కృష్ణ

పాములలంకలో ఇంటింటా విషజ్వరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు: మండలంలోని పాములలంక గ్రామంలో విషజ్వరాలు ఇంటింటికి వ్యాపించాయి. ప్రతి ఇంటికి ఇద్దరు, ముగ్గురు విషజ్వరం వళ్ళునొప్పులు, దగ్గు, జలుబుతో బాధపడుతున్నారు. జ్వరాలు అదుపు చేయటంలో అధికారులు విఫలమయ్యారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 13న సాక్షాత్తూ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి టివిఎస్‌ఎన్ శాస్ర్తీ పాములలంక వచ్చి ఇక్కడే ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేస్తామని హామి ఇచ్చారని, కాని సబ్‌సెంటర్‌లో ఒక్కరోజు ప్రత్యేక వైద్య శిబిరం పెట్టి, అవసరమైతే తోట్లవల్లూరు పీహెచ్‌సీకి వెళ్ళామని ఎఎన్‌ఎంలు చెపుతున్నారని జ్వరం బాధితులు వాపోతున్నారు. వళ్ళునొప్పులు, జ్వరంతో నీరసంగా ఉంటే తోట్లవల్లూరు పీహెచ్‌సీకి వెళ్ళాలేక పోతున్నామని జ్వరం బాధితులు చెపుతున్నారు. ఎనిమిది రోజుల క్రితం మొదలైన జ్వరాలు తగ్గుముఖం పట్టకపోగా ఇంటింటికి వ్యాపించాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఆరోగ్య ఉపకేంద్రంలో ఇద్దరు ఎఎన్‌ఎంలను పెట్టి పారాసెట్మాల్ బిళ్ళలు ఇస్తున్నారని, ఇంజెక్షన్‌లు, సెలైన్ సౌకర్యం లేదని బాధితులు మండిపడుతున్నారు. పాములలంకలో జ్వరం బాధితులను పలకరిస్తే వారి బాధలు వర్ణనాతీతం. ఐదు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నానని, ఒక రోజు ఆటోలో తోట్లవల్లూరు పీహెచ్‌సీకి వెళ్ళితే సెలైన్ పెట్టారని, మళ్లీ వెళ్ళలేకపోతున్నానని, నడవటమే కష్టంగా ఉందని గ్రామంలోని ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్ ఉండి వైద్య సేవలు అందించాలని పిల్లి శారమ్మ కోరుతోంది. పాములలంకలో ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి జ్వరాలు సుడిగాలిలా వచ్చాయని ఇక్కడే వైద్య సౌకర్యం కల్పించాలని సోలే చింతయ్య కోరారు. 13 రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నానని, రెండు రోజులు మాత్రమే తోట్లవల్లూరు పీహెచ్‌సీకి వెళ్ళగలిగానని, ఇక తనవల్ల కాదని మాతంగి ఏసమ్మ వాపోయింది.
ఇలావుండగా రవాణా సౌకర్యం లేని ఎస్సీ గ్రామమైన పాములలంకలో ప్రత్యేక వైద్య శిబిరం ఎందుకు పెట్టడం లేదని, అందరు పేదలు, పదిమందో ఇరవై మందో అయితే తోట్లవల్లూరు రావచ్చేమోగానీ ఊర్లో చాలామంది జ్వరంతో బాధపడుతుంటే తోట్లవల్లూరు రావాలని చెప్పటం దారుణమని వార్డు సభ్యురాలు చింతగుంట రత్నకమల అన్నారు. గ్రామంలో ఎవరికైనా ఎదైనా జరిగితేకాని అధికారులు స్పదించారా అంటు ఆమె ప్రశిస్తున్నారు.
వైద్య సేవలు అందించటంలో విఫలం: సర్పంచ్ పాముల శ్రీనివాసరావు
పాములలంక ప్రజలకు వైద్య సేవలు అందించటంలో వైద్యాధికారులు విఫలమయ్యారు. పంచాయతీ తరపున అన్ని జాగ్రత్తలు చేపట్టినా జ్వరాలు ఆగలేదు. ఊరంతా చుట్టుముట్టాయి. డిఎంఅండ్‌హెచ్‌ఓ శాస్ర్తీ వచ్చి ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పినా డాక్టర్లు ఒక రోజు మాత్రమే వచ్చి సరిపెట్టారు. పరిశుభ్రమైన వాతావరణంలో ఉండే పాములలంకలో గతంలో ఎప్పుడు ఇంత స్థాయిలో జ్వరాలు ప్రబలలేదు. ఇప్పటికైనా ప్రత్యేక వైద్య శిబిరం పాటు, రక్త పరీక్షలు కూడా పెట్టి మెరుగైన వైద్యం అందించాలని సర్పంచ్ శ్రీనివాసరావు కోరారు. ఈ విషయాలపై డాక్టర్ గోపాలనాయక్‌ని వివరణ కోరగా పాములలంక గ్రామంలో రెండు రోజులు ప్రత్యేక వైద్యశిబిరం నిర్వహించామని, తోట్లవల్లూరు పిహెచ్‌సీటి ఇతర గ్రామాల నుంచి ఓపి రోగుల రాక విపరీతంగా పెరిగిపోయింది. 140 నుంచి 160 మంది రోగులు వివిధ సమస్యలపై వస్తుండటంతో పీహెచ్‌సీలో ఉండాల్సి వస్తోంది. స్ట్ఫా అంతా కూడా ఎక్కువ వ్యాక్సిన్ క్యాంపులో ఉన్నారని, అందువల్ల తోట్లవల్లూరు పీహెచ్‌సీకి రోగులను రమ్మని చెప్పాం. తాము పాములలంకలో ఉంటే మిగతా గ్రామాల రోగులకు ఇబ్బంది ఏర్పడుతుందని తెలిపారు.

ఈక్రాప్ అమలులో రాష్ట్రంలో కృష్ణా ఫస్ట్

మైలవరం: ఈక్రాప్ అమలులో రాష్ట్రంలో కృష్ణా జిల్లా ప్రధమస్థానంలో ఉందని వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ యు నరశింహారావు వెల్లడించారు. గురువారం ఆయన స్థానిక ఏడీఏ కార్యాలయంలో విత్తనాలు, ఎరువుల డీలర్లతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈక్రాప్ అమలులో 98.7శాతం నమోదు చేసి జిల్లా ప్రథమస్థానంలో నిలిచినట్లు తెలిపారు. అదేవిధంగా పంటలు 3.30 లక్షల హెక్టార్లలోవేయాల్సి ఉండగా 2.66 లక్షల హెక్టార్లలో పంటలు వేసినట్లు తెలిపారు. ఇందులో వరి 2.15 లక్షల హెక్టార్లలో, పత్తి 42వేల హెక్టార్లలోవేసినట్లు తెలిపారు. సూక్ష్మపోషక పదార్థాలు 2,252 మెట్రిక్ టన్నులు పంపిణీ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకూ 2,365 మెట్రిక్ టన్నులు పంపిణీ చేసినట్లు తెలిపారు. 10,199 టన్నుల వరి విత్తనాలను సబ్సీడీపై అందించామన్నారు. పచ్చిరొట్ట విత్తనాలు 14,661 క్వింటాళ్ళు సరఫరా చేయాల్సి ఉండగా నూరు శాతం పూర్తి చేసినట్లు తెలిపారు. పంట రుణాల కింద 4,631 కోట్ల రూపాయలు ఇవ్వాలనేది లక్ష్యం కాగా ఇప్పటివరకూ 3,489 కోట్ల రూపాయలు ఇప్పించటం జరిగిందన్నారు. కౌలు రైతులు 32,391 మందికి రుణ అర్హత కార్డులు అందించామని, సాగుధ్రువీకరణ పత్రాలు 51,635 మందికి ఇవ్వటం జరిగిందన్నారు. కౌలు రైతులకు 84కోట్ల రుణాలు ఇప్పించటం జరిగిందన్నారు. ప్రస్తుత ఖరీఫ్‌లో జిల్లాలో 315760 మెట్రిక్ టన్నుల ఎరువులు ఇప్పటి వరకూ సరఫరా చేయటం జరిగిందని, 70264 మెట్రిక్ టన్నుల లక్ష్యంగా చెప్పారు. రైతురధాల కోసం ఇప్పటి వరకూ 110 దరఖాస్తులు అందాయని, జిల్లాకు 520 మంజూరైనట్లు తెలిపారు. డీలర్లు ఈఫోస్ యంత్రాల ద్వారానే ఎరువులను రైతులకు అందించాలని దాని వల్లనే సబ్సీడి వస్తుందని సూచించారు. ఈకార్యక్రమంలో ఏడీఏ కెనడీ, వ్యవసాయాధికారులు పాల్గొన్నారు.

నాగాయలంకలో భారీ వర్షం
నాగాయలంక: వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా గురువారం నాగాయలంకలో భారీ వర్షం కురిసింది. సాయం సంధ్యా సమయంలో ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా నాగాయలంక వీధులన్నీ జలమయమయ్యాయి. జన జీవనం స్తంభించింది. భారీ వర్షానికి రైతులు హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

ఆర్‌ఐఓ కార్యాలయ ఉద్యోగిని నాగమణికి ప్రశంసా పత్రం అందజేత
మచిలీపట్నం (కల్చరల్): ఇంటర్మీడియట్ బోర్డు విజయవాడ రీజనల్ కార్యాలయంలో జూనియర్ లెక్చరర్‌గా పని చేస్తూ ఉత్తమ సేవలు అందించిన కె నాగమణి గురువారం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ, జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆమె ఈ ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. కలెక్టర్ మీటింగ్ హాలులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె జెడ్పీ చైర్‌పర్సన్ అనూరాధ, జెసి చంద్రుడు చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారు.

జిల్లాలో అంత్యోదయ పథకం కింద 194 గ్రామాలు ఎంపిక
* జెడ్పీ సిఇఓ ఎన్‌వివి సత్యనారాయణ
బంటుమిల్లి: కేంద్ర ప్రభుత్వ పథకమైన మిషన్ అంత్యోదయ పథకం కింద జిల్లాలోని 194 గ్రామాలను ఎంపిక చేయనున్నట్లు జిల్లా పరిషత్ ముఖ్య కార్య నిర్వహణాధికారి ఎన్‌వివి సత్యనారాయణ తెలిపారు. గురువారం కృత్తివెన్ను మండలం చినగొల్లపాలెం గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమానికి వెళుతూ బంటుమిల్లి మండల పరిషత్ కార్యాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా సిఇఓ సత్యనారాయణ మాట్లాడుతూ అంత్యోదయ గ్రామాలను ఆయా మండలాల్లోని ఎంపిడివోలు, ఇఓపిఆర్‌డిలు ఎంపిక చేస్తారన్నారు. ఈగ్రామాల్లో సిసి రోడ్లు, పారిశుద్ధ్యం, వ్యక్తిగత మరుగుదొడ్లకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. మీకోసం, జన్మభూమి అర్జీలపై రెండు రోజుల పాటు విచారణ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉపాధి హామీ పథకం అమలులో ఎంపిడివో పాత్ర ఎంతో కీలకంగా ఉంటుందన్నారు. మండల స్థాయిలో కూడా ఈ-ఆఫీస్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. అంత్యోదయ పథకం కింద ఎంపికైన గ్రామాల్లోని ఆయా కుటుంబాలకు నెలకు రూ.10వేలు ఆదాయం వచ్చేలా వనరులు చూపించడం జరుగుతుందన్నారు. శ్మశాన వాటికల అభివృద్ధికి రూ.8లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. బంటుమిల్లి మండలంలో 19 గ్రామాల శ్మశాన వాటికల అభివృద్ధికి నిధులు మంజూరు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడివో చింతా కళావతి పాల్గొన్నారు.

విద్యాభివృద్ధితోనే ఉన్నత శిఖరాలు
* డిఇఓ దేవానందరెడ్డి
నాగాయలంక: విద్యాభివృద్ధితోనే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని జిల్లా విద్యా శాఖాధికారి డి దేవానందరెడ్డి అన్నారు. విద్యార్థులు తాము అభ్యసించు విద్య ద్వారా మాత్రమే విద్యార్థులు జీవితంలో అత్యున్నత శిఖరాలకు చేరుకోగలుగుతారన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో పదవ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన వివిధ పాఠశాలల విద్యార్థుల అభినందన సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డిఇఓ దేవానందరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో మారుమూల ఉన్న నాగాయలంక మండలంలో పదవ తరగతిలో అధిక మార్కులు సాధించిన పలువురు విద్యార్థులను, అందుకు కృషి చేసిన ఉపాధ్యాయులను డిఇఓ దేవానందరెడ్డిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి సజ్జా గోపాలకృష్ణ, ఎంపిడివో ఎఎల్‌ఆర్‌కె ప్రసాద్, ఎంఇఓ తుంగల రామదాసు, వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

సుశిక్షణ ద్వారా పోలీసు శాఖలో రాణించాలి
* ఎస్పీ త్రిపాఠి
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం: సుశిక్షణ ద్వారానే పోలీసు శాఖలో రాణించగలరని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి అన్నారు. జిల్లా కేంద్రం మచిలీపట్నం శివారు తపసిపూడి గ్రామంలోని జిల్లా పోలీసు ట్రైనింగ్ సెంటరులో శిక్షణ పొందేందుకు వచ్చిన ట్రైనీ కానిస్టేబుల్స్‌తో గురువారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ త్రిపాఠి మాట్లాడుతూ వృత్తిలో ఎదురయ్యే సవాళ్లకు సమాధానమే సుశిక్షణ అన్నారు. కానిస్టేబుల్స్ వ్యవస్థ మీదే పోలీసు శాఖ ఆధారపడి ఉందన్నారు. ప్రతి అంశంలోనూ కానిస్టేబుళ్ల భాగస్వామ్యమే కీలకమన్నారు. శిక్షణ కాలంలో ఎటువంటి అసౌకర్యం కలిగిన తన దృష్టికి తీసుకురావాలన్నారు. శిక్షణ కాలంలో ప్రతి ఒక్కరూ పోటీతత్వం ముందుకు సాగాలన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ బివిడి సాగర్, డిటిసి వైస్ ప్రిన్సిపాల్ రమణమూర్తి, ట్రాఫిక్ డియస్‌పి హుస్సేన్, సిసిఎస్ డియస్‌పి ధర్మేంద్ర, ఎస్‌సి, ఎస్‌టి డియస్పీ తిలక్ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ వైద్యశాలల్లో ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు
కూచిపూడి: జిల్లాలోని ప్రభుత్వ వైద్యశాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని డిఎం అండ్ హెచ్‌ఓ డాక్టర్ జివిఎస్‌ఎన్ శాస్ర్తీ పేర్కొన్నారు. మొవ్వ పిహెచ్‌సిలో వైద్యులు, సిబ్బంది కొరత, భవనాల మరమ్మతులపై ఇటీవల పత్రికల్లో వెలువడిన వివిధ కథనాలపై కలెక్టర్ బి లక్ష్మీకాంతం సూచనల మేరకు గురువారం డిఎం అండ్ హెచ్‌ఓ మొవ్వ పిహెచ్‌సికి వచ్చారు. ఈ సందర్భంగా ఓపిలో రోగుల సంఖ్య బారులతీరు ఉండటం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. శిథిలమైన ఫ్లోరింగ్‌ను తిలకించారు. పిహెచ్‌సి వైద్యాధికారి డాక్టర్ శివరామకృష్ణ ద్వారా సిబ్బంది కొరతను తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాలలో 14 డాక్టర్ పోస్టులు, 16 స్ట్ఫా నర్సలు, ఎఎంఎం కొరత ఉందన్నారు. ఈ సమస్యలను పరిక్షరించేందుకు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి నివేదికను అందజేస్తామన్నారు. భవనాల మరమ్మతుకు ఇంజనీరింగ్ అధికారుల ద్వారా ఎస్టిమెట్ రూపొందించి మరమ్మతు చేపతామన్నారు. ఈ కార్యక్రమంలో సిహెచ్‌ఓ కె వెంకటరత్నం, సూపరింటెండెంట్ బి నాగేంద్రం తదితరులు పాల్గొన్నారు.

ఉద్యానవనంగా రాళ్లకుంట
* కలెక్టర్ లక్ష్మీకాంతం వెల్లడి
విజయవాడ రూరల్: విజయవాడ గ్రామీణ మండలం గొల్లపూడి గ్రామంలోని రాళ్లకుంట చెరువు ప్రాంతాన్ని పార్కుగా తీర్చిదిద్దటానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం తెలిపారు. గురువారం ఆర్డీవో ఎస్ హరీష్, తాహశీల్దార్ మదన్‌మోహన్‌తో కలిసి రాళ్లకుంట ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అమరావతితో పాటు జాతీయ రాహదారి దగ్గరలో ఉన్న రాళ్లకుంట చెరువు ప్రాంతం 6.5 ఎకరాలను పర్యాటక కేంద్రంగా ఆహ్లాదకరమైన పార్కుగా తీర్చిదిద్దేలా చర్యలు చేపడుతున్నామన్నారు. పార్కు చుట్టూ గ్రీనరీతో పాటు కూర్చునేందుకు బెంచీలు, వాకింగ్ ట్రాక్, అవసరమైన రోడ్లు, లైటింగ్ ఏర్పాటుకు ప్రతిపాదలు సిద్ధం చేయాలన్నారు. దీనికి సంబంధించిన డిజైన్ నమూనా తయారుచేయాలని, సిఆర్‌డిఏ ఆమోదం అనంతరం పనులు ప్రారంభించనున్నట్లు కలెక్టర్ లక్ష్మీకాంతం వివరించారు.

చైన్‌స్నాచర్ల హల్‌చల్
* సిసి ఫుటేజీలు సేకరించిన పోలీసులు
* పట్టించినవారికి రు.15వేలు రివార్డు
విజయవాడ (క్రైం)/పటమట: పటమటలో చైన్ స్నాచర్లు రెచ్చిపోవటంతో పోలీసులు ఖంగుతిన్నారు. గురువారం గంటల వ్యవధిలో పటమట మారుతీ కో-ఆపరేటివ్ కాలనీ, శ్రీనివాస నగర్ బ్యాంకు కాలనీ, కరెన్సీనగర్‌లో చైన్ స్నాచర్లు రెచ్చిపోయి ముగ్గురు మహిళల మెడల్లో బంగారు గొలుసు తెంచుకోవటంతో ఇటు పోలీసులకు, అటు మహిళల్లో కలవరం మొదలైంది. ఉదయం 10.30 గంటల సమయంలో మారుతీ కో-ఆపరేటివ్ కాలనీకి చెందిన మహిళా జి.ఝాన్సీ (50) రోడ్డుపై టిఫిన్ తీసుకుని ఇంటికి తిరిగి వెళుతుండగా గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి ఆమె మెడలోని 5కాసుల బంగారు నానుతాడు తెంచుకుపోయారు. ఆమె తెరుకునేలోగా చైన్ స్నాచర్లు వాహనంపై పారిపోయారు. పటమట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
శ్రీనివాసనగర్ బ్యాంకు కాలనీలో చైన్ స్నాచింగ్
పటమట శ్రీనివాసనగర్ బ్యాంకు కాలనీకి చెందిన మహిళా ఎన్. సుమతి (60) ఇంటి ముందు పూల చెట్లు వద్ద పూలు కోసుకుంటుండగా ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆమె మెడలోని 8కాసుల బంగారు గొలుసును తెంచుకుపోయారు. ఆమె కేకలు వేసేలోగా వారు అక్కడ నుండి జారుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కరెన్సీనగర్‌లో చైన్ స్నాచింగ్
ఎన్‌టిఆర్ హెల్త్ యూనివర్శిటీ ఎదురుగా వున్న కరెన్సీనగర్ రామచంద్రరరావు వీధికి చెందిన మహిళా పి.పద్మజా(47) ఉదయం సమీపంలోని ఆంజనేయస్వామి గుడికి వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకొని ఇంటికి వెళుతుండగా చైన్ స్నాచర్లు ద్విచక్ర వాహనంపై వచ్చి ఆమె మెడలోని 9 కాసులు బంగారు గొలుసును తెంచుకుపోయారు. ఆమె తెరుకునేలోగా చైన్ స్నాచర్లు అక్కడ నుండి పారిపోయారు. ఒక రోజునే పటమట పోలీసు స్టేషన్ పరిధిలో 3 చైన్ స్నాచింగ్ సంఘటనలు చోటుచేసుకోవటంతో పోలీసులు బిత్తరపోయారు. ఉదయం పూటే చైన్ స్నాచింగ్ సంఘటనలు చోటుచేసుకోవటంతో పోలీసులు సవాల్‌గా మారింది.
ఈ నేపథ్యంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు ఇద్దరు వ్యక్తులు ఎరుపురంగు బైక్‌పై సంచరిస్తూ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నట్లు సమాచారం అందింది. దీంతో నగరంలోని సిసి కెమెరా పుటేజీల ద్వారా స్నాచర్ల ఫొటోలు సేకరించారు. వీటిని పాత నేరస్తుల చిత్రాలతో మ్యాచ్ చేయగా స్నాచర్లుగా నిర్థారణైంది. నిందితులు పటమట పోలీస్టేషన్ పరిధిలో 3 స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. దీంతో అప్రమత్తమైన యంత్రాంగం నగరంలో తనిఖీలు చేపట్టారు. నిందితులు బైక్‌పై దూసుకెళ్లి మహిళల మెడలోని బంగారు నగలు తెంచుకుని జారుకోవడం పరిపాటి. ఆ తర్వాత బైక్‌ను ఏదొక పబ్లిక్ ప్రాంతంలో పార్కింగ్ చేసి కొద్దిరోజుల పాటు అలా వదిలేస్తారు. ఇప్పటికే వారు పలునేరాలకు పాల్పడినట్లు పోలీసుల వద్ద సమాచారం ఉంది. దీంతో నిందితుల కోసం ప్రత్యేక సిసిఎస్ బృందాలు గాలిస్తుండగా మరోవైపు దుండగులు చిత్రాలను పోలీసులు సోషల్ మీడియాలో విడుదల చేశారు. అదేవిధంగా పుటేజీని గుంటూరు, కృష్ణా పోలీసులకు కూడా పంపారు. దీంతో నగర సరిహద్దుల వద్ద అప్రమత్తం చేసిన పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. బస్టాండు, రైల్వే స్టేషన్‌ల వద్ద అదేవిధంగా నగరంలోని పలు పార్కింగ్‌ల వద్ద కూడా తనిఖీలు చేపట్టారు. డిసిపి కాంతి రానా టాటా నేతృత్వంలో నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మరోవైపు నిందితుల ఆచూకీ తెలియచేసిన వారికి రూ.15వేల నగదు బహుమతి డిసిపి కాంతిరాణా ప్రకటించారు.

ప్రతి పోలీస్ స్టేషన్‌లో ‘మహిళా మిత్ర’
* సిపి గౌతమ్ సవాంగ్
పటమట: మహిళా సమస్యల పరిష్కారం కోసం, వారి హక్కుల పరిరక్షణ, సమానత్వం కోసం ప్రతి పోలీసు స్టేషన్ పరిధిలో ‘మహిళా మిత్ర’ను ఏర్పాటు చేసినట్లు నగర పోలీసు కమిషనర్ డి గౌతమ్ సవాంగ్ అన్నారు. గురువారం బెంజి సర్కిల్ వద్ద వాసవ్య మహిళా మండలిలో నగర పోలీసు శాఖ, డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ, ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్, విన్నర్ వీల్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో సమాజంలో మహిళల పాత్రపై అవగాహన కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిధిగా హాజరైన సిపి గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ మహిళల సమస్యల పరిష్కారం ఒక్క పోలీసు శాఖ బాధ్యతగా అనుకోకుండా ప్రజలు, సమాజంలోని వివిధ మహిళా సంఘాలు, ఎన్జీవోలు కలిసి ఉద్యమంలా ముందుకు తీసుకువెళ్ళడం ద్వారా విజయం సాధించాలని పిలుపు నిచ్చారు. ఇప్పటికే విజయవాడలో మహిళా సమస్యల పరిష్కారం కోసం పోలీసు శాఖ కృషి చేస్తున్నట్లు, ప్రజల్లో ఆలోచన మొదలై చాలావరకు అవగాహన వచ్చిందన్నారు. ఈ క్రమంలో మహిళా మిత్ర, వృద్ధమిత్ర, బాలమిత్రల ద్వారా పలు కార్యక్రమాలు అమలు పరిస్తూ సమాజంలో మార్పు తెచ్చేందుకు ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి మహిళల రక్షణ, సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపి చెన్నుపాటి విద్య, జాయింట్ పోలీసు కమిషనర్ బివి రమణ కుమార్, డాక్టర్ కీర్తి, డిసిపి కాంతిరాణా, ఏసిపిలు, ఇన్‌స్పెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.

వెహికల్ డిపోపై కన్ను!
* కమిషనర్ నివాస్ ఆకస్మిక తనిఖీ
* అవకతవకలు బహిర్గతం
* కఠిన చర్యలు తప్పవని సిబ్బందికి హెచ్చరిక
విజయవాడ (కార్పొరేషన్): వివాదాలు, అవినీతి, అక్రమాల ఆరోపణలకు కేంద్రంగా మారిన విఎంసి వెహికల్ డిపో పనితీరును మెరుగుపర్చాలన్న విషయమై కమిషనర్ జె నివాస్ డిపోను టార్గెట్ చేశారు. ఇటీవల జరిగిన సాధారణ కౌన్సిల్ సమావేశంలో సిపిఎం ఫ్లోర్ లీడర్ గాదె ఆదిలక్ష్మి అడిగిన ప్రశ్నపై అధికార, విపక్ష కార్పొరేటర్లందరూ వెహికల్ డిపో అవినీతి, అక్రమాలు, అధికారుల నిర్లక్ష్య విధినిర్వహణలపై ఏకరవుపెట్టగా నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్ కూడా అధికారుల తీరును నిరిసిస్తూ పలు సూచనలు చేశారు. ఈ చర్చకు స్పందించిన నివాస్ వెహికల్ డిపోను ప్రక్షాళన చేసేందుకు నిర్ణయించారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం ఆకస్మిక తనిఖీ చేసిన ఆయనకు చర్చలో సభ్యులు వివరించిన అవినీతి, అక్రమాలు స్పష్టంగా కనిపించడంతో అవాక్కయ్యారు. అధికారులు, సిబ్బందికి హెచ్చరికలు చేశారు. డిపోలోని అణువణువూ చేసిన పరిశీలనలో కనీసం మస్తరు రిజిస్ట్రర్ అయినా సక్రమంగా లేని వైనాన్ని చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెహికల్ డిపోలో పనిచేసే కింది స్థాయి సిబ్బంది నుంచి ఉన్నత స్థాయి అధికారులు వరకూ బాధ్యతగా విధులు నిర్వహించకపోతే శాఖాపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మెకానిక్‌లు చేసిన పని వివరాల నమోదు కూడా లేకపోవడం గమనార్హం. కాగా అసలు ఎవరు, ఏ పని, ఎంత సేపు చేశారు, దాని వలన కలిగిన ప్రయోజనమేమిటోనన్న విషయాలను స్పష్టంగా తెలుపుతూ హిస్టరీ బుక్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. డ్రైవర్లు, క్లీనర్ల మస్తరుతోపాటు వారు విధులు నిర్వహించే వాహనాల వివరాలను అడిగి తెలుసుకొన్న నివాస్ చెత్త సేకరణ వెళ్లే సిబ్బంది మొత్తం ఉదయం 5.30 గంటల కల్లా విధులకు హాజరవ్వాలని సూచించిన సమయంలో డ్రైవర్లు తమకు చెల్లించాల్సి జీతాల విషయాన్ని ఆయన దృష్టికి తీసుకురాగా అందుకు స్పందించిన నివాస్ కాంట్రాక్టర్‌తో చర్చించి సత్వరమే జీతాలను చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వెహికల్ డిపోలోని మెకానిక్ విభాగం, స్టోర్ రూమ్, ఆయిల్ పంపింగ్ స్టేషన్, స్పేర్‌పార్ట్ జాబితా, రికార్డులను పరిశీలించిన ఆయన కనీసం మస్తరైనా సక్రమంగా నిర్వహించని అధికారుల తీరుపై మండిపడ్డారు. ప్రతి వాహనానికీ దానికి సంబంధించిన హిస్టరీ బుక్‌ను ఏర్పాటుచేసి వివరాలను నమోదు చేయాలన్నారు. రోజుకు వినియోగించిన ఆయిల్, కిలో మీటర్లు, ఎన్ని ట్రిప్పుల చెత్త తరలింపు వివరాలను కూడా సమగ్రంగా నమోదు చేయాలన్నారు. వాహనాలు తరచూ మరమ్మతులకు గురవుతున్న వైనాన్ని డ్రైవర్లను అడిగి తెలుసుకొన్న కమిషనర్ నివాస్ డ్రైవర్లకు సరైన అనుభవం లేకపోవడమేనని గుర్తించిన ఆయన ప్రత్యేకంగా అవగాహన కల్పించే చర్యలు తీసుకోవాలన్నారు. మరమ్మతులకు వచ్చే వాహనాలను ఎక్కువ రోజులపాటు నిలుపుదల చేయకుండా సత్వరమే పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని, ఇకనుంచైనా అవినీతి, అక్రమాలకు పాల్పడకుండా బాధ్యతగా విధులను నిర్వర్తించాలని పేర్కొన్నారు. ఈ పర్యటనలో ఎస్‌ఇ ఆదిశేషు, ఇఇ కె కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

ప్రశాంతంగా గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభం
* 66.37 శాతం మంది హాజరు
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు పరీక్షకు 902 మంది అభ్యర్థులకు గాను 66.37 శాతం మంది హాజరయ్యారు. గురువారం నగరంలోని బిషప్ అజరయ్య జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను కలెక్టర్ బి లక్ష్మీకాంతం పరిశీలించారు. విజయవాడ నగరంలోని నాలుగు కళాశాలల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. 1359 మంది అభ్యర్థులు మెయిన్ పరీక్షకు అర్హత సాధించారని, వీరిలో ఆరు రోజులపాటు జరిగే ఈ పరీక్షలకు మొదటిరోజైన గురువారం 902 మంది అభ్యర్థులు జనరల్ ఇంగ్లీషు పరీక్షకు హాజరయ్యారు. ఏర్పాట్ల పరిశీలనలో విజయవాడ ఆర్డీవో ఎస్ హరీష్, అర్బన్ తహశీల్దార్ ఆర్ శివరావు పాల్గొన్నారు.