆ కుటుంబానికి సంతాపం తెలియజేసి, బీమా మొత్తం చెల్లింపు ప్రక్రియను పూర్తి చేస్తారని తెలిపారు. అలాగే సహజ లేదా ప్రమాద మరణాల ధృవీకరణ ప్రక్రియను కూడా సరళీకరించినట్లు మంత్రి తెలిపారు. ఇప్పుడు కుటుంబ సభ్యులు డెత్ సర్ట్ఫికెట్ కోసం దరఖాస్తు చేయనక్కరలేదని వ్యక్తి చనిపోయిన విషయం కాల్ సెంటర్‌కు తెలియజేయిస్తే చాలని, పంచాయతీ, పోలీసు, ప్రభుత్వాసుపత్రి అన్ని స్థాయిల్లో పరిశీలనా ప్రక్రియ పూర్తి చేసి 15 రోజుల్లో జారీ చేసే విధంగా ప్రభుత్వ స్థాయిలో చర్యలు తీసుకున్నట్టు మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా సెర్ప్ కార్యకలాపాలు గురించి సంస్థ సిఈఓ డా పి కృష్ణమోహన్ మంత్రికి వివరించారు.