కృష్ణ

నిత్యావసరాలపై తగ్గిన జిఎస్టీ వినియోగదారులకే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: నిత్యావసర వస్తువులపై తగ్గిన జిఎస్‌టి ప్రయోజనాన్ని వినియోగదారులకు అందించేందుకు కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా ఆహార సలహా మండలి సమావేశం జరిగింది. అధ్యక్షతన వహించిన జెసి చంద్రుడు ఈ సమావేశంలో జిల్లాలో అమలవుతున్న ప్రజా పంపిణీ వ్యవస్థ లోటుపాట్లు, ఈ-పాస్ అమలు, ఆహార కల్తీ, నిత్యావసరాల ధరల నియంత్రణ తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జెసి చంద్రుడు మాట్లాడుతూ రేషన్ పంపిణీలో అక్రమాలు అరికట్టేందుకు ఈ-పాస్ విధానం ప్రవేశ పెట్టి దేశానికి ఆదర్శంగా నిలిచామన్నారు. జిల్లాలో 2267 రేషన్ షాపులు పని చేస్తున్నాయని, రేషన్ దుకాణాల రేషనలైజేషన్ చేపట్టి ఒకొక్క షాపుకు 546 కార్డులకు తగ్గించామన్నారు. ఈ-పాస్ ద్వారా ఆదా అయిన రూ.1700కోట్లతో రంజాన్ తోఫా, సంక్రాంతి, క్రిస్మస్ కానుకలు అందించగలిగామన్నారు. ఎంఎల్‌ఎస్ పాయింట్లలో ఎలక్ట్రానిక్ కాటాలను జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రవేశ పెడుతున్నట్లు తెలిపారు. అందరికీ గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేయడం ద్వారా గత జూన్ 3వతేదీన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లాను పొగ రహిత జిల్లాగా ప్రకటించారని తెలిపారు. రైతు బజార్లలో రైతులకు స్టాల్స్ కేటాయింపులో అధికారుల ప్రమేయం లేకుండా ర్యాండమ్ విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి జిల్లా రాష్ట్రంలోనే 3వ స్థానంలో నిలిచిందన్నారు. 45వేల మంది రైతుల నుండి రూ.1500కోట్లు పెండింగ్ లేకుండా పంపిణీ చేశామన్నారు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ మాట్లాడుతూ ఆహార కల్తీ నివారణ, ధరల నియంత్రణ చర్యలు, తనిఖీలు ముమ్మరం చేయాలని తూనికలు, కొలతల శాఖ అధికారులను ఆదేశించారు. పేదలందరికీ నాణ్యమైన నిత్యావసర వస్తువులు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావ్ మాట్లాడుతూ ప్రజల్లో మార్పు వస్తే అవినీతికి తావు ఉండదన్నారు. ఆహార కల్తీపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబర్చి పెద్ద ఎత్తున దాడులు నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో జెసి-2 మార్కండేయులు, ఆర్డీవోలు సాయిబాబు, చక్రపాణి, చెరుకూరి రంగయ్య, డియస్‌ఓ నాగేశ్వరరావు, సలహా మండలి సభ్యులు కె వెంకటేశ్వరరావు, లంకిశెట్టి బాలాజీ, సైకం భాస్కరరావు, మజ్జి జనార్ధనరావు, పంతం గజేంద్ర, హరిబాబు, కైలాసపతి తదితరులు పాల్గొన్నారు.